BigTV English

Kedarnath Yatra: కేదర్ యాత్ర స్టార్ట్ అయ్యాక 5 ప్రమాదాలు.! ఆ దోషం వల్లనే.?

Kedarnath Yatra: కేదర్ యాత్ర స్టార్ట్ అయ్యాక 5 ప్రమాదాలు.! ఆ దోషం వల్లనే.?

Kedarnath Yatra: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరవక ముందే మరో ప్రమాదం. అయితే ఈ సారి ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ప్రయాణిస్తున్న చాపర్ కుప్పకూలడం. ఈ ప్రమాద ఘటనలో పైలట్ తో సహా ఏడుగురు మరణించడం. ఎందుకిలా జరిగింది? వరుస ఘటనలు జరుగుతున్నా ఏంటీ నిర్లక్ష్యం? అధికారులేం చేస్తున్నట్టు.. ఉత్తరాఖండ్ సీఎం తీసుకున్న నిర్ణయాలేంటి? ఆ డీటైల్స్ ఎలాంటివి ఇప్పుడు చూద్దాం.


అన్ని హెలీ సర్వీసులు నిలిపివేసిన ఉత్తరాఖండ్జూన్ 15, ఆదివారం ఉదయం. 5. గంటల 20 నిమషాల ప్రాతం. కేదార్ నాథ్ నుంచి గుప్త కాశీకి వెళ్తున్న హెలికాఫ్టర్. గౌరీ కుండ్ దగ్గర్లో కుప్పకూలిపోయింది. ఇందులో ఒక పైలట్ ఐదు మంది పెద్దలు ఒక చిన్నారి ఉన్నారు. మొత్తం ఏడు మంది. వీరంతా మృతి చెందారు. ఈ ఘటన జరిగినట్టు తెలిసిన వెంటనే ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ వెంటనే అప్రమత్తమయ్యింది. పైలట్ సహా అందరూ మృతి చెందిన ఈ ఘటన.. ప్రతికూల వాతావరణం కారణంగా జరిగనట్టు ప్రాధమిక సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న NDRF, SDRF బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

రాజ్ వీర్ పైలట్ కాగా.. విక్రమ్ రావత్, వినోద్


మృతుల్లో రాజ్ వీర్ పైలట్ కాగా.. విక్రమ్ రావత్, వినోద్, త్రిష్టి సింగ్, రాజ్ కుమార్, శ్రద్ధ, రాశి ఉండగా.. రాశీ పదేళ్ల చిన్నారి కావడం గమనార్హం. వీరంతా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ కి చెందిన వారిగా గుర్తించారు. కేదార్ నాథ్ వ్యాలీలో వాతావరణం పూర్తిగా మేఘావృతమై ప్రతికూలంగా ఉండటంతో.. హెలికాఫ్టర్ దారి తప్పింది. ఈ చాపర్ త్రియుగి నారాయణ్, గౌరీ కుండ్ మధ్య సిగ్నల్ కోల్పోయిందని అన్నారు అధికారులు. ఘటన వార్త తెలిసిన వెంటనే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ థామీ హెలికాఫ్టర్ లోని వారంతా క్షేమంగా బయట పడాలని బాబా కేదార్ ని ప్రార్ధిస్తున్నట్టు తన ఎక్స్ పోస్ట్ లో పోస్ట్ చేశారు. కానీ ఆ సరికే జరగాల్సిన విపత్తు జరిగిపోయింది. పైలట్ సహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం కారణంగా 270 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే.. ఈ హెలికాఫ్టర్ ప్రమాదం జరగటం మరింత విషాదకరంగా మారింది. వరుసగా జరుగుతున్న చాపర్ యాక్సిడెంట్స్ పై సీఎం ధామి- డెహ్రడూన్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ, పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్, సమాచార డైరెక్టరేట్ ప్రతినిధులు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అనేక మంది ఫీల్డ్ అఫిషియల్స్ సైతం పార్టిసిపేట్ చేశారు.

హెలీ సర్వీసులపై ఆపరేషన్ ప్రొసీజర్‌కి ఆదేశం

హెలి సర్వీసులపై స్పెషల్ ఆపరేషన్ ప్రొసీజర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశంచారు సీఎం ధామి. హెలికాప్టర్ల సాంకేతిక స్థితి పూర్తిగా తనిఖీ చేయడం తప్పనిసరిగా ఆదేశించారు. ప్రయాణానికి ముందు వాతావణ సమాచారం ఖచ్చితంగా తెలుసుకోవాలని అన్నారు. సాంకేతిక భద్రతా అంశాల సమీక్ష కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు ముఖ్యమంత్రి పుష్కర్ ధామీ. ఉత్తరాఖండ్‌లో గతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదాలను ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న ఉన్నత స్థాయి కమిటీ ఈ ప్రమాదాన్ని కూడా పరిశీలిస్తుంది. ఈ ప్యానెల్ ఇటీవలి ప్రమాదాలకు చెందిన అన్ని విషయాలను పరిశీలిస్తోంది. ఏవైనా లోపాలుంటే పసిగడుతోంది. బాధ్యులపై కఠిన చర్యలను సిఫార్సు చేస్తోంది. ఉత్తరాఖండ్ అంటేనే పర్యాటక రాష్ట్రం. అందునా ఇది సీజన్ కూడా. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ చార్ ధామ్, చోటా చార్ ధామ్ యాత్రలు ఇక్కడ ఎక్కువగా సాగుతుంటాయి. దీంతో ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు తరచూ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టూరిస్టు సీజన్ కావడంతో.. హెలికాప్టర్ సేవలు ఎక్కువగా నడుస్తుంటాయి. ఈ టైంలోనే అప్రమత్తంగా ఉండాలి. కానీ అలా ఉన్నట్టు కనిపించడం లేదు. ఈ విషయంలో అధికారులపై సీరియస్ అయ్యారు సీఎం ధామి. మన ప్రయారిటీ ప్రయాణికుల భద్రత అంటూ వారిని హెచ్చరించారు.

వాతావరణ సమాచారం ఏమంత కష్టం కాని రోజులు

ఇప్పటికీ అర్ధం కాని విషయం ఏంటంటే.. ఇపుడున్న పరిస్థితుల్లో వాతావరణ సమాచారం ఏమంత కష్టతరం కాదు. వాతావరణ స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలియ చెప్పే ఆన్ లైన్ వ్యవస్థలున్నాయి. ఇప్పుడు మనం ఏ స్థాయిలో సాంకేతికత సంపాదించామంటే.. పిడుగు పాటును కూడా గుర్తించగలిగేంత. పిడుగులు ఎప్పుడు- ఎక్కడ- ఎలా- పడతాయో కూడా చెప్పేస్తున్నాం.. అలాంటిది ఎక్కడ మేఘా వృతంగా ఉందో.. తెలసుకోలేక పోవడం ఒక తప్పు అయితే.. ఏదైతే అయ్యిందని చాపర్ ని గాల్లోకి లేపడం మరో తప్పిదంగా భావిస్తున్నారు. ఇందులో పైలట్ మిస్టేక్ పెద్ద ఎత్తున ఉందంటున్నారు స్థానికులు. ఈ చాపర్ ఆర్యన్ ఏవియేషన్ కంపెనీకి చెందినది కావడంతో.. ఈ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వనిపిస్తున్నాయ్. అంతే కాదు.. ఇలాంటి ప్రయివేట్ ఆపరేటర్స్.. పట్ల అలెర్ట్ గా ఉండాని సూచిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని హెలికాఫ్టర్ సర్వీసులను నిలిపివేసింది.

హెలికాప్టర్ ప్రయాణాలంటే గుండె జల్లుమంటోంది. గాల్లో దీపంలా మారిపోయాయి ప్రాణాలు. ఎక్కి దిగే వరకూ ఏదీ గ్యారంటీలేదు. మరీ ముఖ్యంగా ఉత్తరాఖండ్ లో అందునా చాపర్ సర్వీస్ వాడ్డం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడ్డమే అవుతోంది. ఇటీవల ఎక్కవగా జరిగిన హెలీ యాక్సిడెంట్స్ ఏవి?

ఈ సీజన్ కేదార్ యాత్ర స్టార్ట్ అయ్యాక 5 ప్రమాదాలు

ఎక్కువగా హెలీ ప్రమాద కారణాలివేఈ సీజన్ కేదార్ నాథ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఐదు హెలీ యాక్సిడెంట్స్ జరిగాయి. జూన్ 15 ఆదివారం జరిగిన ప్రమాదం చాలా చాలా పద్దది. డెహ్రడూన్ నుంచి కేదార్ నాథ్ ప్రయాణిస్తున్న చాపర్ గౌరీ కుండ్ దగ్గర కుప్పకూలిపోయింది ఈ ప్రమదంలో పైలట్ సహా ప్రయాణిస్తున్న వారంతా చనిపోయారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో చార్ ధామ్ యాత్ర నడుస్తోంది. లక్షలది మంది భక్తులు యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ్ క్షేత్రాలకు వెళ్తున్నారు. ఈ యాత్రలో హెలీ సర్వీసులు తరచూ వాడుతుంటారు. దీంతో ప్రయాణికులు ఈ ప్రమాదాల బారీన పడుతున్నారు. 2025 మే 8 నుంచి జూన్ 7 వరకు జరిగిన నాలుగు హెలికాప్టర్ ప్రమాదాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కఠినమైన చర్యలు తీసుకుంది. కెస్ట్రెల్ ఏవియేషన్ సేవలను తక్షణమే నిషేధించారు. చార్‌ధామ్ యాత్ర కోసం హెలికాప్టర్ల సేవలను 35 శాతం తగ్గించారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా లోడ్, వాతావరణం, ఎత్తు వంటి ఏవియేషన్ గైడ్‌లైన్స్ ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది DGCA.

ప్రాణ నష్టం లేదు- కారు, దగ్గర్లోని దుకాణాలకు దెబ్బ

జూన్ 7న కేదార్ వ్యాలీలోని బదాసు హెలిప్యాడ్ నుంచి కేదార్‌నాథ్‌కు వెళుతుండగా హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. పైలట్ రుద్రప్రయాగ్- గౌరీకుండ్ హైవేపై అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ రోడ్డుపై ఆపి ఉంచిన కారు, సమీపంలోని దుకాణం దెబ్బతిన్నాయి. మే 8న ఉత్తరకాశిలో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఆరుగురు మరణించారు. గాయపడిన ఒకరిని ఎయిమ్స్ రిషికేశ్‌కు తరలించారు. ఈ హెలికాప్టర్‌లో పైలట్ సహా ఏడుగురు ఉన్నారు. ఈ ప్రమాదంలో భాస్కర్ అనే ఒక ప్రయాణీకుడు ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాడు. మే 13న ఉఖిమత్‌లో అత్యవసర ల్యాండింగ్ జరిగింది. బద్రీనాథ్ నుంచి భక్తులతో తిరిగి వస్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా తడబడటం ప్రారంభించింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఉఖిమత్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశాడు. దీని వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఎక్కువగా హెలీ ప్రమాద కారణాలివే

వీటన్నిటి ద్వారా తెలుస్తున్నదేంటంటే ఇది టూరిస్టు సీజనే కానీ.. చాపర్లకు అనువైన వాతావరణమైతే ఇక్కడ కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని హెలీ సర్వీసులను నిర్వహించాల్సి ఉంటుందని అంటున్నారు నిపుణులు. హెలీ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయో చూస్తే.. ఎక్కువగా పర్యావరణ కారకాలే కనిపిస్తున్నాయ్. మంచు , వర్షం, స్లీట్, పొగమంచు, లో విజిబిలిటీ వంటివి ఎక్కువగా కారణాలవుతున్నాయి. ఇక సాంకేతిక సమస్యలది మరో ప్రత్యేక అధ్యాయం. ప్రస్తుత హెలికాప్టర్ ప్రమాదం వాతావరణం సరిగా లేక పోవడం వల్ల దారి తప్పిందని.. తద్వారా ఈ పరమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు.

story by Adhi narayana, Bigtv live

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×