E-Paper
Advertisement

Rajole: రాజోలు.. గ్లాస్ పార్టీలో గందరగోళం

Rajole: రాజోలు..  గ్లాస్ పార్టీలో గందరగోళం
Advertisement

Rajole:  కోనసీమ జిల్లా రాజోలులో గ్లాస్ పార్టీలో గందగోళం నెలకొందా..? ఆ నియోజకవర్గంలో పాత నాయకులు, కొత్త సైనికుల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోందా? పవన్‌ కల్యాణ్‌ పర్యటనలో అగంతకుడికి పాస్ ఎవరిచ్చారు…? పాత జనసైనికులను పక్కనెట్టి…వైసీపీ నుంచి వచ్చిన వారికే తాజా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్..ఇంపార్టెన్స్ ఇస్తున్నారా..? అసలు రాజోలు జనసేనలో నిప్పు రాజేయడానికి కారణమేంటి..?

పాత సైనికులు, కొత్త నేతల మధ్య కోల్డ్‌ వార్

కోనసీమ జిల్లా రాజోలు జనసేన పార్టీలో గందరగోళం నెలకొంది. రాజోలు నియోజకవర్గంలోని జనసేనలో రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్‌ నడుస్తోంది. పాత జనసైనికులు వర్సెస్.. కొత్తగా పార్టీలో చేరిన నేతలు అన్న చందంగా మారింది. ఈ వార్..ఇటీవల పవన్ కల్యాణ్ పర్యటనతో రచ్చకెక్కింది.

పవన్‌కు దగ్గరగా వచ్చిన అపరిచిత వ్యక్తి

Advertisement

ఈనెల 26న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజోలు నియోజకవర్గంలో పర్యటించారు. శంకరగుప్తం డ్రయిన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలిస్తున్న సమయంలో అధికారులతో సంభాషిస్తున్నప్పుడు ఓ అపరిచిత వ్యక్తి పవన్ కల్యాణ్‌కు చాలా చేరువగా కనిపించడం సంచలనంగా మారింది. అయితే భద్రతా ప్రోటోకాల్ పాటిస్తూ, అధికారిక పాస్‌లు ఉన్నవారిని మాత్రమే మంత్రుల సమీపంలోకి అనుమతిస్తారు. అయితే ఈ వ్యక్తి ఎవరు..? అతనికి ఆ పాస్ ఎవరిచ్చారు..? అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

నరసింహకు వీఐపీ పాస్‌లు ఇచ్చిన వారెవరు ?

పవన్ కళ్యాణ్‌కు దగ్గరగా వచ్చిన వ్యక్తి పేరు నరసింహ అని..అతను వైసీపీ నుంచి జనసేనలో చేరినట్లు పోలీసులకు జనసేన ఫిర్యాదు చేసింది. అయితే వ్యక్తికి వీఐపీ పాస్‌లు ఇచ్చిన వారెవరూ అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీనిపై పాత జనసైనికులు బహిరంగంగానే ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌పై విమర్శలు చేస్తున్నారట. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌..నరసింహకు వీఐపీ పాస్ ఇచ్చారని..వైసీపీ నుంచి వచ్చిన అతనికి అధిక ప్రాధాన్యత ఇచ్చి..ఎంతో కాలం నుంచి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారట.

జనసేన నేతల మధ్య సమన్వయం చేయడంలో విఫలం

Advertisement

ఈ పరిణామాలతో రాజోలు జనసేన పార్టీలో పాత, కొత్తగా నేతల మధ్య గ్యాప్‌ ఉందనేది ఎస్టాబ్లిష్ అయిందనే టాక్. వైసీపీ నుండి వచ్చిన కార్యకర్తలను…తొలి నుంచి ఉన్న జనసైనికులు కలిసి పనిచేయలేకపోతున్నారనే ప్రశ్న ఎదురువుతుంది. అపరిచిత వ్యక్తి.. వైసీపీ చెందిన వ్యక్తికి విఐపి పాస్ ఎలా వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా జనసైనికుల ప్రశ్నించడం…. ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసింహమూర్తి మూడేళ్లుగా జనసేనలో సభ్యత్వం ఉందని విషయం కూడా లోకల్‌గా ఉన్న జనసేన నాయకులకు, కార్యకర్తలకు తెలియదంటే పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం ఏ స్థాయిలో ఉందో అద్దంపడుతుంది.

ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌పై జనసైనికుల విమర్శలు

ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కొంతమంది నాయకులకే పరిమితం అయిపోయారనేది జనసైనికుల నుంచి వస్తున్న విమర్శ. పాత కొత్త జనసేన నేతల మధ్య సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయట. MLA కార్యాలయంలో రెగ్యులర్ మీటింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అందులో పాల్గొనే వాళ్లు వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వారే కావడంతో..ఇది జనసేననా..లేక వైసీపీనా అనే విమర్శలు చేస్తున్నారు. కూటమి కార్యకర్తల సమావేశాలకు MLA సరిగా హాజరవడం లేదంటున్నారు. అసలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.. వైసీపీ నుంచి వచ్చిన కేడర్‌కు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు..? అభివృద్ధి పనుల్లో వారికి ఎందుకు పెద్దపీట వేస్తున్నారో అర్థం కాక…లోకల్ జనసేన కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. MLA ఫీల్డ్ విజిట్స్‌లోను జనసేన – టిడిపి స్థానిక నేతలు అరుదుగా కనిపిస్తారని… వైసీపీ నుండి వచ్చిన వారే ఆయనతో ఉంటారని కొంతమంది జనసేన సీనియర్లు మాట్లాడుకుంటున్నారట.

నేతల మధ్య విభేదాలు.. పవన్ కామెంట్స్

దేవ వరప్రసాద్‌ను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు..ఇప్పుడు ఆయన టీమ్‌లో కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. సభ్యత్వం ఉందో లేదో కూడా తెలియని వారందరూ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారని.. వారిలో వారే చర్చించుకుంటున్నారట. పార్టీలోకి వచ్చిన ఇతర పార్టీల నేతలు తమదే పెత్తనం అనే విధంగా వ్యవహారిస్తున్నారనేది పార్టీ కార్యాలయానికి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే నేతల మధ్య విభేదాలు సృష్టించేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారని పలు సందర్భాల్లో పవన్ కామెంట్స్ చేశారు. అయినా కూడా స్థానిక ఎమ్మెల్యేలు జనసేనాని వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇవ్వకుండా…వైసీపీ నుంచి వచ్చిన వారికే పెద్ద పీట వేసే విధంగా ప్రవర్తిస్తుండటంతో..లోకల్ నాయకులకు తీవ్ర అసహనానికి గురువుతున్నారు.

మొత్తంగా రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు.. ముందు వచ్చిన చెవులు కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్న చందాన తయారయిందని జనసేన కార్యకర్తలతో సహా కూటమి నేతలు కూడా గుర్రుగా ఉన్నారట. మరి ఈ పరిమాణాలతో నియోజకవర్గంలో బయటపడ్డ విభేదాలను చక్కదిద్దేందుకు సేనాని ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

Story By Kishan, Big Tv

Related News

కాంగ్రెస్ ఆఫీసుపై రౌడీల్లా దాడి చేస్తారా? బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డ షర్మిల!

YS Jagan: పొగాకు రైతులకు జగన్ భరోసా.. త్వరలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన!

Pawan Kalyan: ఎల్ నినో భయాలకు చెక్! పవన్ కళ్యాణ్ ముందస్తు వ్యూహం.. ఆ జిల్లాలకు పండగే!

48 ఏళ్లుగా బస్సే లేని గ్రామం.. ఎట్టకేలకు ఊర్లోకి ఎర్రబస్సు.. ఎక్కడో చూసేయండి!

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. బీఎస్సీ అగ్రికల్చర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్, కేవల ఐదు రోజులు మాత్రమే

ఢిల్లీలో సీఎం చంద్రబాబు, మోదీ-షాతో కీలక సమావేశం, వరుస పరిణామాలు, ఆ బాధ్యతలు అప్పగింత!

ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో రాత్రి నుంచి.. బంగాళాఖాతంలో అల్పపీడనం!

Tirumala News: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×