BigTV English

Donald Trump: ట్రంప్ కీలక నిర్ణయం..భారత్ సహా పలు దేశాలపై భారీ సుంకాలు

Donald Trump: ట్రంప్ కీలక నిర్ణయం..భారత్ సహా పలు దేశాలపై భారీ సుంకాలు

Donald Trump: ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాలు విధిస్తూ, అమెరికా వ్యాపార రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు నడుం బిగించారు. “మేక్ అమెరికా వెల్తీ ఎగైన్” కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, చాలా దేశాలు అమెరికాను దోచుకుంటున్నాయన్నారు. ఇకపై అమెరికా తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు కఠినమైన వ్యాపార విధానాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.


భారతదేశం సహా అనేక దేశాలపై సుంకాలు
ట్రంప్ ప్రకటించిన కొత్త విధానాల ప్రకారం, భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 26% సుంకం విధించనున్నారు. ఇదే విధంగా, చైనా (34%), వియత్నాం (46%), తైవాన్ (32%), జపాన్ (24%), బ్రిటన్ (10%), బ్రెజిల్ (10%) వంటి అనేక దేశాల నుంచి వస్తువులపై వివిధ రకాల సుంకాలు విధించారు. ప్రత్యేకంగా ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకున్నారు.

మోదీని మంచి స్నేహితుడిగా

“భారతదేశం చాలా కఠినమైన దేశం. అక్కడి నుంచి దిగుమతులపై మేము ఇప్పటివరకు తక్కువ సుంకాలు విధించాం. కానీ ఇకపై ఇది మారుతుందని ట్రంప్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తన మంచి స్నేహితుడిగా పేర్కొన్నప్పటికీ, వాణిజ్యంలో అమెరికాకు అన్యాయం జరుగుతోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

Read Also: Top 5 AC Deals: టాప్ 5 ఏసీలపై బెస్ట్ డీల్స్..50% తగ్గింపు …

ఆటోమొబైల్ పరిశ్రమపై కొత్త రూల్స్
ఇతర దేశాల మోటార్ సైకిళ్లపై అమెరికా కేవలం 2.4 శాతం సుంకాన్ని మాత్రమే వసూలు చేస్తుందని ట్రంప్ అన్నారు. కానీ థాయిలాండ్ సహా ఇతర దేశాలు చాలా తక్కువ ధరలను వసూలు చేస్తుండగా, భారతదేశం 70%, వియత్నాం 75% వంటి దేశాలు చాలా ఎక్కువ పన్ను వసూలు చేస్తున్నాయని ప్రస్తావించారు. ఇంత భయంకరమైన అసమతుల్యత అమెరికా పారిశ్రామిక విధానాన్ని నాశనం చేస్తుందన్నారు. ఈ క్రమంలో అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై 25% సుంకం విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే, ఆటో విడిభాగాలపై సైతం అదే స్థాయిలో పన్ను అమలు చేయనున్నారు. ఈ కొత్త సుంకాలు ఏప్రిల్ 3 నుంచి కార్లపై, మే 3 నుంచి విడిభాగాలపై అమల్లోకి రానున్నాయి.

స్నేహితులు కూడా శత్రువులే
ట్రంప్ తన ప్రసంగంలో వ్యాపారంపై తన కఠిన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. “కొన్నిసార్లు స్నేహితులు శత్రువుల కంటే ఎక్కువ ప్రమాదకరంగా ఉంటారని వ్యాఖ్యానించారు. అమెరికా చాలా దేశాలకు ఆర్థిక సాయం అందిస్తోందని, కానీ మరింత ముందుకు వెళ్లి తాము అనుభవిస్తున్న నష్టాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.

ఇది ఆర్థిక స్వాతంత్ర్య ప్రకటన
వైట్ హౌస్ రోజ్ గార్డెన్‌లో జరిగిన ఈ సమావేశంలో ట్రంప్ ఒక చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించారు. ఇది కేవలం వ్యాపారం గురించి మాత్రమే కాదు. ఇది మన దేశ ఆర్థిక స్వాతంత్ర్యం కోసం తీసుకున్న చర్య అని స్పష్టం చేశారు. గత 50 ఏళ్లుగా అమెరికా పన్ను చెల్లింపుదారులు అనేక దేశాల దోపిడికి గురయ్యారని, ఇకపై ఇది కొనసాగదని స్పష్టం చేశారు.

అమెరికా పరిశ్రమకు కొత్త శకం
ఏప్రిల్ 2, 2025 – ఈ తేదీ అమెరికా పరిశ్రమ పునర్జన్మ పొందిన రోజుగా గుర్తుండిపోతుందని ఈ సందర్భంగా ట్రంప్ అన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉక్కు కార్మికులు, ఆటోమొబైల్ రంగంలో పని చేసే వారు, రైతులు, నైపుణ్య సంపన్నులు అందరికీ ఉత్సాహాన్ని కలిగించే నిర్ణయమని తెలిపారు.

అమెరికా మళ్లీ గొప్ప దేశంగా!
1930ల నాటి మహా మాంద్యం అమెరికా ఆదాయపు పన్ను విధించడం, సుంకాలు లేకపోవడం వల్ల సంభవించిందని ట్రంప్ అన్నారు. 1870 నుంచి 1913 వరకు అమెరికా అత్యంత సంపన్నమైన దేశంగా ఉందని, ఆ సమయంలో అది “టారిఫ్ దేశం”గా ఉందని అధ్యక్షుడు ట్రంప్ గుర్తు చేశారు. వాణిజ్య లోటు ఇకపై కేవలం ఆర్థిక సమస్య కాదని. ఇది జాతీయ అత్యవసర పరిస్థితి అని తెలిపారు. చాలా దేశాలపై విధించిన కొత్త పన్నులను చూపించే బోర్డును ట్రంప్ మీడియా ముందు చూపించారు. ఈ బోర్డులో రేట్లు 10% నుంచి 49% వరకు ఉన్నాయి. ట్రంప్ తన ప్రసంగాన్ని ముగిస్తూ ఇకపై మనం మళ్లీ మన దేశాన్ని గొప్పగా మార్చుతామన్నారు. మేము అమెరికాను రక్షించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.

ఏప్రిల్ 5 నుంచి సుంకాలు వర్తిస్తాయి.
ఆయా దేశాలపై విధించిన కొత్త సుంకాలు ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 5న తెల్లవారుజామున 12:01 గంటలకు (0401 GMT) బేస్‌లైన్ 10 శాతం సుంకం అమలు చేయబడుతుందని వైట్ హౌస్ తెలిపింది. నిర్దిష్ట భాగస్వాములకు పెరిగిన రేట్లు ఏప్రిల్ 9న తెల్లవారుజామున 12:01 గంటల నుంచి అమల్లోకి వస్తాయి.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×