Big Stories

Qatar Indian Navy officers Release | కతార్‌లో మరణ శిక్ష పడిన భారత నేవీ ఆఫీసర్లు విడుదల.. తెరవెనుక అసలేం జరిగింది?

- Advertisement -

Qatar Indian Navy officers Release | ఇండియాకు చెందిన 8 మంది రిటైర్డ్ నేవీ ఆఫీసర్లు.. అది కూడా normal navy officers కాదు high rank officers. వీరిలో కొందరు.. gold medal awards సాధించినవారైతే.. ఒకరు pravasi Bharatiya Samman award పొందారు. వీళ్లకు కతర్ దేశంలో ఉరిశిక్ష విధించారు. అది కూడా గూఢాచర్యం కేసులో మరణ శిక్ష.. అంటే ఇది సామాన్య విషయం కాదు. ఈ 8 మంది అధికారులు చాలా నెలల పాటు కతార్ జైలులోనే ఉండి.. ఇటీవలే ఇండియా తిరిగివచ్చారు. అయితే ఈ కేసు గురించి ఇండియా లేదా కతార్ పూర్తి వివరాలు వెల్లడించలేదు.

- Advertisement -

కానీ ఈ కేసులో పాకిస్తాన్, ఇజ్రాయెల్ కనెక్షన్ ఉందని తేలింది. ఏమిటా వివరాలు.. ఎందుకు కతర్ కోర్టు ఈ సీరియస్ శిక్ష విధించిందో తెలుసుకుందాం.

కేసు గురించి చెప్పే ముందు కతార్ దేశంలోని పరిస్థితుల గురించి చెప్పాలి. 1916 నుంచి బ్రిటీషర్ల పాలనలో కతార్ ఉంది. అయితే 1939లో కతార్ దేశం పక్కన ‘జెబెల్ దుఖన్’ ప్రదేశంలో పెట్రోల్ నిక్షేపాలు బయటపడతాయి. ఈ ప్రదేశం కతార్‌కి south west directionలో ఉంది. ఆ తరువాత 1971లో కతార్‌కు స్వాతంత్ర్యం వస్తుంది. బ్రిటీషర్లు.. కతార్ విడిచి వెళ్లిపోతారు. కానీ అదే సంవత్సరంలో కతార్‌కు మరో జాక్ పాట్ లభిస్తుంది. కతార్ పక్కనే Persian Gulfలో Natural Gas నిక్షేపాలు బయటపడతాయి. ఈ ఏరియా మొత్తం కతార్ ఎకనామిక్ జోన్ కిందకు వస్తుంది.

అయితే అప్పటివరకు కతార్ ఆదాయం, సెక్యూరిటీ అంతా బ్రిటీష్ ఆర్మీ చేతిలో ఉండేది. కానీ బ్రిటీషర్లు వెళ్లిపోయిన తరువాత కతార్‌పై సౌదీ అరేబియా పెత్తనం చెలాయించేది. ఇదంతా కతార్ రాజుకు ఇష్టముండేదికాదు. పైగా ఇప్పుడు కతార్ చిన్నదేశమైనా.. ఆ దేశంలో ఉన్న పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నిక్షేపాల వల్ల ఎక్కడలేని డబ్బులు రావడంతో ఖజానా నిండిపోయేది. అందుకే అప్పటి కతార్ రాజు హమాద్ బిన్ ఖలీఫా అల్ థానీ(Hamad Bin Khalifa Al Thani) Saudi Arabia నాయకత్వానికి దూరంగా ఉండాలని భావించారు. అందుకే తమ దేశ సెక్యూరిటీ విషయంలో Saudi Arabia సహాయం అవసరం లేదని చెప్పారు. కానీ అదంత సులువు కాదు.

కతార్ చాలా చిన్న దేశం.. total population 27 lakhs కంటే తక్కువ. అంటే కతార్ దేశం.. ఇండియాలో ఒక సిటీ లాంటిది అంతే. కతార్ జనభాలో దాదాపు 7 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు.

కతార్ చిన్న దేశమైనా.. చాలా రిచ్. అందుకే దేశ భద్రత కోసం కతార్.. అమెరికాని సంప్రదించింది. తమ దేశంలో అమెరికన్ ఎయిర్ బేస్ నిర్మించాలని అడిగింది. అలా 1990లో అమెరికా అల్ ఉదైద్‌లో ఎయిర్ బేస్ నిర్మించింది. ప్రస్తుతం ఈ ఎయిర్ బేస్‌లో 10000 మంది అమెరికన్ సైనికులున్నారు. ఇదంతా సౌదీ అరేబియా, దుబాయ్ దేశాలకు నచ్చేదికాదు. పైగా ఆ సమయంలో అమెరికా, సౌదీ అరేబియా మధ్య మంచి సంబంధాలు లేవు. కానీ కతార్‌కు అమెరికా అండదండలుండడం చూసి ఏమీ చేయలేకపోయారు. మరోవైపు అమెరికా, కతార్ దేశాల మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది.

అయితే కతార్.. రాజు చాలా తెలివికలవాడు.. ఒక్క అమెరికాపైనే ఆధారపడకుండా జర్మని, టర్కీ దేశాలతో కూడా దేశ రక్షణ విషయంలో ఒప్పందాలు చేసుకున్నాడు. పెద్ద అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకొని.. మిలిటరీ, నేవిని కూడా బలంగా ఏర్పర్చుకున్నాడు.

సరే ఇక విషయానికి వస్తే.. కతార్‌‌కు geographicalగా 35000 square కిలోమీటర్ల ఉన్న బౌండరీ చుట్టూ సముద్రం ఉంది. పైగా కతార్ పక్కనే ఉన్న persian gulfలో నేచురల్ గ్యాస్ నిధులున్నాయి. కతార్ ఖజానాకు ప్రధాన ఆదాయం నేచురల్ గ్యాస్ నుంచే వస్తుంది. అందుకే కతార్ రాజు నేవీని బలోపేతం చేయడానికి ఎక్కువ ఫోకస్ పెట్టాడు. Advance technology ఉన్న యుద్ధ నౌకలు, sub marines వంటివి తన నేవీలో ఉండాలని అనుకున్నాడు. Navy Securityని outsource చేశాడు. ఇండియా నేవీ అధికారులు కూడా కతార్ నేవీ అధికారులతో చాలా సార్లు నేవీ డ్రిల్స్ చేసిన సందర్భాలున్నాయి.

అలా 2015 సంవత్సరంలో కతార్ పక్క దేశం ఒమాన్‌కు చెందిన రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి.. ఖమీస్ అల్ అజ్మీ.. ఒక defence consultancy company స్థాపించాడు. ఆ కంపెనీ పేరు Dahra Global Technologies. ఈ కంపెనీ head office.. Oman capital muscatలో ఉండగా.. మరో బ్రాంచ్ ఆఫీస్.. కతార్ రాజధాని దోహలో ఉంది.

ఈ కంపెనీ ఏం చేస్తుందంటే.. ఏదైనా దేశానికి.. భద్రతా సేవలందించడం.. మిలటరీ equipment training ఇవ్వడం.. మిలటరీ logistics, armyకి maintenance services provide చేయడం వంటివి చేస్తుంది. ఈ కంపెనీ అంతర్జాతీయ లెవెల్‌లో పనిచేస్తోంది.

ఈ క్రమంలో ఈ కంపెనీ ఓనర్ అయిన ఖమీస్ అల్ అజ్మీ.. కతార్ దేశ మిలిటరీ జెనెరల్ Tariq Al Khalid (తారిఖ్ అల్ ఖాలిద్)కు ఒక ప్రపోజల్ పంపిస్తాడు. కతార్ నేవి maintenance services contract తమ కంపెనీ ఇవ్వమని. కతార్ మిలిటరీ జెనెరల్ కూడా కతార్ నేవీ maintenance contractని Dahra Global servicesకి ఇచ్చేస్తాడు.

ఈ contract దొరకగానే 2015-16లో.. ఈ కంపెనీ వెంటనే నేవీ సీనియర్ అధికారులు కావాలని hiring ప్రారంభిస్తుంది. ఈ processలోనే ఇండియా నుంచి దాదాపు 75 మంది నేవీ అధికారులు ఈ కంపెనీలో చేరుతారు. ఈ 75 మందిలో ఎక్కువగా retired navy officers ఉన్నారు. వీరిలో 8 మంది senior పదవులలో చేరుతారు.

ఇప్పుడు ఈ 8 మంది ఇండియన్ senior navy officersపైనే ఈ కేసు నడిచింది.

ఈ 8 మందిలో టాప్ positionలో ఉన్నది.. Commander Purnendu Tiwari. ఆయన ఈ కంపెనీలో Managing Directorగా join అయ్యారు.

మిగతా ఏడు మందిలో ముగ్గురు Navtej Singh Gill, Commander Sugunakar Pakala, Captain Bk Varma.. ఈ ముగ్గురూ.. కంపెనీలో Naval Directorsగా ఉద్యోగం పొందారు.

మరో ముగ్గురు Commander Amit Nagpal, Commander Sk Gupta, Captain Saurabh Vasisht.. executive Roleలో చేరారు.

మిగిలిన ఒక్కడు.. Ragesh. ఆయన కంపెనీలో ఒక sailorగా ఉంటారు. ఇలా మొత్తం 8 మంది భారతీయ నేవీ అధికారులు దహరా గ్లోబల్‌లో నాలుగేళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు.


అయితే 2016లో కతార్ రాజు.. తన నేవీలో మంచి టెక్నాలజీ ఉన్న submarines తీసుకురావాలని భావిస్తాడు. అందుకే ప్రపంచంలోనే submarines తయారీలో ఫేమస్ అయిన ఇటలీ దేశ కంపెనీలను కతార్ అధికారులు సంప్రదిస్తారు.

ఇటలీకి చెందిన FINCANTIERI(ఫిన్ కెన్ టెయిరీ) పెద్ద SHIP BUILDING కంపెనీతో కతార్ అధికారులు చర్చలు జరిపే సమయంలో Dahra Global Technologies కూడా ఎలాంటి naval ships కావాలి.. ఎలాంటి submarines కావాలో Inputs ఇస్తుంది. అంతా బాగా జరిగిపోతూ ఉంటుంది.

ఈ క్రమంలోనే Indian Government.. Dahra Global Technologies MD Commander Purnendu Tiwariకి Pravasi Bharitya Samman Award ఇస్తుంది. ఇలా ఒక రిటైర్డ్ అధికారికి ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి. కతార్‌లో ఉండే Indian Ambassador Deepak Mittal కూడా ఓసారి Dahra Global Technologies ఆఫీసకు వెళ్లి.. అక్కడ పనిచేసే ఇండియన్ నేవీ ఆఫీసర్స్‌ని ప్రశంసిస్తారు. కతార్‌తో ఇండియా relations మరింత బలోపేతం చేసేవిధంగా పనిచేయాలని కూడా అంటారు.

ఇక్కడి నుంచి సమస్య మొదలవుతుంది. Persian Gulf సముద్ర ప్రాంతంలో ఒక్క ఇరాన్ దేశం మాత్రమే ఒక స్పెషల్ submarine ఉంది. ఈ Submarineలో stealth technology ఉంది. అంటే నీటి లోపల ఉన్నప్పుడు ఎవరు దీన్ని కనిపెట్టలేరు. ఇలాంటి submarines యుద్ధ సమయంలో బాగా ఉపయోగపడతాయి. లేదా శత్రు దేశాల submarines,నేవీ షిప్స్‌పై నిఘా పెట్టవచ్చు.

అందుకే ఇలాంటి stealth technology ఉన్న Submarine కావాలని కతార్ నేవీ అధికారులు 2020లో ఇటలీ కంపెనీ FINCANTIERIతో చర్చలు జరుపుతారు. అయితే ఇదంతా రహస్యంగా జరిగే చర్చలు. ఈ చర్చల్లో Dahra Global Technologies తరపున ఇండియన్ నేవీ ఆఫీసర్స్ కూడా పాల్గొంటారు. ఈ చర్చలన్నీ ఇటలీలో జరుగాయి.

కానీ May 17 2021 రోజున.. మీడియాలో ఈ చర్చలకు సంబంధించిన సమాచారం ముఖ్యంగా stealth technology Submarine deal గురించి లీక్ అయిపోతుంది. Submarine dealకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా బయటికి రావడంతో కతార్ రాజు మండిపడతారు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన డీల్.

గల్ఫ్ ప్రాంతంలో ఇజ్రాయెల్.. అరబ్బు దేశాలపై పెత్తనం చెలాయిస్తోంది. ఇరాన్‌తోపాటు, కతార్ వద్ద కూడా stealth technology Submarine వస్తే.. ఇజ్రాయెల్‌పై నిఘా పెట్టవచ్చనేది కతార్ ఉద్దేశం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ deal గురించి ఇజ్రాయెల్‌కు గానీ, ప్రపంచానికి గానీ తెలియకూడదు. రహస్యంగా ఉండాల్సిన డీల్ ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది.

మరోవైపు stealth technology Submarine కోసం ఇండియా, పాకిస్తాన్ మధ్య కూడా పోటీ జరుగుతోంది. ఇలాంటి Submarine మరొకరికి దొరకకూడదని రెండు దేశాలు ఎత్తులు.. పై ఎత్తులు వేస్తున్నాయి. పాకిస్తాన్‌తో కూడా కతార్‌కు మంచి సంబంధాలున్నాయి.

సీక్రెట్ Submarine డీల్ గురించి మీడియాకు ఎవరు లీక్ చేశారని కతార్ ప్రభుత్వం విచారణ ప్రారంభిస్తుంది. డీల్ జరిగే సమయంలో

ఈ క్రమంలో 2022 August 30 అర్ధరాత్రి Dahra Global Technologies కంపెనీ సీనియర్ ఆఫీసర్స్ అయిన 8 మంది ఇండియన్స్‌ని అరెస్టు చేశారు. కారణం.. సీక్రెట్ Submarine డీల్ చర్చల సమయంలో వీరంతా ఉన్నారు. అందుకే ఇండియన్ నేవీ అధికారులను అరెస్టు చేసి సాలిటరీ జైలుతో పెడతారు. సాలిటరీ జైలు అంటే ఒక్క జైలు గదిలో ఒక్కరే ఉండాలి. అందుకే వీరంతా ఒకరితో ఒకరు మాట్లాడడానికి కూడా వీలు ఉండదు. ఆ సమయంలో కంపెనీ ఓనర్ ఖమీస్ అల్ అజ్మీ దేశంలో ఉండడు. నెల రోజుల తరువాత అతను కతార్ వచ్చినప్పుడు అతడిని అరెస్టు చేస్తారు. కానీ ఒమాన్ ప్రభుత్వం చర్చలు జరిపి అతడిని విడిపిస్తుంది.

భారత నేవీ అధికారులు అరెస్టు అయినట్లు ఎవరికీ తెలియదు. కానీ ఒక నెల తరువాత పాకిస్తాన్ మీడియా ఈ వార్తను బయటపెడుతుంది. 8 మంది ఇండియన నేవీ అధికారులు spying caseలో కతార్ జైలులో ఉన్నారని. ఇది తెలిసి ఈ అధికారుల families Govt of Indiaని సంప్రదిస్తాయి. వాళ్లను విడిపించమని కోరుతాయి.

ఆ తరువాత కతార్‌లోని ఇండియన్ అంబాసిడర్ దీపక్ మిత్తల్, ఇతర భారత అధికారులు స్పెషల్ permission తీసుకొని.. జైలు కెళ్లి 8 మంది అధికారులను కలుస్తారు.

అయితే ఆ తరువాత కూడా ఈ 8 మందిని ఎందుకు అరెస్టు చేశారనే విషయం రహస్యంగానే ఉంటుంది.
ఈ క్రమంలో భారత ప్రభుత్వం.. కతార్ అధికారులతో చాలాసార్లు చర్చలు జరుపుతారు. ఈ 8 మందిని విడుదల చేయమని.. కానీ కతార్ ప్రభుత్వం వివరణ ఇస్తూ..

ఈ 8 మంది తమ సీక్రెట్ submarine deal గురించిన సమాచారం ఇజ్రాయెల్‌కు చేర్చినట్లు ఆధారాలున్నాయని చెబుతుంది. submarineలో stealth technology తయారుచేసేందుకు ఉపయోగించే meta material గురించి important విషయం కూడా ఇజ్రాయెల్ చెప్పారని inform చేస్తుంది.

మరోవైపు ఈ 8 మంది అరెస్టు గురించి ఇండియాలో అందరికీ తెలిసిపోవడంతో.. ఇండియాలోని నేవీ అధికారులంతా అరెస్టు అయిన వారిని విడిపించాలని డిమాండ్ చేస్తారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని 2022 డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ నాయకుడు మనీష్ తివారి పార్లమెంటులో మాట్లాడుతారు.

కానీ భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. 2023 మార్చిలో అరెస్టు అయిన ఇండియన్ నేవీ అధికారులకు బెయిల్ పైన విడువల చేయాలని కోర్టులో పిటిషన్ వేసినా కోర్టు reject చేసింది. పైగా ఈ కేసు వివరాలు రహస్యంగా ఉంచాలని ఆదేశించింది. అందుకే కేసు పూర్తి వివరాల గురించి మీడియా ఎంత అడిగినా.. వీళ్ల లాయర్స్ కూడా బయటపెట్టలేదు. విచారణ సమయంలో కూడా కోర్టులో prosecution, two defense lawyers and witness తప్ప మరెవరూ ఉండేవారు కాదు. ఈ కేసు గురించి ఎక్కువగా ప్రయత్నించిన Indian Journalistని కతార్ ప్రభుత్వం అతని familyతో సహా ఇండియాకు పంపించేసింది.

Read more : నీళ్లు నమిలిన సోషల్ మీడియా దిగ్గజాలు.. టీనేజర్ల ఆత్మహత్యలపై అమెరికా పార్లమెంటులో రచ్చ

మరోవైపు కేసు నడిచే సమయంలో Dahra Global Technologies official website కొంతకాలం పనిచేయదు. కంపెనీలో పనిచేసే 75 మంది ఇండియన్స్‌ని ఉద్యోగం నుంచి తొలగించేసినట్లు తెలుస్తుంది. ఈ కంపెనీలో కతార్ ప్రభుత్వం అన్ని contracts రద్దు చేసి మరో కంపెనీకి ఇస్తుంది. ఈ కొత్త కంపెనీలో ఇండియన్స్‌ని ఉద్యోగంలో తీసుకోకూడదని కతార్ ప్రభుత్వం conditions పెడుతుంది.

ఆ తరువాత అక్టోబర్ 26 2023 రోజు కతార్ కోర్టు ఈ 8 మంది ఇండియన్ నేవి ఆఫీసర్స్‌కు మరణ శిక్ష విధిస్తుంది. ఇక్కడి నుంచి భారత ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వస్తుంది. ఎందుకంటే ఒమాన్ ప్రభుత్వం తమ పౌరుడు, కంపెనీ ఓనర్‌ని కతార్ జైలు నుంచి విడిపించుకుంది.. కానీ ఇండియా అలా ఎందుకు చేయలేకపోతోందని అన్ని వైపుల నుంచి pressure వస్తుంది. ఈ కేసులో కతార్ పై కోర్టులో అప్పీలు చేసింది భారత్ కానీ ఫలితం కనబడలేదు.

అయితే ఒక్కసారిగా ఫిబ్రవరి 12 సాయంత్రం.. ఈ 8 మంది ఇండియన్ నేవి ఆఫీసర్స్ జైలు నుంచి విడుదలై భారత దేశం చేరుకున్నారు. ఇదెలా జరిగిందో ఇంతవరకూ సమాచారం లేదు.

అయితే ఈ కేసులో Indian Foreign Minister Jaishankar చొరవ తీసుకున్నారని.. ప్రధాని మోదీ కూడా కతార్ రాజుతో చర్చలు చేశారనే ఊహగానాలున్నాయి.ప్రధాన మోదీ ఇటీవల కతార్‌తో నేచురల్ గ్యాస్ డీల్‌ని 2048 వరకూ పొడిగించారని వార్తలు వచ్చాయి. మరో ప్రచారం ఏమిటంటే డిసెంబర్ 18న కతార్ నేషనల్ డే సందర్భంగా కతార్ రాజు కొంత మంది ఖైదీలను విడుదల చేస్తుంటారు.. అలా వీరంతా విడుదలయ్యారని.

ఏది ఏమైనా.. ఉరిశిక్ష పడ్డ ఇండియన్ నేవీ ఆఫీసర్స్ సురక్షితంగా ఇండియాలో తమ ఇళ్లకు చేరుకోవడం.. సంతోషకరమైన విషయం.. అలాగే కతార్‌తో డిప్లొమెటిక్ పరంగా ఇండియా విజయం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News