Huzurabad Politics: బీజేపీ కీలకమైన పదవులలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయా?.. ఒకే పార్టీలో ఉన్నా వేర్వేరు నియోజకవర్గాల నుండి ఎంపీలుగా ఉన్నా వారిద్దరూ ఒకే జిల్లాకి చెందినవారు కావడంతో ఇప్పుడు ఆ పార్లమెంటు పరిధిలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం లో మాత్రం వారు రెండు గ్రూపులు గా విడిపోయారట. ఇప్పటికే పార్టీ పదవుల పంపకాలలో తేడాలు రాగా ఇప్పుడు ఈటలకు స్థానికసంస్థల ఫివర్ పట్టుకుందట .నీ సెగ్మెంట్ నువ్వు చూసుకో.. నా సెగ్మెంట్ లో నీకేం పని అని ఆయన బండి గాలి తీస్తున్నారంట.. తనని నమ్ముకున్న వాళ్ళని అవసరం అయితే వేరేపార్టీ భీపాంలు ఇచ్చి అయినా గెలిపించుకుంటా నని ఈటల వార్నింగ్ ఇస్తున్నాంట.. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు లు చేసేదాక పోయిందంట..
బండి సజయ్, ఈటల మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలు
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ నుండి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపిగా ఉన్న ఈటల రాజేందర్ ల మధ్య విభేధాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. హుజురాబాద్ పార్టీ నేతల విషయంలో మొదలైనా వివాదం రోజురోజుకు ముదురిపోతుందనే చర్చ నడుస్తోందట. కొంతకాలంగా వీరిద్దరి మధ్య వర్గపోరు నడుస్తుండగా.. ఇద్దరి మధ్య పేర్లు ప్రపస్తావించకుండానే డైలాగ్ వార్‌కి దిగారట. ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గర పడుతున్నా వేళ మరోకసారి విభేదాలు భగ్గుమంటున్నాయి. బీజేపీలో ఉన్నది ఒక్కటే మోడీ గ్రూపు పదేపదే చెబుతున్నాగాని హుజురాబాద్ నియోజకవర్గం లో మాత్రం బండిసంజయ్,ఈటల రాజేందర్ వర్గాలుగా విడిపోయాయి. అయితే ఇప్పుడు అదే వర్గపోరు ఈటల రాజేందర్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తుందట. తనని వెంబడి నడిచిన తన అనుచరులకి విలువలేకుండా పోతుందోనని ఈటల నిత్యం అగ్రహావేశాలతో రగిలిపోతున్నాడట.
హుజూరాబాద్ నుంచి వరుస విజయాలు సాధించిన ఈటల
ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపిగా ఉన్నాగాని హుజురాబాద్ నియోజకవర్గానికి ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది… అక్కడి నుండి వరుస విజయాలతో గులాబీ పార్టీ నుంచి ఉండి, రెండు సార్లు మంత్రిగా పనిచేసి విభేదాల కారణంగా బీజేపీలో చేరి కాషాయకండువా కప్పుకొన్నారు. ఉప ఎన్నికలలో కేసీఆర్‌తో సై అంటే సై అని ఘన విజయం సాధించారు. కాని తరువాత జరిగిన పరిణామాలతో హుజురాబాద్ ఎన్నికలలో ఓడిపోవడం ,మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి ఎంపిగా గెలవడం జరిగిపోయాయి..అయితే శాసనసభ హుజురాబాద్ ఓడిపొయాక చాలరోజుల వరకూ హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలమీద,నాయకుల మీద కీనుక వహించి చాలరోజులు హుజురాబాద్ కి దూరంగా ఉండిపోయాడు. కానీ తాను బీజేపీలో విజయం సాధించారు.
ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్‌కు హుజూరాబాద్‌లో మంచి మెజారిటీ
తన హయాంలో కిందస్థాయి క్యాడర్ బలంగా తయ్యారయ్యిందని. ఎంపిగా బండిసంజయ్ గెలుపులో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటి వచ్చిందనేది ఈటల అభిప్రాయపడుతున్నారు. కానీ జిల్లా, మండల కమిటీల నియామకం లో ఈటల రాజేందర్ అనుచరులకి ప్రాతినిధ్యం దక్కకపోవడంతో అప్పట్లో చాలా ఘాటుగానే విమర్శలు చేశారు. తాజాగా భారతీయ జనతా పార్టీలో విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై తాజాగా హుజురాబాద్ పార్టీ శ్రేణులు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసారు. శామీర్‌పేటలోని ఈటీల నివాసం వద్ద వారు చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సద్దుమణగలేదు.
ఫార్వర్డ్ బ్లాక్ టికెట్లు ఇప్పిస్తానని అనుచరులకు ఈటల హామీ
అయితే దసరా పండుగకి కమలాపూర్ లోని ఇంటికి వచ్చిన ఈటల రాజేందర్ వద్ద ఆయన అనుచరులు స్థానికసంస్థల ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చారట .టికెట్ రాకపోతే ఎవ్వరూ బాధపడవద్దని అవసరమైతే అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లాంటి పార్టీనుండి టికెట్ ఇప్పించి గెలిపించుకుంటానని హామీఇవ్వడం ఇప్పుడు కమలంపార్టీలో కలకలం రేపుతోందంట. జాతీయపార్టీ బీజేపీలో ఉంటూ మరో పార్టీ నుండి టికెట్ ఇప్పిస్తానని ఎలా హామి ఇస్తాడని హుజురాబాద్ బీజేపి క్యాడర్ మండిపడుతున్నా రట. కొత్త నాయకులు, పాత నాయకులు అంటూ అ వర్గం, ఈ వర్గం అంటూ విభజిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
ఇతర పార్టీ టికెట్ ఎలా ఇప్పిస్తానంటారని అసంతృప్తి
పార్టీ నిర్ణయాలకి కట్డుబడి ఉండక వి, ఇతర పార్టీ టికెట్ ఎలా ఇప్పిస్తానంటారని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నరట. హుజురాబాద్ లో ఉంది బీజేపీ పార్టీనేనని..ఈటల.వ్యక్తిగత దుకాణం కాదని చర్చించుకుంటున్నారట. అయితే ఈటల వ్యాఖ్యలని సిరియస్ గా తీసుకున్న కరీంనగర్ బిజేపి అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో పాటుగా మరికొంత నాయకులు రాష్ట్ర అధ్యక్షుడుని కలిసి తమ అవేదనని తెలియజేశారట. హుజురాబాద్ నియోజకవర్గం బీజేపీలో విభేదాలు సృష్టిస్తూ పార్టీని బలహీన పరుస్తున్నారని , వ్యక్తిగతంగా అనుచరులని ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేశారంట.. అంతర్గత విభేదాలు ఇలాగే కొనసాగితేఈటల ప్రవర్తన వలన పార్టీకి ముప్పు వాటిల్లుతుందని ఆయన్ని కట్టడి చేయాలని కోరారంట.
Also Read: సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్.. పేరిట ఇంటింటికి సీఎం భరోసా..
గతంలోకంటే ఇప్పుడు కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్ లో బిజేపి ఇప్పుడు బలం పెరుగుతోంది.. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు కేంద్రమంత్రి అయ్యాక గ్రామాలలో క్రిందిస్థాయినుండి పార్టీని బలంగా నిర్మాణం చేసారనేది సంజయ్ వర్గీయులు చెబుతున్న మాట. ఇప్పుడు స్థానికసంస్థల ఎన్నికలలో మెజారిటీ స్థానాలని కైవసం చేసుకోవాలని ,అసెంబ్లీ ఎన్నికల నాటికి తన పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో పార్టీని బలంగా తయ్యారు చెయ్యాలని బండిసంజయ్ గ్రౌండు వర్క్ చేస్తుండగా..ఈటల మార్క్ రాజకీయాల కారణంగా పార్టీ ఇబ్బందులలో పడుతుందని సంజయ్ వర్గీయులు అంటున్నారంట. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు తప్పదని హెచ్చరిస్తున్నారట. ఆ క్రమంలో ఇప్పుడు ఈటల రాజేందర్ పై వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేఫధ్యంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో రాజకీయా వర్గాలలో హాట్ టాఫిక్ గా మారింది.
Story By Rami Reddy, Bigtv