BigTV English

Wayanad seat fight: రాహుల్‌‌‌‌పై పెద్దామె పోటీ, ఇంతకీ ఎవరామె?

Wayanad seat fight: రాహుల్‌‌‌‌పై పెద్దామె పోటీ, ఇంతకీ ఎవరామె?

Annie Raja filed by CPI in Rahul Gandhi’s Wayanad seat


Wayanad seat fight(Latest political news in India): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న నియోజకవర్గం వయనాడ్. అందరి దృష్టి ఇప్పుడు ఈ సీటుపై పడింది. ఇక్కడ నుంచి సీపీఐ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరోకాదు.. సీపీఐ జననల్ సెక్రటరీ డి రాజా వైఫ్ అన్నేరాజా. వయనాడు నుంచి రాహుల్ గాంధీ బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ప్రియాంకగాంధీ కూడా ఉన్నారు. ఢిల్లీ నుంచి నేరుగా కేరళ చేరుకుని అక్కడి నుంచి వయనాడ్‌కు వెళ్లారు. సమీపంలోని ఓ పట్టణంలో భారీ ఎత్తున కారు ర్యాలీ నిర్వహించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న నియోజకవర్గం వయనాడ్. ఈ సీటు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2009 నుంచి కాంగ్రెస్ వరుసగా గెలుస్తూ వస్తోంది. ఈసారి కూడా రాహుల్ గెలుపు నల్లేరు మీద నడకగానే భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. వయనాడ్‌లో తరచూ రాహుల్ పర్యటిస్తున్నారు. అక్కడి ప్రజలకు ఏ సమస్య ఉన్నా వెంటనే దాన్ని క్లియర్ చేస్తున్నారు. రాహుల్ వచ్చిన తర్వాత నియోజకవర్గం సమస్యలు వెంటవెంటనే పరిష్కారం అవుతున్నాయని స్థానిక ప్రజలే చెబుతున్నారు.


సీపీఐ అభ్యర్థి అన్నేరాజా కూడా ఇవాళే తన నామినేషన్ దాఖలు చేశారు. కేరళ అధికార పార్టీ లెఫ్ట్, డెమోక్రటిక్ ఫ్రంట్ కలిసి ఈమెని బరిలోకి దించుతున్నాయి. సీపీఐ జనరల్ సెక్రటరీ డి రాజా వైఫ్ అన్నేరాజా. సీపీఐ జాతీయ ఎగ్జిక్యూటివ్ టీమ్‌లో ఆమెకు సభ్యత్వం ఉంది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. కన్నౌర్ జిల్లాలోని ఇరిట్టిలో ఆమె జన్మించారు. సీపీఐ స్టూడెంట్ వింగ్‌లో ఆమెకు పనిచేసిన అనుభవం ఉంది. కన్నౌర్ జిల్లా సీపీఐ ఉమెన్ వింగ్ సెక్రటరీగా ఉన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్‌తోపాటు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్‌లో పనిచేసి అనుభవం గడించారు. ఈ క్రమంలో ఆమెను పోటీకి దింపింది విజయన్ సర్కార్.

ఇక బీజేపీ నుంచి సురేంద్రన్ బరిలో ఉన్నారు. ప్రస్తుతం కేరళ బీజేపీకి అధ్యక్షుడు కూడా. ఆర్ఎస్ఎస్‌తో పాటు ఏబీవీపీ స్టూడెంట్ వింగ్‌లోనూ పని చేశారు. బీజేపీలో జిల్లా స్థాయి నుంచి అంచెలంచెలుగా ఆయన ఎదిగారు. కేరళ అసెంబ్లీకి ఐదుసార్లు, లోక్‌‌సభకు మూడుసార్లు పోటీపడ్డారు. ఈసారి ఏకంగా రాహుల్‌‌‌‌పై పోటీ చేసే ఛాన్స్ ఆయన్ని వరించింది. రాజకీయ విశ్లేషకులు మాత్రం రాహుల్ విజయం తేలికని చెబుతున్నారు.

 

Tags

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×