OTT Movie : వాంపైర్ సినిమాలలో రక్తపాతం ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమాలు చూడటానికి భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక వాంపైర్ షెడ్ లో దాక్కుని చేసే రచ్చ అంతా ఇంతా కాదు. స్టోరీ మరో లెవెల్ ల్లో ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ వాంపైర్ హర్రర్ మూవీ పేరు’ది షెడ్’ (The Shed). 2019 లో వచ్చిన ఈ మూవీకి ఫ్రాంక్ సబటెల్లా దర్శకత్వం వహించారు. ఈ సినిమా జాసన్ రైస్ అనే రచయిత కథ ఆధారంగా రూపొందింది. ఇందులో జే జే వారెన్, కోడీ కోస్ట్రో, సోఫియా హప్పోనెన్, ఫ్రాంక్ వేలీ, టిమోతీ బాటమ్స్, సియోభాన్ ఫాలన్ హోగన్ నటించారు. ఈ సినిమా 2019 అక్టోబర్‌లో సిట్జెస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ షో ప్రదర్శించి, నవంబర్‌లో థియేటర్లలో విడుదలైంది.ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలకి వెళితే
సినిమా ఒక చీకటి అడవిలో ప్రారంభమవుతుంది. అక్కడ బేన్ అనే వ్యక్తి ఒక వాంపైర్ చేతిలో గాయపడతాడు. ఆ తర్వాత బేన్ సూర్యరశ్మి నుండి తప్పించుకోవడానికి సమీపంలోని, ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న పాత చెక్క షెడ్‌లోకి పారిపోతాడు. సూర్యకాంతి అతని చర్మాన్ని కాల్చడంతో, అతను షెడ్‌లోనే దాక్కోవలసి వస్తుంది. కథ ఇప్పుడు స్టాన్ అనే 17 ఏళ్ల యువకుడి చుట్టూ తిరుగుతుంది. స్టాన్ తన తల్లిదండ్రులు చనిపోవడంతో, తన తాత తో కలిసి జీవిస్తుంటాడు. అతను పాఠశాలలో తోటి విద్యార్థులతో బెదిరింపులకు గురవుతూ, ఒక ఇబ్బందికరమైన జీవితాన్ని గడుపుతాడు. స్టాన్‌కు డామర్ అనే స్నేహితుడు ఉంటాడు. అతను కూడా పాఠశాలలో బెదిరింపులకు గురవుతుంటాడు, ముఖ్యంగా మార్బుల్ అనే విద్యార్థి నుండి వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఒక రోజు, స్టాన్ తన వెనుక షెడ్‌లో ఏదో ఉందని గుర్తిస్తాడు. అక్కడికి స్టాన్పెంపుడు కుక్క మొరుగుతూ షెడ్ లోపలికి వెళ్తుంది. ఆ తరువాత రెండు ముక్కలై బయటకు వస్తుంది. అది బేన్ అని, అతను వాంపైర్‌గా మారాడని స్టాన్ తెలుసుకుంటాడు.
స్టాన్ ఈ సమస్యను రహస్యంగా పరిష్కరించాలని ప్రయత్నిస్తాడు, కానీ డామర్ కు ఈ విషయం తెలిసిపోతుంది. ఈ వాంపైర్‌ను తమ శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఉపయోగించాలని అనుకుంటాడు. స్టాన్ మొదట దీనికి వ్యతిరేకిస్తాడు, కానీ డామర్ తన పథకాన్ని అమలు చేయడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో వాంపైర్ స్టాన్ తాతను చంపేస్తుంది. ఇది స్టాన్‌కు మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. ఆతరువాత మార్బుల్ కూడా దీని చేతిలో బలి అవుతాడు. స్టాన్‌కు రాక్సీ అనే స్నేహితురాలు కూడా ఉంటుంది. ఆమె అతని పక్కన ధైర్యం చెబుతూ నిలబడుతుంది. వాంపైర్ రాత్రి పూట షెడ్ నుండి బయటకు వచ్చి దాడి చేస్తుంది. దీనితో పాటు ఇతర వాంపైర్లు కూడా సృష్టించబడతాయి. స్టాన్, రాక్సీ షెడ్‌ను తగలబెట్టి వాంపైర్లను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు.చివరికి వాళ్ళు ఆ వాంపైర్ లను అంతం చేస్తారా ? వాంపైర్ ల చేతిలో బలి అవుతారా ? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ వాంపైర్ హర్రర్ మూవీని చూడండి.