RCB vs LSG IPL 2024 Match Turning Point Anuj Rawat Dropped Poorans Catch: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్న ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో విలవిల్లాడుతోంది. మరోవైపు విరాట్ కొహ్లీ ఉన్న ఆర్సీబీ పరిస్థితి కూడా అలాగే ఉంది. తను ఆడితే జట్టు ఆ మాత్రం స్కోరయినా చేస్తోంది. లేకపోతే చతికిల పడుతోంది.
నాలుగు మ్యాచ్ లు ఆడి, ఒక దాంట్లో విజయం సాధించి మూడింట ఓడిన ఆర్సీబీ జట్టు రేసులో వెనుకపడింది. లక్నో తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఫీల్డర్ అనుజ్ రావత్ ఒక క్యాచ్ మిస్ చేయడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.
లక్నో ఇన్నింగ్స్ 17వ ఓవర్ జరుగుతోంది. రీస్ టాప్లే వేసిన ఆ ఓవర్‌లో మూడో బంతిని నికోలస్ పూరన్ భారీ షాట్ ఆడాడు. అయితే బంతి సరిగ్గా కనెక్ట్ కాలేదు. దాంతో వికెట్లకు సమీపంలోనే బంతి గాల్లోకి లేచింది. ఫీల్డర్ అనూజ్ రావత్ చేతిలో పండులా పడింది. మనోడు దాన్ని వదిలేశాడు.
Also Read: పంత్ ? శ్రేయాస్? ఎవరు గెలుస్తారు? నేడు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్ కతా మధ్య మ్యాచ్
అప్పటికి నికోలస్ స్కోరు 3 పరుగులు మాత్రమే. ఆ లైఫ్ తో బతికిపోయిన నికోలస్ రెచ్చిపోయాడు. ఆ తర్వాత ఏకంగా ఐదు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టి స్కోరు బోర్డును 180 పరుగులు దాటించాడు. 21 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఒకవేళ ఆ క్యాచ్ పట్టి ఉంటే, లక్నో స్కోరు 150-160కే పరిమితమయ్యేది. ఆర్సీబీ గెలిచేదని అంటున్నారు. ఎందుకంటే అప్పటికే బ్యాటర్లు అందరూ అవుట్ అయిపోయారు. నికోలస్ కూడా అయిపోతే లక్నో స్కోరు కంట్రోల్ అయ్యేదని అంటున్నారు. ఆర్సీబీకి దురదృష్టం కూడా వెంటాడుతోందని అభిమానులు ఆవేదనగా కామెంట్లు పెడుతున్నారు.
ఇప్పటికి ఆర్సీబీ టేబుల్ లో 9వ స్థానంలో ఉంది. అయితే వీరేమీ బాధపడకుండా ముంబై ఇండియన్స్ వీరికన్నా దిగువన ఉన్నారు. ఇంకా 10 మ్యాచ్ లవరకు ఆర్సీబీ ఆడాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి రెచ్చిపోయి ఆడితే, ఏమైనా రేసులోకి వస్తారు.
కాకపోతే అన్నం ఉడికిందా లేదా? పట్టుకోవాలంటే ఒక మెతుకు చూస్తే చాలంట.. కానీ ఇప్పుడు మూడు మెతుకులు చూశారు. అందువల్ల ఈ సీజన్ లో కూడా ఆర్సీబీకి కప్ అందని కలేనని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.