Fishing harbour fire accident Vizag : వేలమంది జీవనాధారం పోవడానికి కారణం నాని?

Fishing harbour fire : వేలమంది జీవనాధారం పోవడానికి కారణం నాని?

Share this post with your friends

Fishing harbour fire accident Vizag

Fishing harbour fire accident Vizag(AP news live) :

మంచి యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న ఆ వ్యక్తికి ఇదేం పని. పార్టీలు, గొడవల పేరుతో వేల మంది జీవనాధారంపై గట్టిదెబ్బ కొట్టాడు. కావాలనే చేశాడా.. పొరపాటుగా జరిగినా.. తీరని నష్టమైతే వాటిల్లింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు కాలిపోయిన ఘటనల వెనక ప్రైమ్ సస్పెక్ట్ గా ఉన్న లోకల్ బాయ్ నాని ఎవరు?

రాత్రికి రాత్రే ఎందరినో హీరోలు.. జీరోలు చేసిన చరిత్ర యూట్యూబ్‌ కు ఉంది. అలా యూట్యూబ్‌ పుణ్యామా అని ఒక మత్స్యకారుడు కూడా ఓ సెలబ్రెటీ అయ్యాడు. అతనే వైజాగ్‌కు చెందిన నాని. లోకల్‌ బాయ్‌ నాని పేరుతో సముద్రంలో వేటకు వెళ్లి చేపలు ఎలా పడతారో.. గంగపుత్రుల జీవన విధానంపై వీడియోలు షూట్‌ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తూంటాడు. అలాంటి వ్యక్తికి మంచి వ్యూవర్‌షిప్‌ రావడంతో క్రమంగా వైజాగ్‌ అనే కాదు.. ప్రపంచంలోనే తనకంటూ యూట్యూబర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

2019 జులై 29న నాని..ఛానల్‌ క్రియేట్‌ చేశాడు. ఇప్పటివరకూ 536 వీడియోలు అప్‌లోడ్‌ చేసినట్టుగా తెలుస్తోంది. ఇతని ఛానల్‌కు దాదాపుగా 17 లక్షల మంది వరకూ సబ్‌స్ర్రైబర్స్‌ ఉన్నారు. టిక్‌టాక్‌ లో వీడియోలు అప్‌లోడ్‌ చేసే నాని.. క్రమంగా యూట్యూబ్‌ స్టార్‌గా ఎదిగాడు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు కాలిపోయిన ఘటనలో పోలీసులు… ప్రైమరీ సస్పెక్ట్‌గా ఇతన్నే అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు నాని పేరునే చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో లోకల్‌ బాయ్‌ నానికి అక్కడం ఏం పని. ఆదివారం.. ఆస్ట్రేలియా భారత్‌ మధ్య వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ జరిగింది. పైగా నాని.. భార్యకు శ్రీమంతం చేశారు. ఆ కార్యక్రమం పూర్తైన తర్వాత…. ఫ్రెండ్స్‌తో హార్బర్‌కు వెళ్లి పార్టీ చేసుకుంటున్నాడు. అయితే గతంలో నానికి ఓ బోటు ఉండేది. ఆ బోటును బాలాజీ అనే వ్యక్తి కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాడు. అందుకుగాను అడ్వాన్స్‌ కూడా చెల్లించాడు. అయితే… కొద్ది రోజుల నుంచి బాలాజీ తాను ఇచ్చిన అడ్వాన్స్ మొత్తం తిరిగి ఇవ్వాలని అడుగుతున్నాడు. ఇదే క్రమంలో వారిద్దరి మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. వంట చేస్తుండగా వివాదం జరగడం.. ఆ సమయంలోనే ఒక బోటుకు నిప్పు అంటుకుని.. అది మిగతా పడవలకు అంటుకోవడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని మత్స్యకారులు చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే లోకల్ బాయ్ నాని… ఈ ప్రమాద దృశ్యాలను షూట్ చేసి తన యూ ట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు. అసలు… ఈ ప్రమాదం ఎలా జరిగిందో, ఎవరు కారకులో తెలియడం లేదని నాని… ఆ వీడియోలో చెప్పారు. తనపై అటెన్షన్ ఉండకూడదనే.. కావాలనే ఈ వీడియో తీసినట్టుగా జోరుగా చర్చ జరుగుతోంది. బోట్లు కాలిపోతుంటే సాయం చేయకుండా వీడియోలు తీయడంపై అతని ఫాలోవర్సే కామెంట్లు చేస్తున్నారు. అతని ప్రవర్తన అనుమానాలకు తావిచ్చేలా ఉందంటున్నారు. తన వీడియోలో గంజాయి తీసుకునే వారు బోట్లలో తిష్టవేయడం వల్లే ఇదంతా జరిగి ఉంటుందన్నాడు. ఇలా నాని చేసిన ఆ వీడియోనూ పరిశీలిస్తే తాను మద్యం తాగి ఉన్నాడని చూస్తే చెప్పవచ్చంటున్నారు అతని ఫాలోవర్స్‌. ఎంతో బాధగా ఉందంటూ నాని… ఆస్కార్ రేంజ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని కామెంట్ల రూపంలో విమర్శిస్తున్నారు.

సాధారణంగానే మనిషికి తనకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. అలాగే నాని.. కూడా తాను చేసే పనిని అందరికీ తెలియజేయాలనుకుని యూట్యూబ్‌ ను స్టార్ట్‌ చేశాడు. వీడియోలకు మంచి వ్యూస్‌ వస్తుండటంతో క్రమంగా ఆర్థికంగా కూడా బాగానే సంపాదించాడనే టాక్‌ ఉంది. కొత్తకొత్త కార్లు కొనుగోలు చేయడం, ఓ ఇల్లు నిర్మించుకోవడం… ఇలా బాగానే వెనకేసాడని తెలుస్తోంది.

అలాంటి వ్యక్తి… ఇలా కేసులో పోలీసుల అదుపులో ఉండటం నిజంగా యూట్యూబ్‌ సమాజం ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ నిజంగానే నాని వల్లే ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది అని నిరూపితమైతే.. తోటి మత్స్యకారులే అతన్ని పురుగును చూసినట్టు చూడటం ఖాయం. కేవలం ఆస్తినష్టమే జరిగింది కానీ.. ప్రాణనష్టం సంభవించి ఉంటే ఎలా ఉంటుంది అన్నది ఊహించుకుంటేనే డేంజర్‌గా ఉంది. మొత్తంగా.. ఆకతాయిలు చేసిన పని వల్లే… వందలాది మత్స్యకార కుటుంబాలు వీధిన పడ్డాయా.. వారికి కోలుకోలేని దెబ్బ తగిలిందా అనేది ఒకట్రెండు రోజుల్లోనే తేలిపోనుంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Nara Lokesh Padayatra: యువగళం @200 డేస్.. ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర సాగిందంటే?

Bigtv Digital

Revanth Reddy: సజ్జలకు కేసీఆర్ సపోర్ట్.. అందుకే బీఆర్ఎస్.. రేవంత్ లాజిక్!

BigTv Desk

Errabelli Viral Audio : దళితబంధుపై దగా.. వైరల్ అవుతున్న మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు

Bigtv Digital

Corona : దేశంలో కరోనా సూపర్ వేరియంట్ తొలి కేసు.. గుజరాత్ లో వెలుగులోకి..

Bigtv Digital

Talasani vs Revanth: వాడు వీడు.. పిసుకుడు.. తలసాని వర్సెస్ రేవంత్

Bigtv Digital

Srikalahasti: సీఐ అంజు యాదవ్‌పై సుమోటోగా కేసు.. రంగంలోకి HRC..

Bigtv Digital

Leave a Comment