E-Paper
Advertisement

రూ.50వేలలోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు..బ్యాంక్ ఆఫర్లో బ్రాండెడ్ మోడల్స్!

రూ.50వేలలోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు..బ్యాంక్ ఆఫర్లో బ్రాండెడ్ మోడల్స్!
Advertisement

Best Laptops Under 50000: ప్రస్తుత డిజిటల్ యుగంలో ల్యాప్‌టాప్ అనేది అందరి జీవితంలోనూ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఆన్‌లైన్ క్లాసులు,వర్క్ ఫ్రమ్ హోమ్, కోడింగ్ లేదా గేమింగ్ ఇలా ప్రతి పనికి మంచి ల్యాప్‌టాప్ అవసరం ఉంటుంది. అయితే.. ఎక్కువ ధర పెట్టి కొనలేం అనుకునేవారి కోసం రూ.50,000 లోపు మార్కెట్లో అనేక అద్భుతమైన ఆప్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఈ బడ్జెట్ ల్యాప్‌టాప్‌లపై క్రెడిట్/డెబిట్ కార్డ్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు ఇస్తున్నారు. కస్టమర్లు ఎక్కువగా కొంటున్న టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇప్పుడు చూద్దాం.

రూ.50వేల లోపు టాప్ 5 ల్యాప్ టాప్స్: 

1.HP Laptop 14s:

హెచ్‌పి బ్రాండ్ అంటేనే నమ్మకానికి మారు పేరు. ఈ ల్యాప్‌టాప్ సింపుల్ డిజైన్ బెస్ట్ పెర్ఫామెన్స్‌తో వస్తుంది. ఇది ఇంటెల్ కోర్ i3 లేదా i5 (లేదా AMDరైజెన్) ప్రాసెసర్‌తో లభిస్తుంది. కాలేజీ స్టూడెంట్స్‌కి , ఆఫీస్ డాక్యుమెంట్ వర్క్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ,మైక్రో-ఎడ్జ్ డిస్ప్లే దీని ప్రత్యేకతలు.

Advertisement

ధర: సుమారు రూ. 38,999 నుంచి రూ. 45,000 వరకు (బ్యాంక్ ఆఫర్లతో కలిపి).

2. Lenovo IdeaPad Slim 3:

సన్నగా, తేలికగా ఉండే ల్యాప్‌టాప్‌లను ఇష్టప డే వారికి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 అద్భుతమైన ఆప్షన్. ఇది విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, పవర్‌ఫుల్ బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుంది. మల్టీటాస్కింగ్ చేయడానికి ఇది చాలా చక్కగా పని చేస్తుంది.డాల్బీ ఆడియో స్పీకర్లు , ప్రైవసీ షట్టర్ కెమెరా దీని ప్రత్యేకతలు.

Advertisement

ధర:ఆఫర్ ప్రైస్‌లో సుమారు రూ.36,999 నుంచి రూ. 42,000 మధ్య లభిస్తోంది.

3. ASUS Vivobook 15:

ఏసుస్ వివోబుక్ తన స్టైలిష్ లుక్స్‌కు చాలా పేరుగాంచింది. ఈ ల్యాప్‌ టాప్‌లో పెద్ద డిస్‌ప్లే ఉండటం వల్ల.. సినిమా చూడటానికి లేదా వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే ఎస్‌ఎస్‌డీ డ్రైవ్ వల్ల ల్యాప్‌టాప్ క్షణాల్లో ఆన్ అవుతుంది.ఎర్గోసెఫ్ట్ కీబోర్డ్, అద్భుతమైన కూలింగ్ సిస్టమ్ దీని ప్రత్యేకతలు.

ధర:సుమారు రూ.39,999 నుంచి రూ.46,000 వరకు ఉంది.

4. Dell 15 Thin & Light Laptop:

డెల్ బ్రాండ్ క్వాలిటీలో ఎప్పుడూ ముందుంటుంది. ఈ మోడల్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో పాటు రోజంతా పని చేసే బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అమెజాన్ సేల్‌లో.. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ కార్డ్స్ ఉపయోగిస్తే దీనిపై..మరింత తగ్గింపు లభిస్తుంది.పెద్ద స్క్రీన్ సైజు, బ్రాండ్ సపోర్ట్ దీని స్పెషాలిటీ అని చెప్పొచ్చు.

ధర: సుమారు రూ.41,999 నుంచి రూ. 48,999వరకు ఉంది.

Also Read: చిన్న రూమ్‌లోనే థియేటర్ ఫీల్..రూ.10వేలలోపు టాప్ ప్రొజెక్టర్స్!

5. Acer Aspire Lite:

ఆసర్ ఆస్పైర్ లైట్ బడ్జెట్ ధరలో పవర ఫుల్ ఫీచర్లను ఇస్తోంది. మెటాలిక్ ఫినిషింగ్ కలిగి ఉండే.. ఈ ల్యాప్‌టాప్ చూడటానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. తక్కువ ధరలో.. మంచి కాన్ఫిగరేషన్ కోరుకునేవారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.ప్రీమియం మెటల్ బాడీ, లైట్‌వెయిట్ డిజైన్ దీని ప్రత్యేకతలు.

ధర: రూ. 34,999 నుంచి రూ. 39,999 మధ్య లభిస్తోంది.

సేల్ సమయంలో.. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను సరిగ్గా ఉపయోగించుకుంటే.. ల్యాప్‌టాప్ మరింత తక్కువ ధరకే వస్తుంది. అలాగే మీకు అవసరమైన ర్యామ్, స్టోరేజ్ కెపాసిటీని ముందుగానే చెక్ చేసుకుని ఆర్డర్ చేయండి.

Related News

కరెంట్ బిల్లు సగానికి తగ్గాలా? ఈ BLDC ఫ్యాన్లు వాడితే బెస్ట్

ల్యాప్‌టాప్ ఛార్జింగ్ 80% దగ్గరే ఆగిపోతుందా? బ్యాటరీ పాడైపోయిందనుకుంటే పప్పులో కాలేసినట్లే!

చిన్న రూమ్‌లోనే థియేటర్ ఫీల్..రూ.10వేలలోపు టాప్ ప్రొజెక్టర్స్!

వాట్సప్‌లో ఇప్పటివరకు రాని క్రేజీ ఫీచర్.. ఇది తెలిస్తే గాల్లో తేలిపోతారు!

రియల్ మీ నుంచి బిగ్గెస్ట్ టీవీ..100 ఇంచుల క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ వచ్చేసింది!

ఇక ఎండతో పనే లేదు! బట్టలను 100% డ్రై చేసే టాప్ 5 వాషింగ్ మెషీన్లు!

అమెజాన్ సేల్‌లో..50 శాతానికి పైగా డిస్కౌంట్‌తో ఇన్వర్టర్లు

Big Stories

Advertisement
×