
టాప్ 3. క్రూర తైమూర్
Timur the conqueror : టర్కీ-మంగోల్ జాతికి చెందిన తైమూర్ చాలా క్రూర ప్రవృత్రి కలవాడని చరిత్రకారులు చెబుతారు. తైమూర్ 1320 లేదా 1336 సంవత్సరంలో ఉజ్బెకిస్తాన్ ప్రాంతంలోని సమర్‌కంద్ ప్రాంతంలో జన్మించాడు. పుట్టుకతో అతని ఒక కాలికి పోలియో ఉన్నా అతను మిలిటరీ విద్యలో నైపుణ్యం సాధించాడు. మంగోల్ సామ్రాజ్యంలో చిన్న సైనికుడిగా అతని జీవితం ప్రారంభమైంది. ఆ తరువాత క్రమంగా అతను సైన్యాధ్యక్షడయ్యాడు. 1402 సంవత్సరంలో అతను శక్తివంతమైన ఒట్టోమాన్ సామ్రాజ్యంతో యుద్ధం చేశాడు. తైమూర్ సైన్యం చిన్నదైనా.. అతను ఏనుగులను యుద్దానకి తయారు చేసి శత్రువులపై ఉపయోగించాడు. ఆ తరువాత ఒట్టోమాన్ సైన్యాన్ని ఓటమి రుచి చూపించాడు.
తైమూర్ చాలా క్రూర విధానాలను అనుసరించేవాడు. ఏ ప్రాంతం నుంచి వెళ్లినా ఆ ప్రాంతంలో మనుషులందరినీ దయలేకుండా చంపేవాడు. శత్రువులను చంపి వారి తలలను చీల్చి పుర్రెలతో ఆకారాలు కట్టించేవాడు. అది చూసి మిగతా శత్రుసైన్యం భయంతో పారిపోయేది. యుద్ధంలో అతను శత్రువులను చాకచక్యంగా మోసగించేవాడు.

1398 సంవత్సరంలో తైమూర్ సైన్యం భారతదేశంలో ప్రవేశించినప్పుడు చాలా రాజ్యాలు యుద్ధం చేయకుండా అతనికి దాసోహమయ్యాయి. అప్పుడు భారతదేశంలో తుగ్లక్ వంశ పాలన ఉండేది. తైమూర్ సైన్యం.. తుగ్లక్ పాలకులని బంధించి.. దేశ రాజధాని ఢిల్లీలో వేల సంఖ్యలో సామాన్య పౌరులను చంపి.. రక్తపాతం సృష్టించింది. ఈ సంఘటనతో భారతదేశంలోని మిగతా రాజ్యాలు విస్తుపోయాయి. 1398 సెప్టెంబర్‌లో తైమూర్ సైన్యంతో భట్నేర్(ప్రస్తుత రాజస్థాన్)లో ముస్లింలు, రాజ్‌పుత్ సైన్యం కలిసి పోరాడాయి. కానీ తైమూర్ సైన్యం విజయం సాధించి వారందరినీ నగరం బయట గోడలకు వారి శవాలను వేలాడదీసింది.
తైమూర్ రాజ్యం ప్రస్తుత టర్కీ, గల్ఫ్ దేశాలు, ఉత్తర భారత దేశం, మంగోలియా సామ్రాజ్యం వరకు విస్తరించి ఉండేది. తన జీవితంలో తైమూర్ చేసిన యుద్దాలలో ఎన్నడూ ఓడిపోలేదు. అతనికి 43 భార్యలతో పాటు, ఎంతో మంది ఉంపుడుగత్తెలు ఉండేవారు. 1405 సంవత్సరంలో తైమూర్ చైనాపై దండయాత్రకు వెళుతూ చనిపోయాడు. ఆ తరువాత అతని వంశంలో నుంచి పలు రాజులు వచ్చారు. భారతదేశంలోని మొఘల్ రాజ్య స్థాపకుడు బాబర్ కూడా తైమూర్ వంశస్థుడే.
టాప్ 2. అల్గెజాండర్ ది గ్రేట్
క్లిక్ చేయండి