BigTV English

Harry Brook : ఎందుకో తెలీదు.. ఇంగ్లాండ్ జట్టు నుంచి కీలక ఆటగాడు అవుట్..!

Harry Brook : ఎందుకో తెలీదు.. ఇంగ్లాండ్ జట్టు నుంచి కీలక ఆటగాడు అవుట్..!
Harry Brook

Harry Brook : టీమ్ ఇండియాతో ఐదు టెస్ట్ సిరీస్ మ్యాచ్ లు జరగనున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. మిడిల్ ఆర్డర్ లో అద్భుతంగా ఆడే కీలక  ఆటగాడు హ్యారీ బ్రూక్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతను ఇంగ్లాండ్ తిరిగి వెళ్లిపోయాడు.


ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు అబుదాబిలో ఉంది. అక్కడే ముమ్మర ప్రాక్టీసు చేస్తోంది. ఈ సమయంలోనే టెస్ట్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న హ్యారీ బ్రూక్ వెళ్లిపోవడం, ఇంగ్లీషు జట్టుకి పెద్ద దెబ్బని అంటున్నారు. ఎందుకంత అత్యవసరంగా వెళ్లాడనేది తెలీదు. దయచేసి హ్యారీ బ్రూక్ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లవద్దని మీడియాని ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కోరింది.  

ఇప్పటివరకు 12 టెస్టు మ్యాచులు ఆడిన బ్రూక్.. 62.15 సగటుతో 1,181 రన్స్ చేశాడు. గత రెండేళ్లుగా ఇంగ్లాండ్ టెస్టు విజయాల్లో బ్రూక్‌ది కీలక పాత్రగా మారింది. టెస్ట్ మ్యాచ్ ల్లో కూడా వన్డే తరహాలో పరుగులు చేయడం ఇతడి ప్రత్యేకత. బ్రూక్ ఇప్పటివరకు నాలుగు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు చేశాడు.


హ్యారీ బ్రూక్‌ స్థానంలో మరో ప్లేయర్‌ని భారత్‌తో సిరీస్‌కు సర్రే బ్యాటర్ డాన్ లారెన్స్‌ ఇంగ్లీషు జట్టులోకి ఎంపిక చేసింది. 26 ఏళ్ల లారెన్స్ ఇప్పటివరకు 11 టెస్టు మ్యాచులు ఆడాడు. 29 సగటుతో 551 పరుగులు చేశాడు. అతను సరాసరి హైదరాబాద్ రానున్నాడని బోర్డు తెలిపింది.

మొత్తానికి ఇంగ్లీషు జట్టు గట్టి దెబ్బే తిన్నాది. అదీకాక 2023 వన్డే వరల్డ్ కప్ లో 7వ స్థానానికి పడిపోయి ఘోర అవమానంతో ఉన్న ఇంగ్లాండ్ జట్టు, ఆ పరిస్థితి నుంచి బయటపడాలని చూస్తోంది. అయితే ప్రస్తుతం టెస్ట్ ఛాంపియన్ షిప్ లో రెండో స్థానంలో ఉన్న ఇండియా, ఇంకా ర్యాంకు మెరుగుపరుచుకుని టాప్ లోకి వెళ్లాలని చూస్తోంది. దీంతో రెండు జట్ల మధ్య టెస్ట్ పోరు హోరాహోరీగా మారే అవకాశాలున్నాయి.

భారత్‌తో టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్),  జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, జో రూట్, జేమ్స్ అండర్సన్, గస్ అట్కిన్సన్, డాన్ లారెన్స్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్,  

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×