Anasuya:అనసూయ (Anasuya).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో.. అద్భుతమైన నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది . అటు షోలు.. ఇటు సినిమాలు అంటూ మరింత బిజీగా మారిన ఈమె.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక వీడియోతో ట్రెండింగ్ లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆడవారి కోసం ప్రత్యేకంగా కొన్ని వీడియోలు పంచుకుంటున్న ఈమె.. ఈమధ్య కాలంలో వర్కౌట్స్ పేరిట మరింత బిజీగా మారిపోయింది.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా బిజీగా ఉంటూనే.. మరొకపక్క కాంట్రవర్సీ మాటలతో నిత్యం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పుడు మరో వీడియోతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అప్పుడు వున్న స్వేచ్ఛ ఇప్పుడు లేదంటూ అనసూయ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా తన ఇంటి పైన ప్రత్యేకంగా తనకోసం నిర్మించుకున్న జిమ్ గదిలో వర్కౌట్స్ చేస్తూనే.. అందంగా డాన్స్ చేస్తూ ఆకట్టుకుంది. ఇక ఈ డాన్స్ వీడియోని తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ.. ప్రస్తుతం నేను డాన్స్ చేస్తుంటే.. ఒకప్పుడు నా శరీరానికి నేను ఇచ్చిన ఆనందాన్ని అది మళ్ళీ గుర్తు చేసుకుంటోంది. నేను టెలివిజన్ రంగంలో ఉన్న రోజుల్లో దాదాపు ప్రతిరోజు డాన్స్ చేసేదాన్ని.. కానీ సినిమాలు నెమ్మదిగా ఆ లయను మార్చేశాయి. నేను ప్రతిరోజు వర్కౌట్స్ చేస్తున్నాను.
ALSO READ:వేల కోట్ల స్కామ్.. ఇప్పుడు పూట గడవడం లేదు.. ఆర్థిక కష్టాల్లో ఐబొమ్మ రవి!
దీనివల్ల నా కండరాల శిక్షణ నన్ను బలంగా, ఆరోగ్యంగా ఉంచింది కానీ డాన్స్ ఇచ్చే సౌలభ్యం, స్వేచ్ఛ, నైపుణ్యం, తృప్తి ఇప్పుడు లభించడం లేదు. ముఖ్యంగా వీటన్నింటిని నేను ఎంతగా మిస్ అవుతున్నానో గ్రహించాను. అందుకే ఎలాంటి ఫిల్టర్ లేకుండా.. దృఢంగా ఉన్నా సరే , డాన్స్ చేస్తూ మళ్ళీ ఆ స్వేచ్ఛను తిరిగి పొందే ప్రయత్నం చేస్తున్నాను ” అంటూ ఒక వీడియో షేర్ చేస్తూ.. తన అభిప్రాయాలను పంచుకుంది అనసూయ. మొత్తానికి అయితే అనసూయ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
హీరోయిన్ మెటీరియల్ అనిపించకున్న ఈమె హీరోయిన్గా అవకాశాలు దక్కించుకోకపోయినా.. కీలక పాత్రల్లో నటిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. రంగమ్మత్త, దాక్షాయిని వంటి పాత్రలతో ఒక మార్కు క్రియేట్ చేసిన అనసూయ.. అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా జబర్దస్త్ వంటి షోలలో యాంకర్ గా పనిచేసి.. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. జబర్దస్త్ నుండి దూరమై సినిమాలలో సందడి చేసింది. ఇక మధ్యలో మళ్లీ బుల్లితెరపై అడుగులు వేసిన ఈమె కొన్ని షోలలో జడ్జిగా కూడా పనిచేసిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు కొన్ని పాటలలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.
?stkn=MWhwYnR1dXJqamxuOQ==