BigTV English
Advertisement

Top 5 Military Powers : ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీలివే!.. ఇండియా ప్లేస్ ఎంతంటే..?

Top 5 Military Powers : ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీలివే!.. ఇండియా ప్లేస్ ఎంతంటే..?

Top 5 Military Powers : గ్లోబల్ ఫైర్‌పవర్(Global Firepower) వెబ్‌సైట్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సాయుధ దళాల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం, యుఎస్ 0.0699 స్కోరుతో అగ్రస్థానంలో ఉంది, రష్యా, చైనా, భారతదేశం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్ ర్యాంకింగ్స్‌లో పడిపోయి తొమ్మిదో స్థానానికి చేరుకుంది.


ఇది 2024. ప్రపంచం రెండు యుద్ధాలతో సతమవుతోంది.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం. ఇరాక్, పాకిస్తాన్‌లపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడంతో పశ్చిమాసియాలో అనిశ్చితి నెలకొంది. ఈ సమయంలో ప్రపంచంలోని చాలా దేశాలు తమ మిలిటరీలను, మందుగుండు శక్తిని పెంచుకుంటున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకుని, గ్లోబల్ డిఫెన్స్ సమాచారాన్ని ట్రాక్ చేసే వెబ్‌సైట్ గ్లోబల్ ఫైర్‌పవర్(Global Firepower), ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటరీల వార్షిక ర్యాంకింగ్‌లను విడుదల చేసింది.

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యం ఉన్న దేశం ఏది..? భారతదేశం ఏ స్థానంలో ఉంది..?


గ్లోబల్ ఫైర్‌పవర్ అనే వెబ్‌సైట్ సైనిక బలం ఆధారంగా 145 దేశాలను అంచనా వేసి ర్యాంకులను విడుదల చేస్తోంది. దీన్నే పవర్ ఇండెక్స్ స్కోర్(Power Index Score) అంటారు. ఈ స్కోర్‌ను నిర్ణయించడానికి దళాల సంఖ్య(Number of Troops), సైనిక పరికరాలు(Military Equipment), ఆర్థిక స్థిరత్వం(Financial Stability), భౌగోళిక స్థానం(Geographical location), వనరులు(Resources) వంటి 60 ఫ్యాక్టర్స్ లెక్కిస్తారు. ఇక్కడ తక్కువ స్కోర్ బలమైన సైన్యాన్ని సూచిస్తుంది. గ్లోబల్ ఫైర్‌పవర్ ర్యాంకింగ్స్ ప్రకారం, 0.0000 స్కోరు ఉన్న సైన్యాన్ని పర్‌ఫెక్ట్‌ సైన్యంగా పరిగణిస్తారు.

ఈ కారకాల ఆధారంగా, గ్లోబల్ ఫైర్‌పవర్ 2024కు గాను అత్యంత బలమైన సైన్యాల జాబితా విడుదల చేసింది. ప్రపంచంలో అత్యంత బలమైన సైనిక శక్తిగా.. యునైటెడ్ స్టేట్స్ 0.0699 స్కోర్‌తో తొలి స్థానంలో ఉంది. ఇక బలహీనమైన మిలిటరీగా 6.3704 స్కోర్‌తో భూటాన్ చివరి స్థానంలో నిలిచింది.

ఈ ర్యాంకింగ్స్ ప్రకారం.. యూఎస్, రష్యా, చైనా, ఇండియా, సౌత్ కొరియా మొదటి ఐదు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక మాల్డోవా, సురినామ్, సోమాలియా, బెనిన్, భూటాన్‌లు అతి తక్కువ శక్తిమంతమైన మిలిటరీలగా చివరి ఐదు స్థానాలను కైవసం చేసుకున్నాయి.

ఇక 13,28,000 సైనిక సిబ్బంది, 13,209 యుద్ధ విమానాలు, 11 విమాన వాహక నౌకలు, 4,657 ట్యాంకులు అమెరికా చెంత ఉండటంతో అత్యంత బలమైన సైనిక శక్తిగా నిలిచింది. ఉక్రెయిన్‌తో భీకర పోరు చేస్తున్న రష్యా రెండో స్థానంలో ఉండటం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక డ్రాగన్ కంట్రీ 20,35,000 సైనిక సిబ్బంది, 3,304 యుద్ధ విమానాలతో అత్యంత బలమైన సైనిక శక్తిలో మూడో స్థానంలో నిలిచింది.

సౌత్ కొరియా యూకేను వెనక్కు నెట్టి ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. జపాన్, టర్కీ, పాకిస్తాన్, ఇటలీ వరుసగా ఏడు, ఎనమిది, తొమ్మిది, పది స్థానాలలో నిలిచాయి.

0.1023 స్కోర్‌తో ఇండియా అత్యంత బలమైన మిలిటరీలలో నాలుగో స్థానంలో నిలిచింది. భారతదేశ సైనిక శక్తిని పరిశీలిస్తే 14,55,550 సైనిక సిబ్బంది, 25,27,000 సాయుధ బలగాలు, 2296 యుద్ధ విమానాలతో డ్రాగన్ తర్వాత స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ఇండియా మిలటరీ శక్తి అమ్ముల పొదిలోకి కొత్త అస్త్రాలను చేర్చుకుంటుంది.

2024లో ప్రపంచ దేశాలు పూర్తి అనిశ్చితిలో ఉన్నాయి. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాది పూర్తయినా ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇక 100 రోజలు దాటిన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం పశ్చిమాసియాలో గుబులు రేపుతోంది. ఈ సమయంలో అమెరికా.. ఇరాన్‌కు సహకరిస్తోన్న వారిపై ఉక్కుపాదం మోపాపలని పావులు కదుపుతోంది. ఇజ్రాయెల్.. హమాస్‌పై దాడి చేస్తున్న సమయంలో లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేశారు.

ఇక యెమెన్‌కు చెందిన హౌతీలు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు జరుపుతున్నాయి. తాజాగా అమెరికా వాణిజ్య నౌకపై డ్రోన్ దాడులు చేయడంతో ఇండియా నౌకాదళానికి చెందిన INS విశాఖపట్నం రక్షించింది. ఓవైపు ఇరాన్.. ఇరాక్, పాకిస్తాన్‌పై క్షిపణి దాడులు చేసింది. ఇవన్నీ చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధ సంకేతాలు కనిపిస్తున్నాయి అనే చర్చ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది.

Related News

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Big Stories

×