BigTV English

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై రచ్చ.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై రచ్చ.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

Miss World 2025: మిస్ వరల్డ్.. బ్యూటీ విత్ పర్పస్.. ఈ మెగా బ్యూటీ ఈవెంట్ 72వ ఎడిషన్ కు తెలంగాణ వేదికైంది. ప్రపంచమంతా ఇటువైపే చూసే వరల్డ్ క్లాస్ ఈవెంట్ ఇది. మే 7 నుంచి మే 31 వరకు ఈ అందాల పోటీలు జరగబోతున్నాయి. గతేడాది ముంబై ఈ ఈవెంట్ ను హోస్ట్ చేసింది. ఇప్పుడు హిస్టారికల్ అండ్ ఐటీ సిటీ హైదరాబాద్ గ్రాండ్ వెల్కమ్ చెబుతోంది. ఒక్క ఈవెంట్ మల్టిపుల్ బెనిఫిట్స్ అన్నట్లుగా దీన్ని నిర్వహించేలా రేవంత్ సర్కార్ ప్లాన్ చేసింది. మిస్ వరల్డ్ ఈవెంట్ తో తెలంగాణ స్టామినా ప్రపంచానికి చాటే అవకాశం అవకాశం దొరికింది.


హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 72వ ఎడిషన్

మిస్ వరల్డ్ మెగా బ్యూటీ కాంటెస్ట్ ఓ స్పెషల్ ఈవెంట్. 72వ ఎడిషన్ హైదరాబాద్ లో మే 7 నుంచి 31వ తేదీ వరకు జరగబోతోంది. మొత్తం 140 దేశాలకు పైగా పోటీదారులు రాబోతున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. విదేశీ అతిథులకు ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్క ఈవెంట్ తో తెలంగాణ రాష్ట్రానికి మల్టీ బెనిఫిట్ ఉండేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.


నెల రోజులు 140 దేశాల అటెన్షన్ పొందేలా ప్లాన్

వరల్డ్ క్లాస్ ఈవెంట్ ను నిర్వహించడమే కాదు.. దీన్నుంచి మల్టీ బెనిఫిట్ పొందేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నిజానికి నెల రోజుల పాటు 140 దేశాల అటెన్షన్ గ్రాబ్ చేసేలా ఈ మెగా ఈవెంట్ ను కండక్ట్ చేయనుంది. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్​ పోటీలకు తెలంగాణను ఎంచుకున్నట్టు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లీ గతనెలలో ప్రకటించారు. అయితే ఈ ఈవెంట్ గతేడాది ముంబైలో జరిగింది. ఈ సారి కూడా పోటీ గట్టిగానే ఉన్నా.. ప్రభుత్వ చొరవతో హైదరాబాద్ కు వచ్చేలా చేశారు. మిస్ వరల్డ్ కాంటెస్ట్ ప్రపంచంలోనే చాలా ఓల్డెస్ట్ బ్యూటీ ఈవెంట్. మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం, ఫిట్ నెస్, సోషియో అవేర్ నెస్, సోషల్ సర్వీస్ లక్ష్యంగా ఇందులో విజేతలు ఎంపికవుతారు.

ఆతిథ్యం మాత్రమే ప్రభుత్వ బాధ్యత

మిస్ వరల్డ్ ఈవెంట్ హైదరాబాద్ కు వస్తే బెనిఫిట్ ఏంటి? ప్రభుత్వ సొమ్ము వృధా అవడం తప్ప ఉపయోగం ఉందా అన్న ప్రశ్నలకు జవాబుల్ని డీకోడ్ చేద్దాం. నిజానికి ఈ ఈవెంట్ కు 55 కోట్లను ప్రభుత్వం కేటాయించిందంటున్నారు. అయితే అనుమతులు, అవసరాలు తీర్చేలా మాత్రమే ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. మిగితాదంతా మిస్ వరల్డ్ లిమిటెడ్ చూసుకోనుంది. వీటితో పాటే.. హైదరాబాద్ , తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచమంతా చాటి చెప్పేలా అద్భుతమైన స్ట్రాటజీని రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ చేసి పెట్టింది.

హైదరాబాద్ ను మరో లెవెల్ లో నిలిపేలా చర్యలు

ఈ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు 140 దేశాల నుంచి కంటెస్టెంట్లు, వారి ప్రతినిధులు, మీడియా సిబ్బంది రాబోతున్నారు. వీరందరికీ తెలంగాణ కల్చర్, హిస్టారికల్ ఇంపార్టెన్స్, టూరిజం ఇంపార్టెన్స్ ను పరిచయం చేయబోతోంది. అంటే నెలరోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్ లో భాగంగా 140 దేశాలకు తెలంగాణ ప్రాధాన్యాన్ని వివరించేలా కార్యక్రమాలు, ట్రిప్స్ ను అరేంజ్ చేసింది. వీరందరినీ బ్రాండ్ తెలంగాణ, బ్రాండ్ హైదరాబాద్ ను ప్రమోట్ చేసేలా ఉపయోగించుకోబోతోంది. యంగెస్ట్ స్టేట్ తెలంగాణ.. అద్భుతమైన ప్రగతి ప్రయాణంలో ఇదో కీలక ఈవెంట్ గా నిలిచిపోనుంది. అద్భుతమైన కనెక్టివిటీ, వరల్డ్ క్లాస్ ఎయిర్ పోర్ట్, ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, ఐటీ ఇండస్ట్రీ, హెల్త్ హబ్, వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్ గా పేరున్న హైదరాబాద్ ను మరో లెవెల్ లో నిలపడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ఇక్కడ సేఫ్టీ, స్నేహపూర్వక వాతావరణం వరల్డ్ టూరిస్టులకు ఒక గొప్ప అనుభూతిని ఇచ్చేలా చూసుకుంటున్నారు.

20 ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఈవెంట్స్

మిస్ వరల్డ్ పోటీలు అంటే యావత్ ప్రపంచమంతా అటెన్షన్ హైదరాబాద్ వైపే ఉంటుంది. ఈ సిచ్యువేషన్ ను అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. వివిధ దేశాల నుంచి వచ్చే పోటీదారులు, ప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు అతిథి మర్యాదల విషయంలో ఎక్కడా లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. హైదరాబాద్ కు వచ్చే అతిథులందరినీ తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల కోసం వేదికలు రెడీ అవుతున్నాయ్. ఇప్పటికే మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా యాదగిరి గుట్ట, చౌమహల్లా ప్యాలెస్ సహా హైదరాబాద్ లోని టూరిజం స్పాట్లను విజట్ చేసి తన అనుభవాలను పంచుకున్నారు. భారత్ లో భిన్నత్వంలో ఏకత్వం తనకు నచ్చుతుందని, తెలంగాణ ఆతిథ్యం బాగుందని కితాబిస్తోంది.

హైదరాబాద్​, పోచంపల్లి, వరంగల్, నాగార్జున‌‌‌‌‌‌‌ కొండ

మిస్ వరల్డ్ పోటీలకు వివిధ దేశాల నుంచి వచ్చే పోటీదారులు, ప్రతినిధులకు హైదరాబాద్​, పోచంపల్లి, వరంగల్, నాగార్జున‌‌‌‌‌‌‌ కొండ, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, రామప్ప లాంటి చారిత్రక, కళాత్మక ప్రాంతాలతో పాటు యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, మేడారం, జోగులాంబ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తారు. వీటితో పాటే అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్స్, అనంతగిరి, లక్నవరం లాంటి టూరిజం డెస్టినేషన్స్ ను చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో టూరిజానికి భారీ బూస్టప్, ప్రమోషన్ వచ్చేలా చూసుకుంటున్నారు. ఈ ప్రాంతాల దగ్గర కూడా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు. ఇటీవలే ప్రభుత్వం తీసుకొచ్చిన టూరిజం పాలసీకి మిస్ వరల్డ్ ఈవెంట్స్ తో మెగా బూస్టప్ వచ్చేలా చూసుకుంటున్నారు. ఒక్క ఈవెంట్ తో ఏకంగా 140 దేశాల్లో ప్రమోషన్ అంటే మాటలు కాదు. ఇండియా టూర్ వచ్చిన వారు కచ్చితంగా హైదరాబాద్ సహా తెలంగాణ టూరిస్ట్ స్పాట్లను విజిట్ చేసేలా ప్రమోట్ చేయబోతున్నారు.

క్రిస్టినా పిస్కోవా..
ప్రస్తుత మిస్ వరల్డ్..
దేశం చెక్ రిపబ్లిక్..
AI బొమ్మ కాదు..
అందం.. ఆత్మవిశ్వాసం కలబోత ఆమె సొంతం..

ఇప్పుడు క్రిస్టినానే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్.. అవును.. యాదగిరి గుట్టపై గులాబీ రంగు చీర కట్టులో మెరిసినా.. భాగ్యనగరంలో చారిత్రక ప్రాంతాల్లో ముస్తాబై తిరిగినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు నలుదిశలా చాటడంలో, టూరిజానికి కొత్త రూపు తేవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మిస్ వరల్డ్ ఎక్కడుంటే అక్కడ దేశ విదేశీ పబ్లిసిటీ మన ప్రాంతాలకు వస్తోంది. మెగా ఈవెంట్ కు ఇంకా టైమ్ ఉన్నా.. క్రిస్టినాను ఈ గ్యాప్ లో తెలంగాణ టూరిజం ప్రాంతాలకు తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించేలా కార్యాచరణ రెడీ అయింది.

టాంజానియాలో పిల్లల కోసం క్రిస్టినా స్కూల్

క్రిస్టినా లా, బిజినెస్ మేనేజ్ మెంట్ చదువుతూనే మోడలింగ్ లోకి అడుగు పెట్టారు. మిలాన్, పారిస్, దుబాయ్, ఇస్తాంబుల్, వియన్నా ఫ్యాషన్‌ వీక్‌ల్లో పాల్గొన్నారు. పేద పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు టాంజానియాలో ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసింది. వృద్ధులు, మానసిక వికలాంగుల కోసం సేవా కార్యక్రమాలు చేపట్టింది. తనవంతుగా ఎంతో సోషల్ సర్వీస్ చేస్తోంది. ఇండియా అంటే ఎంతో అభిమానం పెంచుకుంది. ఇప్పుడు తెలంగాణకు వచ్చాక, ఇక్కడి ఆతిథ్యం చూశాక మరింత సంబరపడుతోంది. తెలంగాణ జరూర్ ఆనా అంటోంది. అంతే కాదు.. మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో జూలియా మోర్లీ కూడా తెలంగాణలో మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు.

అందాల పోటీలపై బీఆర్ఎస్ విమర్శలు

సో ఒకవైపు అద్భుతంగా బ్రాండింగ్ పెరుగుతున్న ఈ టైంలో విపక్షం బీఆర్ఎస్ సీన్ లోకి ఎంటరైంది. హైదరాబాద్‌లో ఫార్ములా E రేసు కోసం 46 కోట్లు ఖర్చు చేసి తప్పు చేశారని, కేసులు పెట్టారని, అందాల పోటీని నిర్వహించడానికి మాత్రం 200 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేయడం కరెక్టేనా అంటూ కేటీఆర్ అంటున్నారు. అసలు ఫార్ములా ఈ రేసింగ్ లో నిధుల విడుదల పద్ధతి ప్రకారం జరగలేదన్నది అభియోగం. ఇప్పుడు అన్ని రకాలుగా కరెక్ట్ ఫార్మాట్ లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నది ప్రభుత్వం చెబుతున్న మాట.

ఎవర్ని ఉద్ధరించడానికి ఈ అందాల పోటీలు అంటూ కేటీఆర్ విమర్శలు

ఎవర్ని ఉద్ధరించడానికి ఈ అందాల పోటీలు అని కేటీఆర్ అంటుంటే.. మహిళలకు 2500 పక్కన పెట్టి 250 కోట్లతో అందాల పోటీలేంటని హరీష్ రావు విమర్శిస్తున్నారు. ఈ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ కు ప్రాపర్ చానల్స్ ద్వారా వచ్చింది. దీంతో ఇండియా వరుసగా రెండో ఏడాది కూడా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించే అవకాశం వచ్చింది. 71వ ఎడిషన్ ముంబైలో జరిగింది. అక్కడ పిస్కోవా మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది.

ఈవెంట్ ను విమర్శిస్తున్న వారికి జూపల్లి కౌంటర్

ఈ మిస్ వరల్డ్ పోటీలు టూరిజం డెవలప్ మెంట్ కు, సొసైటీకి, అవేర్ నెస్ కోసం ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయని ఈ ఈవెంట్ ను విమర్శిస్తున్న వారికి మంత్రి జూపల్లి ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. సో ఉద్దేశం మంచిదైతే ప్రయోజనాలు ఆటోమేటిక్ గా వస్తాయని ప్రభుత్వం నమ్ముతోంది. అందుకే ఈ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×