WhatsApp: కొత్త ఫోన్ తీసుకున్నప్పుడు లేదా సిమ్ కార్డ్ మార్చినప్పుడు మనం చేసే మొదటి పని వాట్సప్ నెంబర్ మార్చడం. ఇది పైకి చాలా సింపుల్ పనే అనిపిస్తుంది కానీ, చిన్న పొరపాటు చేసినా మనం ఎంతో కాలంగా తరబడి దాచుకున్న చాట్ హిస్టరీ, ముఖ్యమైన ఫొటోలు మాయమైపోతాయి. అందుకే కొత్త నెంబర్‌లోకి వాట్సప్‌ను విజయవంతంగా షిఫ్ట్ చేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అవేంటంటే..
మీరు మారుస్తున్న కొత్త నెంబర్‌కు ఇన్కమింగ్ కాల్స్, SMSలు సరిగ్గా వస్తున్నాయో లేదో ముందుగా చెక్ చేసుకోండి. అలాగే, వాట్సప్ ఏ నెంబర్లకైతే సపోర్ట్ చేస్తుందో ఆ ల్యాండ్‌లైన్ లేదా వీఓఐపీ నెంబర్లు కాకుండా రెగ్యులర్ మొబైల్ నెంబరే అయి ఉండాలి.
వాట్సప్ వెబ్ లేదా లాప్‌టాప్‌లో నెంబర్ మార్చడానికి కుదరదు. ఖచ్చితంగా మీ పాత ఫోన్‌లోని వాటసాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఛేంజ్ నెంబర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ పాత నెంబర్, కొత్త నెంబర్ రెండింటినీ ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో ఎంటర్ చేసి ప్రొసీడ్ కావాలి.
Also Read: బరువు తగ్గడం ఇక ఈజీ.. ఒప్పో నుంచి అధునాతన ‘ఫ్యాట్ బర్నింగ్ వాచ్’ వచ్చేస్తోంది!
మీ నెంబర్ మారుతున్న విషయం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలియజేయడానికి వాట్సప్ ఓ ఆప్షన్ ఇస్తుంది. అందరికీ ఈ విషయం తెలియజేయాలా, లేక మనం సెలెక్ట్ చేసిన వాళ్లకు మాత్రమే చెప్పాలా అనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎవరికీ చెప్పకపోయినా, మీ గ్రూప్‌లలో ఉన్న వాళ్లకు మాత్రం మీరు నెంబర్ మార్చినట్టు ఆటోమేటిక్‌గా మెసేజ్ వెళ్తుంది.
అసలైన కీలకమైన పాయింట్ ఇక్కడే ఉంది. పాత నెంబర్‌తో ఉన్న చాట్ బ్యాకప్ కొత్త నెంబర్‌కు సరిపోకపోవచ్చు. అందుకే నెంబర్ మార్చిన వెంటనే, ఆ కొత్త నెంబర్‌తోనే వాట్సప్ చాట్ బ్యాకప్‌ను మళ్లీ గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ డేటా ఎక్కడికీ పోకుండా సేఫ్‌గా ఉంటుంది.
ఇప్పుడు మీ కొత్త ఫోన్‌లో వాట్సప్ ఇన్స్టాల్ చేసుకొని, కొత్త నెంబర్‌తో రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న ఫ్రెష్ బ్యాకప్‌ను రిస్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే, మీరు నెంబర్ మార్చినా కూడా మీరు ఇంతకుముందు బ్లాక్ చేసిన నెంబర్లు అలాగే బ్లాక్ అయ్యే ఉంటాయి. ఏ చిన్న పొరపాటు చేయకుండా ఈ ఆర్డర్ కనుక ఫాలో అయితే మీ విలువైన వాట్సప్ డేటా సేఫ్‌గా ఉంటుంది.
Also Read: యాపిల్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. iPhone 18 Pro చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే!