BigTV English

Ponnam vs Gangula: కరీంనగర్‌పై పొన్నం గురి.. గంగుల కోట బద్దలే

Ponnam vs Gangula: కరీంనగర్‌పై పొన్నం గురి.. గంగుల కోట బద్దలే

Ponnam vs Gangula: కరీంనగర్‌లో పొలిటిక్స్ ఇప్పుడే హీట్ ఎక్కాయి . మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా టైమ్ ఉండగానే ఇద్దర బలమైనా నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కరీంనగర్ లో పట్టు నిలుపుకునేందుకు ఒకరు, పట్టును‌ సాధించేందుకు మరొకరూ ప్రత్యేక వ్యూహలతో ముందుకు వెళ్తున్నారు. కరీంనగర్ రాజకీయాలను‌ అసెంబ్లీ వేదికగా ఇద్దరు ‌నేతలు ప్రస్తావించి కొత్త చర్చకు దారి‌ తీసారు. అసలు ఆ ఇద్దరు లీడర్ల టార్గెట్ ఏంటి?


కరీంనగర్ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇక్కడ ప్రతిసారి రాజకీయాలు హాట్‌హాట్‌గా ఉంటాయి. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకున్నా అక్కడ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారిపోయాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పాగా వేసేందుకు మంత్రి పొన్నం, మాజీ మంత్రి గంగుల తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరు ‌నేతలు కరీంనగర్‌ ఎన్నికల్లో గతంలో ముఖాముఖి తలపడ్డారు. ఇప్పుడు కరీంనగర్ సిటీ కాంగ్రెస్‌కి మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్దదిక్కుగా ఉంటే.. బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చక్రం తిప్పుతున్నారు.

2023 ఎన్నికలలో కొన్ని సమీకరణాల కారణంగా కరీంనగర్ నుంచి కాకుండా హుస్నాబాద్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు పొన్నం. దానిపై గంగులు కమలాకర్ తనకి భయపడే పొన్నం వేరే ప్రాంతంలో పోటీ చేశారని పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఇటీవల అసెంబ్లీ లో కూడా పొన్నం ప్రభాకర్ పై పరోక్షంగా విమర్శలు చేసారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడ అసెంబ్లీ లో ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ విమర్శలు, ప్రతి విమర్శలు అసెంబ్లీకి పరిమితం కాకుండా కరీంనగర్ చుట్టూ కూడా తిరుగుతున్నాయి. రానున్న మున్సిపాల్ కార్పొరేషన్ ఎన్నికలు వీరిద్దరికి కీలకంగా మారాయి.


కరీంనగర్‌లో బీఅర్ఎస్ ‌కంచుకోటను బద్దలు కొడతానని గతంలోనే పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. గత రెండు ఎన్నికలలో కరీంనగర్ కార్పొరేషన్‌లో బీఅర్ఎస్ హవానే కొనసాగింది. ఆ రెండు ఎన్నికలలో కాంగ్రెస్ గట్టి పోటీ కూడా ఇవ్వలేక పోయింది. కరీంనగర్‌ను వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ కార్పొరేషన్‌లో కూడా తన పట్టు నిలుపుకుంటూనే వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో‌ ఉండడం, పొన్నం మంత్రిగా వ్యవహరిస్తుండడంతో పట్టు సాధించేందుకు‌ ఇదే సరియైన ‌సమయం‌ అని‌ కాంగ్రెస్ ‌భావిస్తుంది. పలువురు బీఅర్ఎస్ కార్పోరేటర్లు కూడా ఇప్పటికే కాంగ్రెస్ ‌కండువా కప్పుకున్నారు.

Also Read: కేటీఆర్‌.. ఇలా ఇరుక్కున్నారేంటీ? బయటపడటం కష్టమేనా?

మరోవైపు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మూడవ సారి కూడా గులాబీ జెండా ఎగురవేసేందుకు గంగుల కమలాకర్ వ్యూహాలకు పదును పెడుతూ కార్పొరేటర్లు చేజారి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో చేసిన‌ స్మార్ట్ సిటి పనులు ఇతర కార్యక్రమాలు తమని గట్టేక్కిస్తాయని గంగుల ధీమాగా కనిపిస్తున్నారు . ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నప్పటికి ఇద్దరు నేతలూ ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా జాగ్రత్తలు పడుతున్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికి కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కరీంనగర్‌లో ఏ చిన్నపాటి కార్యక్రమం జరిగినా పాల్గొంటున్నారు. గతంలో‌ బీఅర్ఎస్ హయంలో‌ జరిగిన అభివృద్ధి ‌పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. స్మార్ట్ సిటీ పనులలో కూడా అక్రమాలు జరిగాయని ఇప్పటికే విచారణకి ఆదేశించారు. మొత్తానికి ఈ ఇద్దరూ నేతలు కూడా ఏ అవకాశం వచ్చిన పరస్పర విమర్శలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. చేరికలపై దృష్టి పెడుతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పటి నుంచే సవాల్‌గా తీసుకుని పార్టీ బలోపేతంపై స్పెషల్ ఫోకస్ పెడుతుండటంతో రెండు పార్టీల శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×