PM Modi Vizag Tour: నేడు విశాఖలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రెండు కోట్లకు పైనే విలువైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను మరో ఎత్తుకు చేర్చుతూ రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏర్పాటుచేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్ విలువే 1.85లక్షల కోట్లు. రహదారులు, రైల్వే పనుల అంచనా 19.5వేల కోట్లు. వీటితోపాటు మరో 10కిపైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
అలాగే.. కొత్తగా నిర్మించిన, విస్తరించిన ఆరు రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.
విశాఖ సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజినీరింగ్ ఉమెన్ హాస్టల్ మీదుగా సభాప్రాంగణం వద్దకు ప్రధాని భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో 1200 ఎకరాల్లో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చూస్తారు. కోటీ 85 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా 25 వేల మందికి ఉపాధి లభించనుంది. నక్కపల్లిలో 1,877 కోట్లతో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్క్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేయనున్నారు. తిరుపతి జిల్లా కృష్ణపట్నం వద్ద 2,139 కోట్లతో ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. పది జాతీయ రహదారులు, ఏడు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
Also Read: పీఏ గుట్టు విప్పేశాడా? ఎందుకు అవినాష్ కంగారు పడుతున్నారు?
ఇవాళ సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని మోదీ విశాఖకు చేరుకుంటారు. సాయంత్రం 4.45 గంటల నుంచి 5.30 గంటల వరకు వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ ప్రాంతం నుంచి సుమారు కిలోమీటరు మేర రోడ్డు షోలో పాల్గొంటారు. సాయంత్రం 5.30 నుంచి 6.45 వరకూ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోని సభా వేదిక వద్ద నుంచి వర్చువల్‌గా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సభలో మాట్లాడతారు. సాయంత్రం 6.50 గంటలకు సభా వేదిక నుంచి బయలుదేరి విమానాశ్రయానికి చేరుకుని 7.15 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరి వెళతారు.