East Godavari Crime News: అక్రమ సంబంధాలు పచ్చని కాపురంలో చిచ్చుపెడుతున్నాయి. దీనిబారిన చనిపోతున్నవాళ్లు కొందరైతే.. చంపించేవారు మరికొందరు. అలాంటి కోవలోకి చెందినది ఈ స్టోరీ. తన ఏకాంతానికి తండ్రి అడ్డు చెప్పారన్న కోపంతో రగిలిపోయింది. చివరకు తండ్రిని చంపేసింది కూతురు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది.
అసలేం జరిగింది?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఈ దారుణం చోటుచేసుకుంది. 22వ వార్డు మేదర పేట వీధిలో సూరా రాంబాబు అనే వ్యక్తి ఉంటున్నాడు. అతడి కూతురు పేరు వెంకట దుర్గ. స్థానికంగా ఉండే వస్త్రాల షాపులో పని చేస్తోంది. అదే సమయంలో రామచంద్రపురం కొత్తూరుకు చెందిన ముమ్మిడివరపు సురేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఫ్రెండ్ షిప్‌కు దారి తీసింది. ఆ తర్వాత వివాహేతర సంబంధం వైపు మళ్లింది.
వెంటకదుర్గ స్టోరీ ఇంతవరకు బాగానే సాగింది. రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయని భావించింది. తనకు తిరుగులేదని అనుకుంది. అయితే వెంటకదుర్గ తన ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో తండ్రి కంటిలో పడింది. కూతురు ఇలాంటి పాడు పని చేసిందా అని ఛీదరించుకున్నాడు. ఆ తర్వాత ఆగ్రహంతో రగిలిపోయాడు తండ్రి రాంబాబు.
దుర్గ ప్లాన్ రివర్స్, ఆపై తండ్రి టార్గెట్
అదే సమయంలో షాపు నుంచి ఇంటికి వచ్చిన కూతురుపై మండిపడ్డాడు. పరువు తక్కువ పని చేశావంటూ మందలించాడు. ఆనాటి నుంచి తండ్రిపై పగ పెంచుకుంది కూతురు దుర్గ. రోజురోజుకూ కూతురులో ఆవేశం పెరుగుతోంది. ప్రియుడి మోజులో పడ తండ్రిని ఎలాగైనా చంపాలనే నిర్ణయానికి వచ్చేసింది. ప్రియుడు సురేష్‌తో కలిసి హత్యకు స్కెచ్ వేసింది.
ALSO READ: మత్తుమందిచ్చి మహిళలతో ఆ పని చేసే దొంగబాబా
ఈ నెల 16న తండ్రి రాంబాబు ఒంటరిగా నిద్రపోతున్నాడు. ఇదే అదనుగా భావించిన వెంకటదుర్గ, ప్రియుడు సురేష్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. రాంబాబు తనకు తోడుగా స్నేహితుడు తీసుకొచ్చాడు. ఈ ముగ్గురు కలిసి మంచంపై నిద్రిస్తున్న రాంబాబు దారుణంగా చంపేశారు. ఒకరు రాంబాబు ఛాతిపై కూర్చొని మరొకరు పీక నులిమి హత్య చేశారు.పైకి ఏమీ తెలీనట్టు వ్యవహరించింది వెంకటదుర్గ.
చిన్నాన్న ఫిర్యాదుతో ఎస్కేప్‌కు ప్లాన్
కాకపోతే ఓ వైపు ఆమెని టెన్షన్ వెంటాడుతోంది. తెల్లవారిన తర్వాత మృతుడి సోదరుడు పండు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించాడు. అక్కడ కనిపించిన ఆనవాళ్లు ప్రకారం తన సోదరుడ్ని కావాలనే ఎవరో చంపారని అనుమానం వ్యక్తం చేశారు. కూతురు దుర్గపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు, ఇంటికి వచ్చి పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
ఇంటి నుంచి విశాఖపట్నం పారిపోతున్న దుర్గ, ఆమె ప్రియుడు, మరొక ఫ్రెండ్‌ని అరెస్ట్ చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపెట్టింది దుర్గ. గురువారం ముగ్గురు నిందితులను రామచంద్రపురం కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి వారికి రెండువారాలు రిమాండ్ విధించారు. కన్న తండ్రి పోయి.. సుఖం కోసం ఆశపడి జీవితాన్ని జైలు పాలైంది దుర్గ.