E-Paper
Advertisement

నామినేటెడ్ పదవుల పంపిణీలో ఢిల్లీ హవా.. అసంతృప్తిలో కాంగ్రెస్ లీడర్లు!

నామినేటెడ్ పదవుల పంపిణీలో ఢిల్లీ హవా.. అసంతృప్తిలో కాంగ్రెస్ లీడర్లు!
Advertisement

Nominated Posts: పార్టీ పవర్ లోకి వచ్చి దాదాపు కావొస్తున్నా..ఇంకా కొన్ని విభాగాల్లో నామినేటెడ్ పదవులు ఖాళీగానే ఉన్నాయి. పార్టీ, ప్రభుత్వ విభాగాల్లో పదవుల కోసం నేతలు ప్రయత్నిస్తున్నప్పటికీ అధిష్టానం అప్రూవల్ లభించడం లేదు. నామినేటెడ్, కార్పొరేషన్ పదవుల భర్తీలో జరుగుతున్న తీవ్ర జాప్యం అధికార పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది.ఈ దసరా పండుగకైనా పదవులు వరిస్తాయో లేదోనని ఆశావహులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

జాబితా విడుదల..

అయితే, టీపీసీసీ నాయకత్వం నుంచి రోజుకో మాట వస్తుండటంతో కేడర్‌లో తీవ్ర అయోమయం, గందరగోళం నెలకొంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన ద్వితీయ శ్రేణి నాయకులు,కార్యకర్తలు నామినేటెడ్ పదవులపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు.కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీలు, జిల్లా స్థాయి పదవులు వస్తాయని భావించారు. అయితేఅధికారంలోకి వచ్చి మూడేళ్లు సమీపిస్తున్నా.. జాబితా విడుదల కాకపోవడంతో వారిలో తీవ్ర నైరాశ్యం వ్యక్తమవుతోంది. ఇక గడువు ముగిసిన కార్పొరేషన్ చైర్మన్లకూ ఇప్పటికీ రెన్యూవల్ కాలేదు. ప్రభుత్వం నుంచి కూడా స్పష్టత లేదు. దీంతో ఆయా నేతలంతా గందరగోళంలో పడ్డారు.

Advertisement

Also read: రూ.50వేలలోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు..బ్యాంక్ ఆఫర్లో బ్రాండెడ్ మోడల్స్!

దాటవేత ధోరణి..

పదవుల భర్తీపై అధినేతలు, మంత్రులను కార్యకర్తలు ప్రశ్నిస్తుంటే, ‘త్వరలోనే ప్రకటిస్తాం.. అంతా సిద్ధమైంది’ అంటూ దాటవేసే ధోరణి కనిపిస్తోందని కేడర్ మండిపడుతున్నారు. రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నా ఆ ‘త్వరలో’ ఎప్పుడు వస్తుందో అర్థం కాక కేడర్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతోంది. ప్రతిపాదిత జాబితాలు మారుతుండటం, ఒకరి పేరు స్థానంలో మరొకరి పేరు వస్తుందనే ప్రచారంతో అసలైన కేడర్ లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రభావంతో నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యక్రమాలను సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్లడంలో ఆయా లీడర్లు ఆశించిన స్థాయిలో భాగస్వామ్యం కావడం లేదు. అంతేగాక ప్రభుత్వ పథకాల ప్రచారానికీ మొండి చేయి చూపిస్తున్నారు.

స్టేట్ పదవులకూ ఏఐసీసీ అప్రువలా..?

Advertisement

రాష్ట్ర స్థాయిలో భర్తీ చేయాల్సిన కార్పొరేషన్ పదవులకు కూడా అధిష్టానం (ఏఐసీసీ) అనుమతి కావాలనడంపై స్థానిక నేతల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది.సాధారణంగా రాష్ట్ర నాయకత్వమే సమన్వయంతో భర్తీ చేసుకోవాల్సిన పదవులకు కూడా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి రావడం ఏంటని పలువురు లీడర్లు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ పేరిట కాలయాపన చేయడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం జరుగుతోందనే ఆవేదన వ్యక్తమవుతోంది.నామినేటెడ్ పోస్టుల జాప్యం వలన జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పార్టీ వాతావరణం దెబ్బతింటోంది. పదవులు రాని నాయకులు అసంతృప్తితో గ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్నారు.

Also read: విదేశీయులు ఇష్టపడే ఈ ఇండియన్ డిష్ పుట్టింది బ్రిటన్‌లోనే అని తెలుసా?

Tags

Related News

ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు షాకింగ్ న్యూస్.. చిక్కుల్లో వెబ్ సైట్..?

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

తెలంగాణ ఉన్నత విద్యకు మరణశాసనంగా మారిన జీవో.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో సంచలనం?

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?

Big Stories

Advertisement
×