TDP Vs YSRCP In Chittoor: ఉమ్మడి చిత్తూరు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలలో అధికార కూటమి నేతలపై దాడులు జరుగుతున్నా కనీసం పోలీసులు సీరియస్‌గా యాక్షన్ తీసుకోవడం లేదు. దాడులకు పాల్పడ్డమే కాకుండా మరో వైపు వైసీపీ నేతలే ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క తిరుపతి జిల్లాలో తప్ప మిగతా జిల్లాలలో ఎందుకు పోలీస్ బాస్ లు సీరియస్ యాక్షన్ లోకి దిగడం లేదు? క్యాడర్ మనం అధికారంలో ఉన్నామా? ప్రతిపక్షంలో ఉన్నామా? అని గగ్గోలు పెడుతున్నా అటు నాయకులు సైతం అధికారులు తమ మాట వినడం లేదని చేతులెత్తేస్తున్నారంట. అసలా ఉమ్మడి జిల్లాలో ఏం జరుగుతుంది?
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం తడుకుపేట వద్ద జనవరి రెండో తేది సాయంత్రం ఓ అమ్మాయిని వైసీపీ కార్యకర్త వేధించారు. దాన్ని గమనించిన టీడీపీ మండల నాయకుడు పురుషోత్తమ్ సీరియస్ గా అబ్బాయికి వార్నింగ్ ఇచ్చాడు. అమ్మాయిని వేధించడం సరికాదన్నారు ..సరికాదన్న పురుషోత్తమ్‌పై తడుకు పేటకు చెందిన వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా దాడి చేసారు. దాడిలో గాయపడిన పురుషోత్తమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో పోలీసులు వైసీపీ క్యాడర్ ను తెచ్చి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ లో ఉంచి తర్వాత వదిలేసారు.
తమ వారిని పోలీసుస్టేషన్‌కి తీసుకెళ్లడం అవమానంగా భావించిన అక్కడ పాతుకు పోయిన వైసీపీ నాయకుడు గాంధీ తన అనుచరులను పురుషోత్తమ్ గ్రామానికి అర్ధరాత్రి పూట పంపించాదు.. వారు దొరికిన వారిని దొరికి నట్లు తీవ్రంగా దాడి చేసి గాయపర్చారు. చివర్లో గ్రామస్తులంతా ఒక్కటై వైసీపీ క్యాడర్ మీద ఎదురుదాడి చేయడంతో వారంతా పరారయ్యారు. ఈ ఘటనలో అక్కడ వదిలేసిన మోటార్ బైక్‌లను స్థానిక యువత ఆగ్రహంతో తగలబెట్టారు .. గాయపడిన వారంతా అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆ ఘటనకు సంబంధించి పోలీసులు గాంధీ అతని అనుచరుల మీద కేసు నమోదు చేసామంటున్నారు కాని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించలేదంట. జిల్లా ఎస్పీ కనీసం రివ్యూ కూడా చేయలేదని తెలుస్తోంది.. దీనికంతటికి కారణం ఎష్పీ తాను సమ న్యాయం పాటిస్తానంటున్నాడంట.. తనకు పోస్టింగ్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం కాదు ఎన్నికల కమిషన్ అంటున్నాడంట. ఇలాంటి పరిస్థితుల్లో గత అయిదేళ్లు వైసీపీ పాలనలో అష్టకష్టాలు అనుభవించిన టీడీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. ప్రాణాలు పణంగా పెట్టి టీడీపీని గెలిపించుకుంటే తమకీ పరిస్థితి ఏంటని డైరెక్ట్‌గా చంద్రబాబునే ప్రశ్నిస్తున్నాయి.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓ వ్యాపారి అరుగాలం కష్టించి ఓ ఇంటిని కొనుగోలు చేసాడు. అయితే ఆ ఇంటి ని అమ్మిన వ్యక్తి ఓ వైసిపి నాయకుడికి బాకీ ఉన్నాడంట. అది తెలియకుండా సదరు వ్యాపారి ఇంటిని కొనుగోలు చేసి మరమత్తులు చేయించుకున్నాడు. ఆ ఇంట్లోకి వైసిపి నాయకుడు తన అనుచరులతో ప్రవేశించి ఇంట్లో ఉన్న షోకేస్‌లతో పాటు కింద పర్చిన టైల్స్ ద్వంశం చేసాడు. వాహనాలు తగలబెట్టించాడు. అలా ఏకంగా అరు లక్షల వరకు నష్టం చేకూర్చాడంట.
అదేంటని అడిగితే నీకు ఇంటిని అమ్మిని వ్యక్తి నాకు బాకీ ఉన్నాడు. వాడు పోన్ ఎత్తడం లేదు.. అందుకే నీ ఇంటిని ధ్వంశం చేస్తున్నాను.. కాబట్టి నువ్వు ఇప్పుడు ఫోన్ చేస్తే వాడు వస్తాడు. అందుకే నీ ఇంటిని ద్వంశం చేస్తున్నానని హెచ్చరించాడంట. దాంతో బాధితుడు 100 ఫోన్ చేస్తే వచ్చిన ఓ ఎస్ఐ దాడికి పాల్పడ్డ వైసిపి నాయకుడికి సలామ్ చేసి అన్న మీచేతికి గాయం అయ్యింది ముందు అసుపత్రికి వెళ్ళండి అంటు సకల మర్యాదలతో పంపిచాడంట. ఆ దాడిపై కేసు కూడా నమోదు చేయలేదంట. చివరకు అర్యవైశ్య నాయకుల అందోళన ఫలితంగా ఓ పెట్టీ కేసు పంపించారంట.
అదే మదనపల్లిలో అయ్యప్ప భక్తుడిపై బీదర్ కు చెందిన మైనార్డీ వ్యక్తి దాడి చేసి పట్టణాన్ని అల్లకల్లోలం చేస్తే అతని మీద కూడా చిన్న కేసు పెట్టి పంపించేశారు. దాంతో పాటు మలకల చెరువు ఎంపిడివో కార్యాలయంలోకి వచ్చి ఎంపిడివోను బెదిరించి మినిట్స్ బుక్ లాక్కున్న ఎంపీపీ, జడ్పీటీసీలపై కనీసం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదంట. పోలీసు బాస్ లు సీరియస్‌గా లేకపోబట్టే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల అరాచకాలు అలా కొనసాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Also Read: ఓడిపోగానే అమెరికా జంప్.. పర్చూరులో వైసీపీకి దిక్కెవరు?
ఇలాంటి ఘటనలలో దాడులకు పాల్పడ్డ వైసీపీ నాయకులు ఆరోపణలతో ఎదురు దాడి చేస్తుండటం గమనార్హం. తిరుపతి జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మైనర్ బాలిక ఇష్యూలో చేసిన ఎదురు దాడిని స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎస్పీ సుబ్బరాయుడు ధీటుగా ఎదుర్కున్నారు. అయితే నగరి ఇష్యూలో దాడి తర్వాత మాజీ మంత్రి రోజా అయితే దళితులపై దాడి అంటు కొత్త పల్లవి ఎదుర్కున్నారు. అయితే అమ్మాయిని ఇబ్బంది పెట్టారు అన్న వాస్తవం అమె బయటకు చెప్పడం లేదు. అదే విధంగా తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి కోర్టుకీడుస్తానని ఎంపిడివోను బెదిరించిన పోన్ కాల్ బయటకు వచ్చింది.
తాజాగా జరుగుతున్న పరిణామాలు తెలుగు తమ్ముళ్లలో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. గతంలో చిత్తూరు ఎస్పీగా ఉన్న రిషాంత్ రెడ్డి, అదే విధంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్ లు ఏకంగా చంద్రబాబు మీద కేసులు పెట్టారు.. దాంతో పాటు తెలుగు తమ్ముళ్లను జైలుపాలు చేసి వేధించారు .. అంతే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఎక్కడి కక్కడ వైసీపీ చోటా నాయకుడు చెప్పినా జీ హూజుర్ అంటు సలామ్ చేసారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తమ మీద దాడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి మహా ప్రభూ అని స్థానిక ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్లి టీడీపీ కేడర్ వాపోవాల్సి వస్తుంది. అలా వెళ్ళిన వారితో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని సదరు నేతలు అంతర్గత సంభాషణల్లో అంటున్నారంట.. ఆ క్రమంలో వైసీసీ హయాంలో అష్టకష్టాలు పడ్డ కేడర్ అధికారంలోకి వచ్చాక కూడా తమ పరిస్థితి మారడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబుకే తమ గోడు వెళ్లబోసుకుంటుంది.
మొత్తం మీదా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి నాయకులు మనం అధికార పక్షంలో ఉన్నామో? ప్రతిపక్షంలో ఉన్నామో? తెలియని అయోమయంలో కనిపిస్తుంది. 2019 కి ముందు అలా చేయడంతోనే అప్పట్లో క్యాడర్ పనిచేయక పోవడంతో పార్టీ దెబ్బతిందని ఇప్పటికైనా సియం చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు వైసీపీ విధేయత లేకుండా సక్రమంగా పనిచేసే పోలీస్ బాస్ లను సీమ జిల్లాలకు పంపాలని కోరుతున్నారు.
లేక పోతే 2029 ఎన్నికలకు కాదు స్థానిక సంస్థల ఎన్నికలలోగా క్యాడర్ చేతేలేత్తేసి పరిస్థి తి ఉంటుందని అంటున్నారు. అధికారులకు సైతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బలమైన మంత్రి లేక పోవడంతో అడింది అట పాడింది పాటగా మారిందని విమర్శిస్తున్నారు. నూతన సంవత్సరంలోనైనా క్యాడర్ గురించి ఆలోచించి.. అధికారుల వైఖరిపై కఠిన నిర్ణయాలు తీసుకోక పోతే మరో సారి 2019 రీపిట్ అవుతుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.