Brahmamudi serial today Episode: రాత్రికి అందరూ భోజనాల దగ్గర కూర్చుని ఉండగా రాజ్, కావ్య వస్తారు. భోజనం చేద్దురు ఫ్రెష్ అయి రండి అని చెప్పగానే.. తమకు ఆకలిగా లేదని చెప్పి ఇద్దరూ పైకి వెళ్లిపోతారు. సరే మనమైనా తిందాం అని ప్రకాష్ అనగానే వాళ్లు బయట ఇష్టమైన ఫుడ్ తిని వచ్చి మనల్ని ఇంట్లో ఆ ఆకుకూరలు తినమంటున్నారు. మాకేం వద్దు ఈ ఫుడ్ అంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మీ, రాహుల్ వెళ్లిపోతారు. ఇదిరాదేవి బాధపడుతుంది. తర్వాత అన్ని డిజైన్స్ ఆఫీసులో చూసి రాజ్ సంతోషంగా ఫీలవుతాడు. సూపర్ డిజైన్స్ అద్బుతంగా ఉన్నాయి.
ఈ క్రెడిట్ అంతా నీదే అంటూ కావ్యను మెచ్చుకుంటాడు రాజ్. అంటే డిజైన్స్ బాగున్నాయన్నమాట అంటుంది కావ్య. నేను అప్రూవల్ చేశానటే రాజముద్ర పడినట్టే అంటాడు రాజ్. అందరూ కంగ్రాట్స్ చెప్తుంటే.. ఇవి మనకు నచ్చితే కాదు జగదీష్ గారికి నచ్చాలి అంటుంది కావ్య. రేపు వచ్చి జగదీష్ గారు ఇదే మాట అంటారు అని సెక్యూరిటీని పిలిచి అందరూ సెక్యూరిటీ గార్డ్స్ అలర్ట్‌గా ఉండాలి. ఎవ్వరూ పడుకోవడానికి వీలులేదు. వీటిని లాకర్‌లో పెట్టు అని చెప్తాడు. సెక్యూరిటీ అవి తీసుకెళ్లి లాకర్‌లో పెడతాడు. సెక్యూరిటీకి జాగ్రత్తలు చెప్పి రాజ్, కావ్య వెళ్లిపోతారు.
అనామిక మందు తాగుతుంటే కంగారుగా వచ్చిన సామంత్ అనామిక చేతిలో గ్లాస్ లాక్కుని తాగుతుంటాడు. ఏయ్ ఏంటిది కావాలంటే ఇంకో పెగ్గు ఇచ్చేదాన్ని కద అంటుంది. ఇవ్వు అందులో కాస్త విషం కలిపి ఇవ్వు అంటాడు సామంత్. ఏం మాట్లాడుతున్నావు.. మతుండే మాట్లాడుతున్నావా..? అని అనామిక తిడుతుంది. ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే నీకు కూడా మతి పోతుంది అంటాడు సామంత్. ఆ తర్వాత నువ్వు కూడా నాలాగా ఒక్క పెగ్గుతో ఆపవు.. పుల్ బాటిల్ తాగుతావు అంటాడు.
అసలు ఏమైంది సామంత్ నీకు అని అనామిక అడగ్గానే.. ఆ రాజ్ కుటుంబాన్ని నాశనం చేస్తానన్నావు. ఆ కంపనీని రోడ్డు మీదకు తీసుకొస్తానన్నావు కానీ అక్కడ వాళ్లు గెలుస్తున్నారు అని చెప్తాడు. ఇంతలో అనామిక ఫోన్ తీసుకుని రాజ్ ఆఫీసులో డిమోట్ అయి సెక్యూరిటీగా ఉన్న వ్యక్తికి ఫోన్ చేస్తుంది. నేను ఒక డూప్లికేట్ కిరీటం పంపిస్తాను. వర్జినల్ కిరీటం తీసి నాకు పంపంచి డూప్లికేట్ కిరీటం అక్కడ పెట్టు అని చెప్తుంది. సెక్యూరిటీ సరే అంటాడు. సామంత్ హ్యాపీగా ఫీలవుతాడు. వామ్మో ఎంత తెలివి నీది అంటూ అనామికను మెచ్చుకుంటాడు.
రాజ్ వచ్చి రిలాక్స్ గా పడుకోగానే కావ్య నిద్ర లేపుతుంది. ఏడు వారాల నగలు ఇన్‌టైంలో రెడీ చేసి ఇస్తాం అని చెప్పాము కదా..? వాటికి సబంధించిన వర్క్ ఉంది కదా..? మీరెందుకు పడుకున్నారు అని అడుగుతుంది. గుర్తుంది కానీ ఇప్పుడు టైడ్‌గా ఉన్నాను. రేపు ఎర్లీ మార్నింగ్ లేచి చేస్తాను అంటూ పడుకోబోతుంటే.. అయ్యో ఏంటండి మీరు మిస్టర్ ఫర్పెక్ట్ లాగా రేపటి పని కూడా ఇవాళే చేసే మీరు ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారు అంటుంది.
అసలు ఇంతలా పీక మీద కూర్చుని నిద్ర పోనివ్వకుండా టార్చర్ చేయడం సరికాదు. ఇది కూడా గృహ హింస కిందకు వస్తుంది. ఇవాళ నన్ను ప్రశాతంగా పడుకోనివ్వవే అంటూ పడుకోబోతుంటే..కావ్య మళ్లీ నిద్ర లేపాలని పిలిచినా రాజ్ వినకుండా పడుకుంటాడు. ఆఫీసు దగ్గర పరిస్థితి ఏంటి అని సెక్యూరిటీకి ఫోన్ చేసి కనుక్కుంటుంది. అంతా సరిగ్గానే ఉందని సెక్యూరిటీ చెప్తారు.
ఆఫీసులో సెక్యూరిటీగా డిమోట్ అయిన మేనేజర్ టీ లో నిద్ర మాత్రలు కలిపి సెక్యూరిటీ వాళ్లందరికీ ఇస్తాడు. టీ తాగిన కొద్ది సేపటికే అందరూ నిద్రపోతారు. ఇంతలో అనామిక మనిషి వచ్చి సెక్యూరిటీకి లాకర్ కీస్, డమ్మీ కిరీటం ఇచ్చి వెళ్తాడు. అవి తీసుకుని లోపలికి వెళ్లిన సెక్యూరిటీ కిరీటం మార్చేస్తాడు. అదే విషయం అనామికకు ఫోన్ చేసి చెప్తాడు. నేను ఇచ్చేస్తానన్న డబ్బు ఇస్తాను అని అనామిక చెప్తుంది.
ఉదయం శృతి, రాజ్‌కు ఫోన్ చేసి మీటింగ్ ఒక గంట పోస్ట్ ఫోన్ అయిందని చెప్తుంది. సరే అంటాడు రాజ్. ఇంతలో కావ్య కాఫీ తీసుకుని వస్తుంది. రాజ్ ఇంకా పడుకుని ఉండటం చూసి నిద్ర లేపుతుంది. ఆఫీసుకు వెళ్లాలి లేట్ అవుతుంది అని చెప్పగానే.. ఒక గంట తర్వాత లేస్తాను అంటాడు రాజ్. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?