E-Paper
Advertisement

నెల్లూరులో ఎమ్మెల్యే రివర్స్‌గేమ్ పాలన.. ఆయన పైరవీల వెనుక మర్మమేంటో..?

నెల్లూరులో ఎమ్మెల్యే రివర్స్‌గేమ్ పాలన.. ఆయన పైరవీల వెనుక మర్మమేంటో..?

TDP Rift: ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ముల వాడి అన్నట్లుంది జీడి నెల్లూరు నియోజకవర్గం టీడీపీలో వ్యవహారం..పాతకాపులపై కొత్త గా వచ్చిన నేతలు దాడులు చేస్తుంటే స్థానిక ప్రజా ప్రతినిధి దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా అడ్డుకుంటున్నారంట. అంతే కాకుండా టీడీపీ పాత కాపులు పనికి మాలిన వారని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారంట. నాలుగు దశాబ్దాలుగా పార్టీని కాపాడిన వారిని కాకుండా, ఎన్నికల తర్వాత వచ్చిన వలస నేతలకు ఎమ్మెల్యే థామస్ ఏ లెక్కలతో పెద్ద పీట వేస్తున్నారు? ..అసలు జీడి నెల్లూరు టీడీపీలో ఏం జరుగుతోంది?

2009 ఎన్నికల ముందు..

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జీడి నెల్లూరు నియోజకవర్గం ఎప్పుడూ వార్లల్లో నలుగుతూనే ఉంటుంది. 2009 ఎన్నికల ముందు నియోజకవర్గాల పున్వరిభజనలో అప్పట్టో వైఎస్ మార్క్ రాజకీయం ఫలితంగా నియోజకవర్గం పూర్తిగా కాంగ్రెస్, వైసీపీలకు అనుకూలంగా మారింది. ఎస్సీ ,రెడ్డి సామాజిక వర్గాలు ఓట్లు మెజార్టీగా ఉండే విధంగా నియోజకవర్గ విభజన జరిగింది. అది కలిసి వచ్చి 2019 ఎన్నికల వరకు జీడి నెల్లూరులో కాంగ్రెస్, వైసీపీల హవా కొనసాగింది. అయితే 2024 కూటమి ప్రభజనంతో పాటు, కసితో ఉన్న టిడిపి క్యాడర్ కృషి కలిసి వచ్చి రాజకీయాలకు కొత్త అయిన ఫర్డిలిటీ సెంటర్ నిర్వాహకుడు అయిన డాక్టర్ థామస్ టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

టీడీపీ క్యాడర్ నానా పాట్లు

అయితే థామస్ విజయం సాధించినప్పటి నుంచి ఆయన వైఖరి టీడీపీ శ్రేణులకు మింగుడు పడకుండా తయారైందంట. తన డబ్బులతోను తాను గెలిచానని, పార్టీ కార్యకర్తలు చేసిందేమీ లేదన్నట్లు ఆయన ఒంటెద్దు పోకడలు పోతున్నారంట.దానికి తగ్గట్లే ఎన్నికల పూర్తయిన తర్వాత పార్టీ క్యాడర్ ను పక్కన బెట్టి, గతంలో వైసీపీ కోసం అహార్నీశలు పనిచేసిన వారిని తన అనుచరులుగా మార్చుకుని పెత్తనం చెలాయిస్తున్నారంట. వైసిపి పాలనలో టీడీపీ క్యాడర్ నానా పాట్లు పడిందన్న వాదన ఉంది, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు అనేక కేసులు పెట్టించుకున్నారు. ప్రత్యర్ధుల దాడులు, దౌర్జన్యాలకు గురయ్యారు. మరో వైపు తమ వృత్తి, వ్యాపారాలను పోగొట్టుకున్నారు. అయినప్పటికి టీడీపీ జెండాలను వీడలేదు.

సోషల్ మీడియాలో హల్ చల్..

కూటమి అధికారంలోకి రావడంతో తగిన గుర్తింపు వస్తుందని టీడీపీ శ్రేణులు భావించాయి. అయితే వారిని కరివేపాకు లాగా వాడుకుని, ఎమ్మెల్యే పక్కన పడేశారంట. ముందు నుంచి పార్టీలో ఉన్నామన్న కనీస మర్యాద కూడా తమకు కరువైందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. పాలసముద్రం మండలంలో గ్రావెల్ క్యారీలు పెద్ద ఎత్తున అక్రమంగా నడుపుతున్నరన్న ఆరోపణలున్నాయి. మైన్స్ అండ్ జియాలజీ శాఖలో గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న ఓ అధికారి సాయంతో అడ్డగోలుగా గ్రావెల్ తమిళనాడు తరలిస్తున్నారంట. అందులో ఎమ్మెల్యే పీఏతో పాటు వైసీపీ నాయకుడు విజయానందరెడ్డి అనుచరుడు, తిరుపతి కి చెందిన ఓ వ్యాపారి ప్రధాన పాత్ర పోషిస్తున్నారంట. విజయనాందరెడ్డి అనుచరుడు అయితే ఓ గ్రానైట్ వ్యాపారిని 50 లక్షలు డిమాండ్ చేసినట్లు లీకైన ఆడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఆ దందాకు వత్తాసు పలుకుతున్న ఎమ్మెల్యే థామస్.. టీడీపీ పాత నాయకులపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారంట.

Also Read: దేశంలోనే లార్జెస్ట్ లగ్జరీ రిసార్ట్, అమ్మో.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా?

ఎమ్మెల్యే వర్గం ప్రయత్నాలు

ఓ మహిళ సీఐ నగరిలో లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో టీడీపీ క్యాడర్ ను అరెస్ట్ చేయడమే కాకుండా, బండ బూతులు తిట్టింది. అది బహిరంగ రహస్యమే. అయితే అమెకు జీడి నెల్లూరు లో పోస్టింగ్ వచ్చింది. అప్పట్లో అమె మీద ఫిర్యాదు చేసిన వారిని అనేక ఇబ్బందులు పెట్టారంట. చివరకు లోకేష్ వరకు విషయం వెళ్లడంతో అమెను బదిలీ చేశారంట. అయితే ఇప్పటికి కూడా అమెకు జీడి నెల్లూరులో పోస్టింగ్ కోసం ఎమ్మెల్యే వర్గం ప్రయత్నాలు చేస్తోందంట. తాజాగా కార్వేటి నగరంలో కానిస్టెబుల్ యుగంధర్ తమ గ్రామంలో జరుగుతున్న అక్రమ కలప వ్యాపారాన్ని ప్రశ్నించారు. యుగంధర్‌తో పాటు ఎమ్మెల్యే సోదరుడు అయిన నిధి అక్రమంగా కలప తరలిస్తున్న కలప ట్రాక్టర్ ను అడ్డుకున్నారు.

ఏఅర్ కానిస్టెబుల్..

అయితే అక్రమ కలపదందా చేస్తున్న వైసీపీ మాజీ సర్పంచ్ ఆదాం, అతని అనుచరులు యగంధర్ పై దాడి చేయడమే కాకుండా అతను తమను డబ్బులు అడిగాడని కేసు పెట్టారంట.. ఏఅర్ కానిస్టెబుల్ అయిన కానిస్టేబుల్ టీడీపీ సానుభూతి పరుడని గతంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వర్గం అతనిని అనేక ఇబ్బందులు పెట్టింది. హైకోర్టు ద్వారా ఆయన ఉత్వర్వులు తెచ్చుకుని విధుల్లో కొనసాగుతున్నారు. అలాంటి కానిస్టేబుల్‌పై వైసీపీ మూకలు దాడి చేస్తే, పోలీసులు సైతం ఎమ్మెల్యే మద్దతు ఉన్న ఆ దుండగులకే వత్తాసు పలుకుతూ… కానిస్టేబుల్‌పై కేసులు పెట్టడం విమర్శల పాలవుతోంది.

తెలుగుదేశం శ్రేణులు అల్టిమేటం

ఎమ్మెల్యే వైఖరితో విసిగిపోయి స్థానిక సంస్థల ఎన్నికలలో తాము సహాకరించబోమని తెలుగుదేశం శ్రేణులు అల్టిమేటం ఇవ్వడంతో పార్టీ హైకమాండ్ జీడి నెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పదవులు అశించకుండా కేవలం పెద్దాయన మీద, తెలుగు దేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో అన్ని సహించి ముందుకు పోతుంటే.. చంద్రబాబుపై అడ్డగొలుగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకొకుండా ఉంటే పార్టీ పరిస్థితి దిగజారుతుందని క్యాడర్ వాపోతోంది. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానం చర్యలు తీసుకొకుంటే తాము పార్టీ కార్యక్రమాలకు దూరం అవ్వాల్సి వస్తుందని పార్టీ శ్రేణులు హెచ్చరించే వరకు వచ్చింది పరిస్థితి.

Also read: దక్షిణాది రాష్ట్రాలపై అదే కుట్ర.. అంబేద్కర్ జయంతి ఈవెంట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×