E-Paper
Advertisement

Vallabhaneni Vamsi: వంశీ పరార్.. అసలు కథ ఇదే

Vallabhaneni Vamsi: వంశీ పరార్.. అసలు కథ ఇదే
Advertisement

Vallabhaneni Vamsi: ఆంధ్రప్రదేశ్‌లో కనీస రాజకీయ అవగాహన ఉన్నవాళ్లకు వల్లభనేని వంశీ పేరు తెలియకుండా ఉండదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్‌ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వంద రోజులకుపైగా జైలులో ఉన్న వల్లభనేని వంశీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పడుప్పుడే రాజకీయంగా యాక్టివ్‌ అవుతున్నారన్న సందర్భంలో మరో హత్యాయత్నం కేసు వంశీపై నమోదు అయింది… దాంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారనే చర్చ ఏపీ పాలిటికల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు .. విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణలో ఉన్న సత్యవర్ధన్‌ కేసు వాయిదాకు హాజరుకావాల్సి ఉన్నా అటెండ్ కాలేదు .. టీడీపీ నుంచి రెండు సార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచి, తర్వాత వైసీపీ జపం మొదలుపెట్టిన వల్లభేని వంశీపై తాజాగా మరో హత్యాయత్నం కేసు నమోదైంది. దాంతో ఆయన ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తోంది.. సమన్లు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులకు ఆయన ఆచూకీ చిక్కలేదు .. దాంతో వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లునారనే ప్రచారం బలంగా జరుగుతోందట.

వంశీపై మరో హత్యాయత్నం కేసు నమోదు

Advertisement

పలు కేసుల్లో బెయిల్‌పై బయటకు వచ్చిన వల్లభనేని వంశీ.. గత కొన్ని రోజులుగా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న ఆయన ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసి, అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోవడం విషయం ఇప్పుడు ప్రధానంగా గన్నవరం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. బెయిల్‌పై బయలకు వచ్చిన వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈ నెల 17న విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే వంశీ కనిపించడం లేదనే చర్చ తెరపైకి వచ్చింది.

సమన్లు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులకు దొరకని ఆచూకీ

మాచవరం పోలీసులు తనను అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి ఉంటారనే చర్చ గన్నవరం నియోజకవర్గంలో నడుస్తోంది. ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరికొంతమందిని నిందితులుగా చేర్చారు. 2024 జూన్ 7న సునీల్ పై దాడి చేయమని.. వల్లభనేని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని.. దీంతో, వారు కర్రలు, మారణాయుధాలతో అతన్ని తీవ్రంగా గాయపరిచారన్న ఫిర్యాదుతో మాచవరం స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి సమన్లు ఇచ్చేందుకు పోలీసులు మాజీ ఎమ్మెల్యే వంశీ ఇంటికి వెళ్లారని.. అయితే ఆయన మాత్రం వారికి అందుబాటులోకి రాలేదని అంటున్నారు పోలీసులు. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించినా ఉపశమనం లభించలేదనేది వంశీ వర్గీయలు చెప్తున్నారు. కోర్టు నుంచి ఉపశమనం రాకపోవడంతో వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఉంటారని ప్రచారం జరుగుతోంది.

వంశీపై నమోదైన కేసుల్లో పోలీసులు రీ ఓపెన్

Advertisement

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీపై నమోదైన కేసుల్లో పోలీసులు రీ ఓపెన్ చేశారు. సత్యవర్ధన్ కేసులో వల్లభనేని వంశీని ఫిబ్రవరి 13న హైదరాబాద్ లో అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఈ సమయంలోనే వంశీపై సుమారు 11 కేసులు నమోదు కాగా… ఇటీవల అన్నింటిలోనూ కోర్టులో బెయిల్ మంజూరు అయింది. కోర్టులో ఉపశమనం దోరకడంతో విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన సుమారు 137 రోజుల తర్వాత బయటకు వచ్చారు. జైలులో ఉన్నప్పుడే ఆయన ఆరోగ్యం దెబ్బతిందన్న ప్రచారం మొదలైంది.

జైలు నుంచి బయటకు వచ్చిన వంశీ కొంత కాలం సైలెంట్‌

ప్రత్యర్ధులపై ఇష్టానుసారం ఒంటికాలిపై లెగిసే వంశీ జైలు నుంచి బయటకు వచ్చేటప్పటికే ఆయన అవతారం పూర్తిగా మారిపోయింది. అప్పుడే ఆయన అనారోగ్యం సంకేతాలు వెలువడ్డాయి. ఆ క్రమంలో జైలు నుంచి బయటకు వచ్చిన వంశీ కొంత కాలం సైలెంట్‌గా ఉన్నారు. ఈ మధ్యనే రాజకీయంగా యాక్టివ్‌ అయ్యేందుకు అడుగులు వేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో పాల్గొన్న తర్వాత…నియోజకవర్గంలోను తన కార్యక్రమాలను స్టార్ చేశారు. రాజకీయంగా యాక్టివ్ అయ్యే సమయంలో వంశీపై మరోకేసు నమోదు అయింది. దాంతో మరోసారి జైలుపాలై, రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆయన అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయి ఉంటారంటున్నారు. మొత్తానికి వంశీ కనిపించడంలేదనే టాక్‌ గన్నవరం నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది.

Story By Ajay, Big Tv 

 

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×