BigTV English

YS Sharmila: నెక్స్ట్ సునీత? షర్మిల భయానికి కారణాలు ఇవే

YS Sharmila: నెక్స్ట్ సునీత? షర్మిల భయానికి కారణాలు ఇవే

YS Sharmila: మాజీ ముఖ్యమంత్రి జగన్‌ అటు ఆస్తుల వివాదంలో, ఇటు వివేకా హత్య కేసుకు సంబంధించి పదేపదే సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకు టార్గెట్ అవుతున్నారు. సొంత మేనల్లుడు, మేనకోడలు ఆస్తులు కాజేయాలని చూస్తున్న జగన్ విశ్వసనీయత ఎంతో వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలని అన్నపై ధ్వజమెత్తుతున్నారు మరోవైపు వివేక హత్య కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు . ఈ కేసులో వైఎస్ సునీతను కూడా చంపుతారని భయంగా ఉందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల దూకుడును తట్టుకోవడానికి వైసీపీ నేతలు రోజా వంటి వారిని రంగంలోకి దించాల్సి వస్తోందిప్పుడు ..


సనీతను హతమారుస్తారని షర్మిల భయాందోళన

నిను వీడని నీడను నేను అన్నట్లు.. పీసీసీ ప్రెసిండెంట్ వైఎస్ షర్మిలా రెడ్డి తన అన్న జగన్‌ను వెంటాడుతూనే ఉన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి న్యాయపోరాటం చేస్తున్న ఆయన కుమార్తె వైఎస్ సునీతను కూడా చంపేస్తారేమోనని ఆమె తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు.. ఒకరొకరుగా అనుమానాస్పద స్థితిలో చనిపోవడమే..తమ అనుమానాలు తావిస్తోందని భయాందోళనలు వ్యక్తం చేశారు


అవినాష్ సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారని ఆరోపణ

ఈ కేసులో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్‌ తీసుకొని స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని.. సాక్షులు, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తూ ఈ కేసుని పక్కదారి పట్టిస్తున్నారని షర్మిల ఆరోపించారు. వివేకాను ఆయన కుమార్తె సునీతే హత్య చేయించిందని విచారణాధికారిని బెదిరించి, భయపెట్టి రిపోర్ట్‌ రాయించారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీతను కూడా చంపరని, ఆమెకు ప్రాణహాని లేదని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. బెయిల్‌పై ఉండి సాక్ష్యాలు తారుమారు చేస్తున్న అలాంటివారు బయట ఉండాలా? జైల్లో ఉండాలా అని ఆమె నిలదీశారు.

సాక్ష్యాలు ఉన్నా కూడా రిపోర్టులు రాయిస్తున్నారని ఆరోపణ

2024 ఎన్నికల తరువాత సునీత తనను కలిసిందని.. తన తండ్రి హత్య కేసులో న్యాయం జరగదేమో అని ఆవేదన వ్యక్తం చేసిందని షర్మిల చెప్పుకొచ్చారు. తోడబుట్టిన వాడు అటు ఉన్నా.. తాను సునీతకు మద్దతు ఇస్తూనే వచ్చానన్నారు. వివేక హత్య జరిగిన సమయంలో మొదట వచ్చిన వ్యక్తి అవినాష్ రెడ్డని, అది మర్డర్ కాదు… గుండె పోటు అని సాక్షి లో చెప్పినప్పుడు అవినాష్ రెడ్డే అక్కడే ఉన్నాడని గుర్తు చేశారు. ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా తప్పుడు రిపోర్ట్ లు రాయిపిస్తుంటే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు.

ఆస్తి పంపకాలకు సంబంధించి జగన్‌పై ఫైర్ అయిన షర్మిల

ఇక కుటుంబ ఆస్తి పంపకాలకు సంబంధించి జగన్ మీద షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. తన బిడ్డలకు ఆస్తులు ఇస్తున్నట్టుగా సంతకం చేసిన జగన్ ఇప్పటి వరకూ ఇవ్వలేదని ఆరోపించారు. సర్వసతి సిమెంట్ కంపెనీలో తన భాగాన్నితన తల్లి పేరిట గిఫ్ట్ చేసి ఇచ్చారన్నారు. గిఫ్ట్ ఇచ్చిన షేర్లను తిరిగి ఇచ్చేయాలని తల్లి మీదే కేసు వేశారని యద్దేవా చేశారు. ఓ తల్లికి జగన్‌కు చేస్తున్న మోసం ఇదని..తనకు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా తల్లి మీద కేసు వేసివాడిగా మిగిలిపోతాడని ధ్వజమెత్తారు. సొంత మేనల్లుడు, మేనకోడలి ఆస్తుల కాజేయడానికి వైవీ సుబ్బారెడ్డి లాంటి వాళ్లతో అబద్దాలు చెప్పిస్తున్న జగన్ రెడ్డి క్రేడిబులిటి ఉందో లేదో వైసీపీ నేతలు ఆలోచించుకోవాలన్నారు.

సైలెంట్ అయిన నేతలను రంగంలోకి దించుతున్న జగన్

Also Read: రేషన్‌కార్డు దారులకు శుభవార్త.. డిలే చేస్తే కార్డు కట్!

షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జగన్‌పై ఒంటి కాలితో లెగుస్తున్నారు. గత ఎన్నికల ప్రచారంలో వైఎస్ సునీతతో కలిసి ఆమె వివేకా హత్యపై చేసిన వ్యాఖ్యలు వైసీపీని తీవ్ర డ్యామేజ్ చేశాయన్న అభిప్రాయం ఉంది. ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయినా కూడా షర్మిల వదిలిపెట్టడం లేదు. దాంతో పార్టీ మరింత డ్యామేజ్ అవుతుందన్న భయంతో జగన్ ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయిన పార్టీ నేతలను రంగంలోకి దించుతున్నారంట.

ట్విట్లర్ వేదికగా షర్మిలపై రోజా విమర్శలు

తాజాగా మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా షర్మిలపై విమర్శలు గుప్పించారు. జగన్‌పై అసూయ, ద్వేషంతో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయాలు చేసే వారు గొప్పగా ప్రసంగిస్తారని ఎలా అనుకోవాలని షర్మిలపై వ్యంగస్త్రాలు విసిరారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం రూపొందించిన కుట్రలో మీరు ఓ సాధనంగా మారిన మాట వాస్తవం కాదా.. చంద్రబాబుకు మేలు చేయాలన్న మీ తాపత్రయం, మీ లక్ష్యం, మీ ఉద్దేశం ప్రజలకు పూర్తిగా అర్థమవుతోందని ట్వీట్లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. టూరిజం, క్రీడా శాఖల మంత్రిగా పనిచేసిన రోజాపై పలు అవినీతి అరోపణలున్నాయి.

ధైర్యంగా మాట్లాడే నేతలు కరువైన వైసీపీ

ఆడుదాం ఆంధ్ర పేరులో వంద కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగాలపై విచారణ జరుగుతోంది. దానికి సంబంధించి అరెస్ట్ భయంతోనే రోజా మీడియా ముందుకు రాకుండా సోషల్ ‌మీడియాకే పరిమితమయ్యారంటున్నారు. మీడియా ముందుకొచ్చి ధైర్యంగా మాట్లాడే నేతలే వైసీపీకి కరువయ్యారంటున్నారు. మొత్తమ్మీద చెల్లి దెబ్బతో పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయిన జగన్ పరిస్థితి అలా తయారైందిప్పుడు.

 

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×