E-Paper
Advertisement

సెప్టెంబర్ 17న తెలంగాణలో త్రిముఖ రాజకీయం.. మూడు పేర్లు.. మూడు పార్టీల హోరాహోరీ!

సెప్టెంబర్ 17న తెలంగాణలో త్రిముఖ రాజకీయం.. మూడు పేర్లు.. మూడు పార్టీల హోరాహోరీ!
Advertisement

Telangana Liberation: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌లో.. తెలంగాణ విమోచన దినోత్సవ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర బలగాల కవాతు రిహార్సల్స్ చూశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కళాకారుల ప్రదర్శనలు, ప్రత్యేక నృత్య రూపకాలు ఏర్పాటు చేశారు. వాటి రిహార్సల్స్‌ను కూడా పరిశీలించారు. ఈ ఏడాది వేడుకలకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. ముఖ్య అతిథులుగా హాజరవుతారని కిషన్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ.. ఎంఐఎం మాట వినే.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదని ఆరోపించారు.

ఎంపీ ఈటల రాజేందర్‌..

మరోవైపు.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ.. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు కూడా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవం జరుపుతామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ మాట తప్పారని ఈటల విమర్శించారు. బుజ్జగింపు రాజకీయాల వల్లే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేదని ఆరోపించారు.

Advertisement

Also read: ఆగా ఖాన్ ఫౌండేషన్‌కి సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి.. సీఎం వ్యూహం అదేనా..?

మూడు పేర్లు.. మూడు వేదికలతో..

మరోవైపు.. కాంగ్రెస్ ప్రభపుత్వం సెప్టెంబర్ 17ని.. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఒకే రోజు.. మూడు పేర్లు.. మూడు వేదికలతో.. మరోసారి తెలంగాణలో సెప్టెంబర్ 17 రాజకీయ పోరుకు కేంద్రంగా మారింది. విమోచనమా? జాతీయ సమైక్యతా? ప్రజాపాలనా? ఏ పేరుతో పిలవాలన్నదే ఏటా రగిలే రాజకీయం.

Advertisement

Also Read: 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు.. ఎక్కడో కాదు మన ఇండియాలోనే!

Tags

Related News

అటకెక్కిన ఫైలు కిందికి దిగింది.. రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల దుమ్ము దులుపుతున్న సర్కార్‌..!

బాల్కొండ నుంచి పోటీకి రెడీ అని గ్రీన్‌ సిగ్నల్‌..! మాజీ మంత్రి వేములకు సరైన పోటీగా అధిష్టానం నిర్ణయం..!

ఉద్యోగులను పట్టించుకోకపోవడంతోనే.. పరిపాలన కుంటుపడింది.. పథకాలు పడకేశాయి..!

కేటీఆర్‌ పీఆర్వోనా మజాకా? అప్పుడు షాడో సీఎం కేటీఆర్‌ బలం.. ఇప్పుడు కాబోయే సీఎంకు పీఆర్వో… అందుకే ఆ రంకెలు.. !

జిల్లాలో ఒకే ఒక్క ఊరు.. దశాబ్దాలుగా ఏకగ్రీవ సర్పంచ్.. సున్నా కేసులు ఎక్కడో తెలుసా..?

కదిరి వైసీపీలో రగులుతున్న వర్గపోరు.. పిలవని పేరంటానికి వచ్చి రచ్చ..!

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 22A నిషేధిత జాబితా నుంచి భూములు తొలగింపు?

Big Stories

Advertisement
×