BigTV English

Tadepalli YCP Office: జగన్ తాడేపల్లి ఆఫీస్‌కి TO LET.. నెక్ట్స్ పార్టీ క్లోజ్

Tadepalli YCP Office: జగన్ తాడేపల్లి ఆఫీస్‌కి TO LET.. నెక్ట్స్ పార్టీ క్లోజ్

Tadepalli YCP Office: వైనాట్ 175. ముప్పై ఏళ్ల పాటు అధికారంలో మనమే ఉంటాం. జీవితాంతపు అధ్యక్షుడ్ని నేనే. నాకెవ్వరూ అక్కర్లేదు. నాకు నేనే రాజూ మంత్రి.. అంటూ ఇటు బంధు వర్గాన్ని అటు కార్యవర్గాన్ని లెక్కలేనట్టుగా వ్యవహరించిన వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఏంటో చెప్పడానికి ఇదొక్కటి చాలట. అంతలా అసలేం జరిగింది? ఈ బిల్డింగ్ కి ఆ TOLET బోర్డేంటి? తెలుసుకోవాలంటే? మీరీ స్టోరీ తప్పక చూడాల్సిందే.


ఒకప్పుడు ఊపింది ఫ్యాను- ఇప్పుడు టోటల్ గా మారింది సీను

ఒకప్పుడు ఊపింది ఫ్యాను- ఇప్పుడు టోటల్ గా మారింది సీను.. ఇదీ ప్రస్తుతం వైసీపీ గురించి వినిపించే మాట. తాజాగా ఈ లిస్టులోకి మరో డైమండ్ లాంటి సీనొచ్చి చేరింది.. ఈ టూలెట్ బోర్డును గమనించారుగా.. ఇది సాదా సీదా బిల్డింగ్ కి వేలాడుతున్న టులెట్ బోర్డు కాదు. ఒకప్పుడు 151 సీట్లతో రాష్ట్ర రాజకీయాలనే శాసించిన ఫ్యాను పార్టీ కేంద్ర కార్యాలయంగా పని చేసిన భవనం. ఇదీ ప్రస్తుతం దీని ముందు కనిపిస్తోన్న దృశ్యం..


రాష్ట్రాన్ని శాస్వతంగా పాలించేది కూడా నేనే.. అన్న రేంజ్ లో బిహేవ్ చేసిన జగన్

అదేంటి అధికారంలో ఉండగా.. అంతా మాదే అన్నారుగా. ఇటు పార్టీకి పర్మినెంట్ అధ్యక్షుడ్ని నేనే అనడంతో పాటు, అటు రాష్ట్రాన్ని శాస్వతంగా పాలించేది కూడా నేనే.. అంటూ వీర ధీర శూర రేంజ్ లో పలికిన డైలాగులేమై పోయాయి? అంటూ ఒక్కొక్కరూ ఈ బోర్డు చూసినంతనే నోళ్లు నొక్కుకుంటున్నారట.

151లోంచి ఐదు ఎగిరిపోగానే.. పార్టీ ఆఫీసు కూడా ఎగిరిపోయిందా?

151లోంచి ఐదు ఎగిరిపోయే సరికి.. ఏకంగా ఇక్కడి నుంచి పార్టీ కూడా ఎగిరిపోయిందా? ఇదెక్కడి విడ్డూరం. ఇది దేనికి సంకేతం? అయినా పార్టీ ఆఫీసు ను కూడా కొనసాగించలేక పోతే ఎలా? దీన్నెలా అర్ధం చేసుకోవాలి? వచ్చే రోజుల్లో పార్టీకి కూడా ఇలాగే టులెట్ పెట్టేస్తారన్న అర్ధం రాదా.. హవ్వ హవ్వ అంటూ ఈ సీన్ చూసిన వెంటనే.. ఘాటైన వ్యాఖ్యానాలే చేస్తున్నారట.

తాడేపల్లి బైపాస్ లో మెయిన్ రోడ్డుపై ఉన్న వైసీపీ ఆఫీస్

తాడేపల్లి బైపాస్ లో మెయిన్ రోడ్డుపై ఉన్న ఈ ఆఫీసు వచ్చి పోయే కార్యకర్తలతో ఎంతో కోలాహాలంగా ఉండేది. తమ తమ ఇబ్బందులు చెప్పుకునేందుకు ఇదొక వేదికగా నిలిచేది. పార్టీ ఓటమి తర్వాత వాస్తు కలసి రాలేదనో లేక అద్దె కట్టడం ఎందుకనుకున్నారో ఏమో తెలీదు కానీ.. ఇక్కడి నుంచి అధినేత జగన్ అయితే పార్టీ జెండా పీకేశారట. పార్టీ కార్యాలయం ఇక్కడి నుంచి ఖాళీ చేయించి.. క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేశారట.

అక్కడికెళ్లాలంటే సెక్యూరిటీ ప్రాబ్లంగా ఫీలవుతున్న కార్యకర్తలు

మరికనేం.. పార్టీ ఆఫీసైతే ఎక్కడో ఒక చోట ఉండనైతే ఉందిగా అంటూ అనుకోడానికి వీలు లేకుండా పోతోందట. కారణం ఇక్కడికి వెళ్లాలంటేనే సెక్యూరిటీ ప్రాబ్లం. ఒక వేళ వెళ్లినా తమ గోడు వినేందుకు ఏ ఒక్కరూ ఉండరన్న నిర్వేదం.

పార్టీ కార్యాలయం అద్దె కూడా కట్టలేదని సమాచారం

ఇక్కడి నుంచి జగన్ తన పార్టీ ఆఫీసు తీసెయ్యడంతో ఈ భవనానికి టులెట్ బోర్డు పెట్టారు యజమాని. అంతే కాదు.. అద్దె కూడా బకాయి పడ్డట్టు సమాచారం. మరి అధికారంలో ఉన్న ఇన్నాళ్ల పాటు వెనకేసింది ఏమై పోయింది? కనీసం పార్టీ ఆఫీసు రెంటు కూడా కట్టకుంటే పరిస్థితేంటి? కార్యకర్తల్లోకి ఇదెలాంటి సందేశాన్ని తీస్కుళ్తుంది? మరీ ఇంత దివాలాకోరు తనమేంటని గుసగుసలాడుతోన్నారట ఫ్యాను పార్టీ కేడర్.

ఇవాళ పార్టీ ఆఫీసు తీసేశాడు- రేపు పార్టీయే తీయడన్న గ్యారంటీ ఏంటి?

పార్టీ అధికారం లేక పోవడంతో ఆఫీసు రెంటు కూడా కట్టినంత స్వార్ధ పరుడు జగన్. అలాంటివాడు తమకు ఇంకెలాంటి న్యాయం చేస్తారు? ఇవాళ పార్టీ ఆఫీసు తీసేశాడు. వచ్చే రోజుల్లో పార్టీ తీసెయ్యడన్న గ్యారంటీ ఏంటీ? అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.. కార్యకర్తలు.

ఏమున్నదన్నో అంటూ పాడుకుంటూ తిరిగెళ్తోన్న కార్యకర్తలు

అధికారమున్న రోజుల్లో ముప్పై ఏళ్లు మనమే అధికారంలో ఉంటామని బీరాలు పలికిన జగన్.. నేడిలాంటి దుస్థితికి చేరుకోవడంతో ఏమనాలో అర్ధం కావడం లేదట సగటు కార్యకర్తకు. ఔన్లే.. పార్టీ పేరు చూస్తే శివకుమార్ అనే ఒకరు పెట్టింది. కార్యాలయం చూస్తే అద్దెకున్నది. అంటే పార్టీ మనది కాదు. ఇక అదుండే భవనమూ మనది కాదు. ఇంకేముందిక్కడ.. ఏమున్నదన్నో.. అంటూ ఆర్ నారాయణమూర్తి పాట పాడుకుంటూ పొలోమని తిరిగెళ్లిపోతున్నారట కార్యకర్తలు..

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×