BigTV English

Shobha Shetty : మళ్లీ సీరియల్స్ లోకి శోభా శెట్టి.. అందుకే పోస్ట్ డిలీట్..?

Shobha Shetty : మళ్లీ సీరియల్స్ లోకి శోభా శెట్టి.. అందుకే పోస్ట్ డిలీట్..?

Shobha Shetty : తెలుగు బుల్లితెరపై కన్నడ స్టార్స్ హవా ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే.. ఈ మధ్య కన్నడ యాక్టర్స్ ఉన్న సీరియల్స్ హిట్ అవ్వడంతో ఎక్కువగా వీళ్ళతో డైలీ సీరియల్స్ తెరకెక్కిస్తున్నారు. తెలుగు బుల్లితెరపై తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సీరియల్ నటీనటులలో శోభా శెట్టి ఒకరు. స్టార్ మా లో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సీరియల్ లో తన విలనిజానికి మంచి మార్కులు పడ్డాయి. మోనిత పాత్రలో శోభ అద్భుతమైన నటనను కనబరిచింది. ఈ లేడి విలన్ తన క్రేజ్ తో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఛాన్స్ కొట్టేసింది. సీజన్ 7 లో తన యాటిట్యూడ్ తో అందరినీ భయపెట్టేసింది. బిగ్ బాస్ ద్వారా బాగా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత వరుసగా సినిమాలు సీరియల్స్ లలో నటిస్తూ బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ఆ తర్వాత సీరియల్స్ లో కాకుండా కేవలం సోషల్ మీడియాలో బిజీ అయ్యింది.. అయితే దాదాపు అందరూ ఆమె సీరియల్స్ కి గుడ్ బై చెప్పేస్తుందని అనుకున్నారు. కానీ తాజాగా ఆమె ఓ సీరియల్ లో ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తుంది. మరి ఆమె ఏ సీరియల్ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


బిగ్ బాస్ 7 తో నెగిటివిటి..

బుల్లితెర లేడీ విలన్స్ లలో ఒకరు శోభా శెట్టి. బిగ్ బాస్ కు వెళ్లక ముందు పలు సీరియల్స్ లలో నటించి మంచి క్రేజ్ ను అందుకుంది. టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లో ఎంట్రీ ఇచ్చింది. ఆ షోలో కొంతవరకు పాజిటివ్ గానే ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో నెగిటివిటిని సంపాదించుకుంది. శోభా ఎప్పుడు షో నుంచి ఎలిమినేట్ అవుతుందా అని ఆడియన్స్ ప్రతి వారం ఎదురుచూసేవాళ్లు. ఇక షో నుంచి వచ్చేసిన తర్వాత సీరియల్ లేదా సినిమాలు ఇలా ఎందులోనూ శోభాకు ఒక్క అవకాశం కూడా రాలేదు. దాంతో నటిగా గుడ్ బై చెప్పేసిందేమో అనుకున్నారు. కానీ తాజాగా ఈమె ఓ సీరియల్ ద్వారా ప్రేక్షకులను మరోసారి పలకరించబోతుందని తెలుస్తుంది.. ఈమె సీరియల్ కు సంబందించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్..


Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. మెగా ఫ్యాన్స్ కు పునకాలే..

సీరియల్స్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న శోభా.. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె రీల్స్ చెయ్యడంతో పాటుగా వీడియోలు చేస్తుంది.. అయితే రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది.. తాను ప్రేమించిన వ్యక్తితో ఏడు అడుగులు వెయ్యబోతుంది. అంతా బాగానే ఉంది. కానీ ఈ మధ్య సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసింది. కొన్నాళ్లు సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నానంటూ పోస్ట్ పెట్టింది. ఆ పోస్టు కాస్త వైరల్ గా మారింది. శోభా శెట్టి ఎందుకు సడన్గా ఈ నిర్ణయం తీసుకుందామని ఆమె ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయారు. అది పెట్టిన వారానికే మళ్లీ యాక్టివ్‌గా పోస్టులు చేయడం ప్రారంభించింది. సోషల్ మీడియాకి బ్రేక్ అంటూ పెట్టిన పోస్ట్‌ని కూడా శోభా డిలీట్ చేసింది. తాజాగా స్టార్ మా ఛానల్‌లో మంచి రేటింగ్ సాధిస్తున్న ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌కి సంబంధించిన ప్రమోషనల్ ప్రోమోలో శోభాశెట్టి కనిపించింది. అది చూసిన బుల్లితెర ఆడియన్స్. ఆమె మళ్లీ విలన్ గా ఎంట్రీ పోతుందా అని అనుకుంటున్నారు. మరి ఈ సీరియల్ తోనే ఎంట్రీస్తుందా లేక వేరే సీరియల్ లో కూడా నటిస్తున్న అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా ఈమె మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big Stories

×