Botsa Satyanarayana: ఉమ్మడి రాష్ట్రంలో ఒకానొక దశలో సీఎం రేసులో ఉన్న బొత్స సత్యనారాయణ ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కొంటున్నారు. స్వయంకృతాపరాధమే ఆయన సమస్యకు కారణమని ప్రచారం జరుగుతోంది. జెడ్పీ చైర్మన్ గా తన కుమార్తె పోటీ చేస్తారని ఆయన చేసిన ప్రకటనే కొంప ముంచిందని చర్చ నడుస్తోంది.
సైకిల్ వైపు వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు
బొత్స ప్రకటన తర్వాత ఆయనకు కుడిభుజంగా ఉన్న మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీ గూటకి చేరిపోయారు. ఇప్పుడు జిల్లాలో వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు సైకిల్ వైపు చూస్తున్నారనే ఊహాగానాలు నడుస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో రాజకీయాలను బొత్స చూసుకుంటే.. జిల్లాలోని క్యాడర్ ను చిన్న శ్రీను సమన్వయం చేసేవారు. విజయనగరం బొత్స ఓ వ్యవస్థగా మారాడానికి మేనల్లుడి వ్యూహరచనలే కారణమని అంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పార్టీ మారడంతో జిల్లాలో బొత్సకు పెద్ద ఎదురుదెబ్బ అని ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ లేని విధంగా రీసెంట్ గా ఆయన 2 సార్లు కంటతడి పెట్టుకున్నారంటే ఆ ప్రచారంలో ఎంతోకొంత నిజంగా ఉందనే చెప్పాలి.
బొత్సకు, చిన్న శ్రీనుకు మధ్య కోర్డ్ వార్..
2024 ఎన్నికల ముందు నుంచే బొత్సకు, చిన్న శ్రీనుకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. గత ఎలక్షన్స్‌లో తన భార్య ఎంపీ సీటు, తమ్ముడికి ఎమ్మెల్యే సీటు ఇప్పించి సత్తిబాబు చీపురుపల్లి నుంచి పోటీ చేశారు. అదే సమయంలో మేనల్లుడికి టికెట్ రాకుండా అడ్డుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక ఓడిపోయిన తర్వాత కూడా బొత్సాకు మండలిలో ప్రతిపక్షనేతగా జగన్ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తన కుమార్తెను జిల్లా జెడ్పీ చైర్మన్ గా ఏకపక్షంగా ప్రకటించారాయన. ఈ ప్రకటనే చిన్న శ్రీనుకి రుచించలేదని ఆయన వర్గం వెర్షన్. అందుకే సైకిల్ ఎక్కి మేనమామకు షాక్ ఇచ్చారు.
ఇంటి సమస్యలో సత్తిబాబు..
ఇంతవరకూ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా ఉన్న సత్తిబాబు ఇప్పుడు తన ఇంటి సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతున్నారు. అన్నీ అనుకూలంగా ఉన్నపుడే కుమార్తెను పొలిటికల్ గా ఎమర్జ్ చేయడం అంత సులభం కాదు. ఇప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నపుడు బొత్స ఎలా నెట్టుకొస్తారో చూడాలి.
Also Read: ట్రేడ్ లైసెన్స్ పేరుతో దోపిడీ.. పట్టుకుని పోలీసులకు అప్పగించిన యువకులు!