APPSC Recruitment: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నోటిఫికేషన్లు వచ్చేశాయ్. ఏపీపీఎస్సీ నుంచి భారీ రిక్రూట్‌మెంట్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఒకేరోజు 20 రకాల నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయ్. వివిధ శాఖల్లో 892 పోస్టుల భర్తీకి బ్రీఫ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయ్. వీటిలో గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా ఉంది. మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్యూటీ కలెక్టర్‌లు, ట్యాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు, డీఎస్పీ సివిల్, డీఎస్పీ కమ్యూనికేషన్స్, డీఈవోలు, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, ఆర్టీవోలు, మున్సిపల్ కమిషనర్ గ్రేట్-2 పోస్టులు, డిప్యూటీ రిజిస్టర్ కో-ఆపరేటివ్ సర్వీసెస్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, డివిజినల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ లాంటి కీలక పోస్టులు ఉన్నాయి.
మిగిలిన 729 పోస్టుల భర్తీకి.. అర్హత, నియామక పరీక్షల వివరాలు, ఇతర అంశాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచారు. అభ్యర్థులు అక్టోబర్ 6 నుంచి 27వ తేదీ వరకు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరో 5 శాఖల పోస్టులకు ఈ బుధవారం రోజున, మరో 10 శాఖలకు ఈ నెల 24న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇదే సమయంలో మరో కీలక ప్రకటన వచ్చింది.
Also read: అధికారులు కాదు.. తప్పు చేసిందే ప్రభుత్వం.. 22A వివాదంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
నాన్-యూనిఫాం సర్వీస్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులకు.. అదనంగా పదేళ్ల వెసులుబాటు దక్కుతుంది. వయోపరిమితి దాటిపోయి నిరాశలో ఉన్న లక్షలాది మందికి ఇది కొత్త అవకాశం అని ప్రభుత్వం చెబుతోంది. ఈ కొత్త రూల్ 2027 సెప్టెంబర్ 30 నుంచి జరిగే నియామకాలకు వర్తించనుంది. యూనిఫాం సర్వీసులకు మాత్రం ఈ పదేళ్ల మినహాయింపు వర్తించదు.
Also read: తల్లి కాంగ్రెస్‌నే ఎదిరించాం.. ఈ పిల్ల కాంగ్రెస్ ఓ లెక్కా? రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్!