Innova Car: హైదరాబాద్ – విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి దగ్గర ఓ కారు అతి వేగంగా వస్తున్న ఇన్నోవా కారు యూటర్న్ దగ్గర డివైడర్‌ను ఢీ కొట్టింది. అనంతరం ఒక్కసారిగా ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు వెంటనే కారు నుండి బయటికి వచ్చారు. ఈ ఘటనలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అనంతరం అక్కడి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాద సమయంలో 8 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమచారం. ఈ ప్రమాదంలో కార పూర్తిగా దగ్ధమైపోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .