E-Paper
Advertisement

Chandrayaan-3 Success: ఇక సౌర మండలమే టార్గెట్.. భారత్ సరికొత్త చరిత్ర: మోదీ

Chandrayaan-3 Success: ఇక సౌర మండలమే టార్గెట్.. భారత్ సరికొత్త చరిత్ర: మోదీ
Advertisement
chandrayaan-3 pm modi

Chandrayaan-3 Success: చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ అయింది. చందమామపై భారత్ చెరగని సంతకం చేసింది. చంద్రుడి దక్షిణధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. యావత్ భారతదేశం గర్వంతో ఉప్పొంగింది. ఇస్రో బృందాన్ని అంతా అభినందనలతో ముంచెత్తారు.

ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా నుంచి చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను లైవ్‌లో చూశారు. చంద్రయాన్ 3 సక్సెస్‌తో కొత్త చరిత్రను సృష్టించారని ఇస్రోను ప్రశంసించారు. ఇకపై సౌరమండలంపైనా పరిశోధనలు చేస్తామని చెప్పారు. గగన్‌యాన్ సైతం గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఆకాంక్షించారు. మానవాళికి ఉపయోగపడే ప్రయోగాలు పెంచుతామని చెప్పారు ప్రధాని మోదీ.

Advertisement

ఇస్రోకు మద్దతుగా నిలిచిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు ఛైర్మన్ సోమనాథ్. చంద్రయాన్‌-2 నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయని.. వచ్చే 14 రోజులు ఎంతో ఆసక్తికరమని అన్నారు. సూర్యుడి గురించి అన్వేషణకు ఆదిత్య ఎల్‌-1ను వచ్చే నెలలో లాంచ్‌ చేస్తున్నామని ప్రకటించారు.

Tags

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×