BigTV English

Kavati Manohar Naidu: గుంటూరు మేయర్ కావటి రాజీనామా వెనుక.. అసలు కారణం ఇదే !

Kavati Manohar Naidu: గుంటూరు మేయర్ కావటి రాజీనామా వెనుక.. అసలు కారణం ఇదే !

గుంటూరు మేయర్ గా కావటి రిజైన్

కావటి తప్పుకోవడంతో మిగిలిన వైసీపీ లీడర్లలో అయోమయంగుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు.. కలెక్టర్ కి తన రిజైన్ లెటర్ పంపించారు మనోహర్ నాయుడు. ప్రస్తుతం కావటి రాజీనామా వ్యవహారం గుంటూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.


ఏ మేయర్ కూడా ఇలాంటి అవమానాలు ఎదుర్కుని ఉండరు-కావటి

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కావటి కార్పొరేషన్‌లో తనకు తీవ్ర అవమానం ఎదురవుతోందని.. వాపోయారు. ఈ అవమానాలు, నిందలు, పరాభవాలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం తనకు లేదని అన్నారు. తాను ఎదుర్కొన్న అవమానాలు, పరాభవాలు గతంలో ఏ మేయర్ గానీ, ఏ ఛైర్మన్ గానీ చూసి ఉండరని చెప్పుకొచ్చారు.

ఏ పార్టీ మారను, జగన్ తోనే ఉంటా- కావటి

ఫ్యూచర్ లో ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు కావటి. పార్టీ మార్పు పైనా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోన్న పరిస్థితుల్లో తాను జగన్ తోనే ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు.

ఇంకో ఏడాది పాటు పదవిలో ఉండే ఛాన్స్..

ఇవన్నీ ఇలా ఉంటే.. కావటి ఈ నిర్ణయం తీస్కోవడం వెనక అసలు సమస్యేంటని చూస్తే.. 2021లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ నుంచి కావటి మనోహర్ నాయుడు మేయర్ గా ఎన్నికైన సంగతీ తెలిసిందే. ఇంకో ఏడాది పాటు పదవిలో కొనసాగాల్సి ఉంది కావటి మనోహర్ నాయుడు. ఈలోపే ఆయన తన పదవి నుంచి తప్పుకోవడంలో అసలు కారణం.. స్టాండింగ్ కమిటీ వ్యవహారశైలిగా చెప్పుకుంటున్నారు. కొందరు వైసీపీ కార్పొరేటర్లు.. టీడీపీ, జనసేన తీర్ధం పుచ్చుకోవడం వల్ల.. కమిటీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఆ రెండు పార్టీలకే దక్కాయి. ఈ కమిటీకి మేయరే చైర్మన్ గా వ్యవహరిస్తున్నా.. ఆయనకు తగిన సమాచారమివ్వడం లేదని సమాచారం.

ఈ నెల 17న స్టాండింగ్ కమిటీ సమావేశం..

ఈ నెల 17న స్టాండింగ్ కమిటీ సమావేశం జరగబోతోంది. ఇందులో మనోహార్ నాయుడిపై అవిశ్వాసం సైతం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. స్టాండింగ్ కమిటీలో వైసీపీకి మెజార్టీ లేక పోవడం వల్ల.. ఈ తీర్మానం కూటమి నెగ్గడం ఒక లాంఛనంగా భావిస్తున్నారు. అందుకే కావటి ఇలా అర్ధాంతరంగా ఎవరికీ చెప్పకుండానే రిజైన్ చేసినట్టు అంచనా వేస్తున్నారు.

వైసీపీలోనే కాదు టీడీపీ లోనూ షాకింగా కావటి రాజీనామా

మేయర్ గా కావటి మనోహర్ నాయుడు రాజీనామా ప్రకటన ఇటు వైసిపి వర్గాల్లోనే కాదు.. అటు టిడిపి నేతల్లోనూ షాకింగా మారిందట. ఈ హఠాత్ పరిణామానికి ప్రత్యర్ధి వర్గాల్లోనూ చర్చకు తెరలేపిందట. ప్రస్తుతం నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగంలో.. తనకు కనీస ప్రోటోకాల్ ఇవ్వడం లేదనీ. ఆఫీసు సిబ్బంది ఎప్పుడు వస్తారో రారో కూడా తెలియని గందరగోళ పరిస్థితుల్లోనే తాను రిజైన్ చేస్తున్నట్టు చెబుతున్నారాయన.

ఆఫీసు సిబ్బంది ఎప్పుడొస్తారో రారో కూడా తెలీదంటోన్న మేయర్

అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలకే రాజీనామా చేయాల్సిన అవసరమేంటన్నది ఇప్పుడో ప్రశ్నగా మారింది. కనీసం తన సొంత పార్టీ లీడర్లతో కూడా ఆయన సంప్రదింపులు జరిపినట్టే కనిపించడం లేదని అంటున్నారు. జిల్లా అధ్యక్షుడు అంబటి తో కూడా చెప్పినట్టు లేదని చెబుతున్నారు. ఇదెక్కడి విడ్డూరమో అర్ధం కావడం లేదని వాపోతున్నారట సగటు గుంటూరు వైసీపీ కార్యకర్త.

Also Read: జగన్ కు గిద్దలూరు టెన్షన్

జిల్లా అధ్యక్షుడు అంబటికీ చెప్పని కావటి

మేయర్ రాజీనామా పూర్తి వ్యక్తిగతంగా కనిపిస్తోందనీ ఒక అంచనాకు వస్తున్నారు. ఇటు మేయర్ రాజీనామా ప్రకటన వెనక కూటమి నేతల మైండ్ గేమ్ కూడా ఉందని అంటున్నారు. ఈ మేరకు వీరు సక్సెస్ అయినట్టుగానూ భావిస్తున్నారు. మేయర్ పీఠంపై ఇప్పటికే కూటమి నేతల్లో కొందరికి కుతూహలం పెరిగినట్టు సమాచారం. మెజార్టీ YCP కార్పొరేటర్లు కూటమిలోకి రప్పించేందుకు ఓ సీనియర్ కార్పొరేటర్ పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతోనే మేయర్ ముందుగా రాజీనామా ప్రకటన చేశారనీ లెక్కిస్తున్నారు. దీంతో కొత్త మేయర్ ఎన్నిక నల్లేరు పై నడకేనని ఫీలవుతోందట సదరు కూటమి నేత వర్గం.

మెజార్టీ YCP కార్పొరేటర్లు కూటమిలోకి రప్పించేలా స్కెచ్?

ఇటు కూటమి టచ్ లో ఉన్న వైసీపీ లీడర్ల సంగతి అలా ఉంచితే.. పార్టీనే నమ్ముకున్న వారి పరిస్థితేంటన్నది అయోమయంగా మారిందట. తమకెంతో కావలిగా ఉంటాడని భావించిన మనోహర్ నాయుడు.. ఇలా చేతులెత్తేడం ఏమీ బాగోలేదని లోలోన కుమిలిపోతున్నారట. ఆయన భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందో లేదో తెలీదు కానీ తమ పరిస్థితి మాత్రం కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని వాపోతున్నారట.

 

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×