BigTV English

Retired Employees in TTD: రిటైర్డ్ ఉద్యోగులకే పెద్దపీట.. టీటీడీలో ఏం జరుగుతోంది?

Retired Employees in TTD: రిటైర్డ్ ఉద్యోగులకే పెద్దపీట.. టీటీడీలో ఏం జరుగుతోంది?

Retired Employees in TTD: పదవి విరమణ చేసిన వారిని ఓ దశ వరకు పొడిగించవచ్చు.. అయితే వారి సేవలు నిరంతరం కోరుకుంటే కష్టమే.. వారి అనుభవానికి తగ్గట్టు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు తయారు చేసుకోవాలి. అయితే టీటీడీ దాన్ని పట్టించుకోకుండా రిటైర్ అయిన వారిని ఎక్స్‌టెన్సన్ చేస్తూ కొత్త వారికి అవకాశమివ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందనే వాదన వినిపిస్తుంది. దానికి తోడు గత ప్రభుత్వ పెద్దలకు అడుగులకు మడుగులు ఒత్తిన వారిని పోస్టుల్లో కొనసాగిస్తూ విమర్శల పాలవుతుంది. దాంతో కొండపై పదవీ విరమణ పొందిన వారు ఓ వైపు.. డిప్యూటేషన్ మీద వచ్చిన వారు ఇంకో వైపు ఇక్కడ పెత్తనం చేస్తున్నారు. అంటే వారికి కొండ మీద ప్రత్యామ్నాయం లేదా?


ప్రపంచంలో అతి పెద్ద హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం.. అక్కడ ఎవరున్నా లేకపోయినా స్వామి వారి సేవలు , భక్తులకు సదుపాయాల కల్పన జరుగుతూన ఉంటాయి .. అప్పట్లో తిరుమల కొండపై డాలర్ శేషాద్రి ఓ వెలుగు వెలిగారు. స్వామి వారి సేవలతో పాటు పీఠాధిపతుల సేవలు, స్వామి వారి అలంకరణ అన్ని అయనే చూసుకునే వారు. అయన ఉన్నప్పుడు తనకు అల్టర్‌నేటివ్‌గా ఎవరికీ శిక్షణ ఇచ్చి తయారు చేయలేదు. దాంతో అయన అనారోగ్యం పాలయినప్పడు, చనిపోయిన తర్వాత కొంత కాలం స్వామి వారి సేవల నిర్వహణకు టీటీడీ ఇబ్బంది పడిందనే వాదనలు వినిపించాయి.

టీటీడీ ఇప్పుడు కూడా అలాంటి అయోమయ పరిస్థితిలోనే ఉందంటున్నారు. ముఖ్యంగా రిటైర్ అయిన 8 మంది ఉద్యోగులను ఇంకా విధుల్లో కొనసాగిస్తున్నారు. వారంతా వివిధ విభాగాలలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా అన్న ప్రసాద కేంద్రం, ప్రింటింగ్ ప్రెస్ , క్యూ కాంప్లెక్స్, వైకుంఠంతో పాటు అధికారుల సలహాదారులుగా వారు విధుల్లో ఉన్నారు. వారంతా తమ రంగంలో అత్యంత నిపుణులు అయినప్పటికీ ఓ టైం బౌండ్ పెట్టుకుని టీడీపీలో ప్రస్తుతం పనిచేస్తున్న యువ ఉద్యోగుల అభిరుచులు గుర్తించి వారికి అయా రంగాలలో సీనియర్ల ద్వారా శిక్షణ ఇప్పించాలి.. కానీ టీటీడీ పాలకవర్గం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.


కొండపై భాస్కర్ నాయుడు పాములు పడతారు. 2005 నుంచి తిరుమలలో ఇప్పటి వరకు 18 వేల పాములు పట్టి, మళ్లీ అడవిలోకి వదిలిన చరిత్రను స్నేక్ క్యాచర్ భాస్కరనాయుడు సొంతం చేసుకున్నారు. రిటైర్ అయినా ఆయనే విధుల్లో కొనసాగుతున్నారు. అయన తర్వాత ఎవ్వరు అంటే టీటీడీ పారెస్ట్ విభాగం దగ్గర సమాధానం లేదు. భాస్కరనాయుడుతో కనీసం మరో ఐదారుగురికి శిక్షణ ఇప్పించాలి. కాని ఎందుకో పట్టించుకోవడం లేదు.

Also Read:  షర్మిల టీమ్‌లోకి జగన్ బ్యాచ్! రంగంలోకి రాహుల్

అదే విధంగా క్యాటరింగ్ విభాగంలో ప్రస్తుతం రిటైర్ అయిన తర్వాత శాస్త్రి కొనసాగుతున్నారు. అయనతో ఎంతమందికి ఆ విభాగంలో శిక్షణ ఇప్పిస్తున్నారు అంటే సమాధానం నిల్. అలా ఉద్యోగ విరమణ చేసిన వారు వివిధ విభాగాల్లో 8మంది కొనసాగుతున్నారు. వారికి ఎక్స్‌టెన్షన్ ఇస్తూ నవంబర్‌లో కొత్త పాలక మండలి అమోదం తెలిపినట్లు సమాచారం. అయితే అదే సమయంలో వారి బాధ్యతలు భవిష్యత్‌లో ఎవ్వరు చూస్తారు అని పాలక మండలి ప్రశ్నించలేకపోయింది.

వారికి తోడు రెవెన్యూతో పాటు వివిధ విభాగాలలో గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటేషన్ మీద వచ్చిన వారి గడువు ముగిసినా ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. గత ప్రభుత్వం‌లో డిప్యూటేషన్ మీద అరుగురు డిప్యూటి కలెక్టర్లు వచ్చి చేరారు. వారు 2019 ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీకి అనుకూలంగా పనిచేసినందుకు నజరానాగా వారిలో కొంత మందికి టీటీడీలో అవకాశం కల్పించారంట. జి.విజయలక్ష్మి, ఎ.శివప్రసాద్, కావేటి వెంకటేశ్వర్లు, పోతిపిరెడ్డి అశాజ్యోతి, ఎ.ప్రశాంతి, ఎ.రాజగోపాల్ రావు, సి.గుణభూషణ్ రెడ్డి, జి. మల్లిఖార్జున కొనసాగుతున్నారు.

అయితే వారిలో అత్యధికుల డిప్యూటేషన్ గడువు ముగిసిపోయింది. అయినా తిరిగి వెళ్ళకుండా కొనసాగుతున్నారు. వారు ఎస్టేట్ ఆఫీసులో పనిచేసి అనేక వివాదాలకు కూడా కారణమయ్యారంట. కూటమి కార్యకర్తల దుకాణాలు సీజ్ చేశారు. అన్యాయంగా జరిమానాలు వేసి వారి బతుకు తెరువుతో అడుకున్నారు. వారిని పార్టీ మారమి వత్తిడి తెచ్చిన ఎస్టేట్ అఫీసర్లు కూడా ఉన్నారంట. ఇంత చేసినా వారిని ఇంకా కొనసాగించడానికి కారణం ఏంటంటే.. టీడీపీ అడ్మినిస్ట్రేషన్‌కు వారు అవసరం అని చెబుతున్నారంట.

వైసీపీ హయాంలో డిప్యూటేషన్‌పై వచ్చిన ఇద్దరు ఐఏఎస్‌లు కూడా కొండపై విధుల్లో కొనసాగుతున్నారు. వారికి పక్కా వైసీపీ అభిమానులన్న బ్రాండ్ ఉంది. ఒక్కరు పెద్దిరెడ్డి అనుచరుడు అయితే మరొకరు ఏకంగా ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించిన అధికారి. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఎందుకుచర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కూటమి పార్టీల క్యాడర్ సైతం ఈ వ్యవహారాలపై గుర్రుగా కనిపిస్తుంది. వారు ఫిర్యాదులు చేస్తున్నా అవి చెత్తబుట్టలకే పరిమితమవుతున్నాయంట.

తాజాగా తిరుమల సన్నిధానంలో ఓ హోటల్‌ను టెండర్ ఒకరి పేరుతో ఉంది. మరొకరు నడుపుతున్నారని అధికారులు సీజ్ చేసారు. అది జనసేన సానుభూతిపరుడిది. కాని వైసీపీ నాయకుడు ఏకంగా అన్నదాన సత్రం సమీపంలో బెంగుళూరుకు చెందిన కాంట్రాక్టర్ పేరుతో హోటల్ నడుపుతున్నా చర్యలు తీసుకోలేదు. కాని జనసేన కార్యకర్త హోటల్ మాత్రం సీజ్ చేసారు. దానికి కారణం వైసీపీ కనుసన్నల్లో నడిచే అధికారులు ఇంకా టీటీడీలో కీలక స్థానాలలో కొనసాగుతుండటమే అని కూటమి క్యాడర్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంది. మరి నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి తిరుమలకు వచ్చిన చంద్రబాబునాయుడు.. కొండపై సమూల ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. మరి ఆ దిశగా టీటీడీ పాలకవర్గం ఎప్పటికి చర్యలు చేపడుతుందో చూడాలి.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×