PCB on Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament )
ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నమెంట్ లో ఛాంపియన్ గా టీమిండియా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన న్యూజిలాండ్… రన్నరప్ గా నిలవడం జరిగింది. అయితే.. హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్ టోపీ 2025 టోర్నమెంట్ జరిగిన నేపథ్యంలో… పాకిస్థాన్ లో కొన్ని మ్యాచ్లు మిగిలినవి దుబాయ్ లో ( Dubai) జరిగాయి. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు తీవ్ర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.ఐసీసీ నిధులు సరిపోలేదని… అలాగే పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ చూసేందుకు జనాలు ఎక్కువగా రాలేదని కూడా ప్రచారం జరుగుతోంది. దానికి తోడు పాకిస్తాన్ క్రికెట్ టీం ( PCB )ఈ ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో దారుణంగా విఫలమైంది. పాకిస్తాన్ జట్టు సరిగ్గా ఆడక పోవడంతో లోకల్ ఫాన్స్ కూడా స్టేడియానికి పెద్దగా రాలేదని ఈ సమాచారం. దుబాయ్ లో జరిగే మ్యాచ్ లకు విపరీతంగా క్రౌడ్ కూడా వచ్చింది.
Also Read: Shardul Thakur LSG: శార్దూల్ కు అదిరిపోయే ఆఫర్.. లక్నో కీలక ప్రకటన ?
భద్రతా కారణాల వల్ల విదేశీ అభిమానులు కూడా ఎక్కువగా పాకిస్తాన్ వెళ్లలేదు. దాంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ లాంటి ఐసీసీ ఈవెంట్లు నిర్వహిస్తే ఖచ్చితంగా ఆ స్థానిక బోర్డు కు మంచి లాభాలు వస్తాయి. కానీ పాకిస్తాన్ కు.. నష్టాలే వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ప్రచారం పైన తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదని తాజాగా ఆ క్రికెట్ బోర్డు చైర్మన్ ప్రకటించారు. నష్టాలు కాదు తమకు 86.25 కోట్ల లాభాలు కూడా వచ్చినట్లు తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ తమ దేశంలో నిర్వహించినందుకు మంచే జరిగిందని పేర్కొంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అనవసరంగా తమ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తప్పుడు ప్రచారం చేయకూడదని కోరింది.
Also Read: Chahal Dhanashree Divorce: చాహల్-ధనశ్రీ విడాకులలో ట్విస్ట్.. అప్పుడే మంట మొదలైంది..?
మేము అనుకున్న దాని కంటే కాస్త తక్కువ వచ్చినప్పటికీ… తమకు బాగానే జరిగిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. అనవసరంగా తప్పుడు ప్రచారం చేసి కక్ష సాధిస్తున్నారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఫైర్ అయింది. ఐసీసీ ఛాన్స్ ఇస్తే మరిన్ని ఐసీసీ టోర్నమెంట్లు నిర్వహిస్తామని కూడా తెలిపింది. ఈ విషయంలో వెనక్కి తగ్గలేదని… క్లారిటీ ఇస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సభ్యులు. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ దేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో స్థానిక జట్టు దారుణంగా విఫలమైంది. ఆడిన ఒక్క మ్యాచ్లో కూడా పాకిస్తాన్ గెలవలేదు. తమ సొంత గడ్డపై.. పూర్తిగా అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది.
🚨 PCB SAYS NO LOSS FOR CT. 🚨
– PCB claims 86.25cr INR profit for hosting 2025 Champions Trophy in Pakistan. pic.twitter.com/UJuYiJRscu
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 21, 2025