US Israel Arms: పశ్చిమాసియా ఘర్షణల వేళ.. ఇజ్రాయెల్‌కు అమెరికా ఇచ్చిన ప్యాకేజీతో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయ్. 26 వేల కోట్ల భారీ ఆయుధ ప్యాకేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది యూఎస్. ఇందులో ఒక్కొక్కటి టన్ను బరువున్న దాదాపు 40 వేల శక్తివంతమైన బాంబులు ఉన్నాయి. గతంలో పౌరుల ప్రాణనష్టంపై ఆందోళనతో నిలిపివేసిన ఈ ఆయుధాల డెలివరీని.. ఇప్పుడు అమెరికా మళ్లీ పునరుద్ధరించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ఇప్పటికే కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలన్నీ నీరుగారిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ, మరోవైపు ఇజ్రాయెల్ తన సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటుండటంతో.. ప్రాంతీయంగా ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. శాంతి చర్చలకంటే మళ్లీ పూర్తిస్థాయి ఘర్షణల వైపే పరిస్థితులు వెళ్తున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Also read: ఆ స్వేచ్ఛ ఇప్పుడు లేదు.. అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!
అమెరికా ఈ స్థాయిలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తుండటంతో టెహ్రాన్ అలర్ట్ అయింది. తనపై, తన మిత్రపక్షాలపై ఏ క్షణమైనా జరిగే దాడులను తిప్పికొట్టేందుకు.. ఇరాన్ తన సైనిక దళాలను హైఅలర్ట్‌లో ఉంచింది. కేవలం రక్షణ చర్యలకే పరిమితం కాకుండా, వ్యూహాత్మక ప్రతీకార చర్యల కోసం ఇరాన్ తన క్షిపణి, డ్రోన్ మోహరింపులను మరింత వేగవంతం చేసే అవకాశముంది. మొత్తానికి.. అమెరికా అందిస్తున్న ఈ మారణాయుధాల సాయం పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలను పూర్తిగా ఆవిరి చేసేసింది. దౌత్య మార్గాలు మూసుకుపోయి, మళ్లీ విధ్వంసమే తాండవిస్తే.. ఈ ప్రాంతం మరో ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువుగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలాంటి అనూహ్య మలుపులకు దారితీస్తాయన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో ఉంది.
Also read: 22A నిషేధిత భూములపై సీఎం క్లారిటీ.. అసెంబ్లీలో బిఆర్‌ఎస్ నేతలపై సీఎం రేవంత్ ధ్వజం!