BigTV English

Ayodhya Ram Mandir : మంగళ ధ్వనితో మొదలు.. మంగళ హారతితో సంపూర్ణం..!

Ayodhya Ram Mandir : మంగళ ధ్వనితో మొదలు.. మంగళ హారతితో సంపూర్ణం..!
Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు మంగళ వాయిద్యాల సందడితో మొదలైంది. వివిధ రాష్ట్రాలకు చెందిన 50కి పైగా సంగీత ప్రముఖులతో 2 గంటలపాటు ఈ సంగీత కార్యక్రమం సాగనుంది. ఈ వేడుకకు హాజరయ్యే అతిథులు ఉదయం 10:30 గంటలకు రామజన్మభూమి కాంప్లెక్స్‌లోకి ప్రవేశిస్తారు.


అనంతరం శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్రం అందించిన ఆహ్వాన పత్రిక అందుకున్న అతిథులు ప్రధాన ఆలయ మండపం వద్దకు చేరుకుంటారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మధ్యాహ్నం 12:20 గంటలకు, మృగశిర నక్షత్ర సమయాన ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12:29 నిమిషాల 08 సెకన్ల నుండి 12:30 నిమిషాల 32 సెకన్ల లోపు.. అంటే.. 84 సెకన్లలో పూర్తవుతుంది.

ఈ ప్రతిష్ఠాపనను కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో 121 మంది వేద ఆచార్యులు నిర్వహిస్తారు. ఈ సమయంలో.. 150కి పైగా సంప్రదాయాలకు చెందిన సాధువులు, మత పెద్దలు, 50 మందికి పైగా గిరిజనులు, తీరప్రాంత వాసులు, ద్వీపవాసులు కూడా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.


రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో ‘రామజ్యోతి’ వెలిగించి.. దీపావళి తరహాలో ఘనంగా వేడుకల్ని నిర్వహిస్తారు. అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఉన్న ‘రామ్ కీ పౌరి’ వద్ద 5 లక్షల దీపాలు వెలిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో పాటు దుకాణాలు, సంస్థలు, ఇళ్లు, ఇతర పౌరాణిక ప్రదేశాల్లో రామజ్యోతిని వెలిగించనున్నారు. రామ్‌లల్లా, హనుమాన్‌గర్హి, గుప్తర్‌ఘాట్, సరయూ బీచ్, కనక్ భవన్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ కంటోన్మెంట్ సహా 100 దేవాలయాలు, ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో దీపాలు వెలిగిస్తారు.

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిశాక.. హారతి కార్యక్రమంలో భక్తులు పాల్గొనేందుకు ఆలయ ద్వారాలు తెరుస్తారు. ఆలయంలో మూడు రకాల హారతులు నిర్వహిస్తారు. రోజూ ఉదయం 6.30, మధ్యాహ్నం 12.00, రాత్రి 7.30 గంటలకు మూడు హారతులు నిర్వహించడం జరుగుతుంది. అయితే.. ఈ హారతి వేడుకకి పాస్ అవసరం. ఆ పాస్‌లను ఉచితంగానే జారీ చేస్తారు. ఇక ఆలయంలో దర్శనం ఉదయం 7 నుండి 11:30 వరకు.. మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 వరకు ఉంటుంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×