EPAPER

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు పార్ట్ 1


27 ఎకరాలు.. 3వేల కోట్లు
రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమి
కానీ, కేటీఆర్ టీమ్‌కు ప్రైవేట్ ల్యాండ్
ఖాజాగూడలో వంశీరాం సుబ్బారెడ్డి ఖతర్నాక్ స్కెచ్

– గుట్టుచప్పుడు కాకుండా పోరంబోకు భూమికి లైన్ క్లియర్
– 60 కోట్లు తీసుకుని ఎన్‌ఓసీ ఇచ్చిన ఐఏఎస్ అమోయ్?
– అధికారుల తప్పుడు సమాచారంతో హైకోర్టు గ్రీన్ సిగ్నల్
– కోర్టు ఆర్డర్ పేరుతో అధికారుల నాటకాలు
– ప్లాట్ లేకుండా సొసైటీ ప్రెసిడెంట్‌గా బీఆర్ఎస్ నేత కొండూరు రవీందర్ రావు
– రూట్ క్లియర్ చేసినందుకు 30 శాతం వాటా
– ఇప్పటికీ చక్రం తిప్పుతున్న దామర్ల రాఘవరావు
– బేవర్లీ హిల్స్ ఓనర్స్ సొసైటీ పేరుతో అసలేం జరిగింది?
– బీఆర్ఎస్ పెద్దల ముసుగులో జరిగిన బడా స్కెచ్‌పై స్వేచ్ఛ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ


దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

Land Disputes: వంశీరాం బిల్డర్స్, వివాదాస్పద భూములకు కేరాఫ్ అడ్రస్. లిటిగేషన్ భూములను కొట్టేయడంలో మహా దిట్ట. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో వివాదాస్పద భూమిలో అక్రమంగా అనుమతులు పొంది, కోట్ల రూపాయలు వెనకేసుకుంటోంది. రూల్స్ ప్రకారం వెళ్తే వచ్చేది తక్కువేనని భావించి, లిటిగేషన్ ల్యాండ్స్‌తోనే వేల కోట్లు కొట్టేయొచ్చని ఫిక్స్ అయింది. వివాదాస్పద భూములకే ప్రాముఖ్యత ఇస్తూ, ఖాజాగూడలో రూ.3వేల కోట్ల విలువైన 27 ఎకరాల పొరంబోకు భూమిపై కన్నేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై ఫైట్ చేసి ఉంటే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వచ్చేది. ఓ జూనియర్ న్యాయవాది అయిన ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్‌తో ఎలాంటి వివాదం లేదని చెప్పించారు. దీంతో హైకోర్టు కలెక్టర్‌కే తుది నిర్ణయం అప్పగించింది. ఇదే అదునుగా ఆ పొరంబోకు స్థలం పట్టాగా మారింది. దీనికోసం 60 కోట్ల రూపాయలు అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

సేత్వార్ నుంచీ ప్రభుత్వ భూమిగా రికార్డులు

సర్వే నెంబర్ 27లో మొత్తం 64 ఎకరాల 26 గుంటల భూమి ఉంది. ఇదంతా పోరంబోకు స్థలం. సేత్వార్, ఖాస్రా పహాణీలో రికార్డ్ అయి ఉంది. పాత సర్వే నెంబర్స్ 117/3/1 పేరుతో సేస్సాల్‌లో 1955 – 58 వరకు ప్రభుత్వ భూమిని డివైడ్ చేశారు. ఆ తర్వాత దూడల సాయన్న పేరు తెరపైకి వచ్చింది. పొజిషన్ కాలంలో ఇది రికార్డు అయింది. 1960 – 61లో కొత్త సర్వే నెంబర్ 27 అని పేర్కొంటూనే పాత దాన్ని మాత్రం పోరంబోకు భూమిగా పేర్కొన్నారు. పొజిషన్ కాలంలో రాములు అండ్ అదర్స్ అని ఉంది. 1974 – 75 కాలంలో సర్వే నెంబర్ 27ని మూడుగా డివైడ్ చేశారు. 27/1 ప్రభుత్వ భూమి 57.26 గుంటలు, ఇందులో అనుభవదారుని కాలంలో 24 మంది రైతులు ఉన్నారు. 27/2 పేరు మీద 2 ఎకరాలు. 27/3లో 5 ఎకరాలు ఉంది. కొన్ని సంవత్సరాలు మాత్రమే అనుభవదారుని కాలంలో ఉంది. ఆ తర్వాత అంతా ప్రభుత్వ భూమిగా రికార్డులు చెబుతున్నాయి.

1993లోనే మార్పులు

సర్వే నెంబర్ 27లోని భూమి తమదేనంటూ 1993లో సలాబాత్ ఖాన్‌తో పాటు కొంతమంది ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317 ఫస్లీ ప్రకారం పాత సర్వే నెంబర్ 119, 122 ప్రకారం రాటిఫికేషన్ చేయించుకున్నారు. ఫైల్ నెంబర్ డీ1/8670/1993 ప్రకారం 1995 జనవరి 30న జిల్లా రెవెన్యూ అధికారి ఆర్డర్ ఇచ్చారు. ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశాలు కూడా వచ్చాయి. ముస్లిం ఫ్యామిలీ నుంచి యాకుబ్ ఖాన్, యాసిన్ ఖాన్ సర్వే నెంబర్స్‌లో 7.36 గుంటలు, 19.22 ఎకరాలుగా పేర్కొన్నారు. యాసిన్ ఖాన్ వారసులమంటూ అయూబ్ ఖాన్, సలాబాత్ ఖాన్ 1993లో డిస్ట్రిక్ రెవెన్యూ ఆఫీసర్ ముందు పిటిషన్ దాఖలు చేశారు. వీరు 1953లో జమాబంది జరిగినప్పుడు పట్టాదారు పహానీల్లో 1954 నుంచి 1960 వరకు ఉన్నామని తెలిపారు. సర్వే నెంబర్ ఎర్రర్స్ ఉన్నాయని రిట్ పిటిషన్ నెంబర్ 13862 ఆఫ్ 1984 దాఖలు చేశారు. యాసిన్ ఖాన్, హైదర్ మీర్ ఖాన్, సయ్యద్ హమ్మద్ పిటిషనర్స్‌గా ఉన్నారు. అప్పటికే హైదర్ మీర్ ఖాన్, సయ్యద్ హమ్మద్‌లు చనిపోయారని అంటున్నారు. 1989లో రికార్డులు పరిశీలించి మార్పులు చేయాలని సర్వే నెంబర్స్ ఎర్రర్స్‌పై హైకోర్టుకు వెళ్లారు. కలెక్టర్ రికార్డులు పరిశీలించి మార్పులు చేయాలని ఆదేశించారు. రాటిఫికేషన్ చేసిన తర్వాత సర్వే నెంబర్ 27లో 27.18 గుంటల భూమిని సిఖిందర్ ఖాన్, హిమాయత్ ఖాన్, కుమ్ అజారా ఖాన్, మోతి భాను, సాఫియా బాను, బాదర్ బాను, సఖినా బానును పట్టాదారులుగా ప్రకటించారు. మిగితా 37.08 గుంటలను ప్రభుత్వ భూమిగా ప్రకటిస్తూ సప్లెమెంటరీ సేత్వార్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 1995లో అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సప్లెమెంటరీ సేత్వార్ విడుదల చేశారు.

Also Read: One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

పల్లవి స్కూల్ కొమురయ్య లే అవుట్ కథ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంచైజర్ పల్లవి స్కూల్ ఓనర్ కొమురయ్య, వివాదాస్పద భూమిలో 5 డాక్యుమెంట్ల రూపంలో 27 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్లాటింగ్ చేసి 1996లో అమ్మకం జరిపారు. అయితే, వీరంతా యాసిన్‌తో కలిసి ముగ్గురు బ్రదర్స్ ఫ్యామిలీ. కానీ, ఒక్క ఫ్యామిలీ వద్ద నుంచే 27 ఎకరాలు కొనుగోలు చేసి అమ్మకం జరిపారు. గతంలో కొంతమంది రైతులు, అనుభవదారుని కాలంలో ఉన్నామంటున్న వారి నుంచి కే జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేశారు. 1995లో డిస్ట్రిక్ రెవెన్యూ అధికారి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని రిట్ పిటిషన్ నెంబర్ 21689 ఆఫ్ 2000ను దాఖలు చేశారు. దీనిపై 2005లో స్పష్టమైన ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. ఇందులో 1984లో దాఖలు చేసిన పిటిషన్ నెంబర్ 13862 ప్రకారం కేసు విచారణ జరిపింది హైకోర్టు. అంతా చేయాల్సింది కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ విచారణ చేశారని, రెవెన్యూ అధికారికి అధికారం లేదని, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం చేశారని వాటిని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ప్రభుత్వ భూమి అని 2005లో మరోసారి రికార్డులను పరిశీలించి హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై రిట్ అప్పీల్ పిటిషన్స్ (నెం.1093/2005, నెం. 2031/2005)దాఖలు అయ్యాయి. కొమురయ్య వద్ద నుంచి కొనుగోలు చేసిన ప్లాట్ ఓనర్స్, రైతుల వద్ద నుంచి అగ్రిమెంట్ చేసుకున్న జ్ఞానేశ్వర్ కాంప్రమైజ్ అవుతామని చెబుతూ పిటిషన్‌ని విత్ డ్రా చేసుకున్నారు. అంటే ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ఇద్దరూ ఒక్కటైపోయారు. దీంతో అప్పీల్ సెట్ సైడ్ అయింది.

బీఆర్ఎస్ నేతల సెటిల్‌మెంట్స్

గచ్చిబౌలికి ఓఆర్ఆర్‌కి అత్యంత దగ్గర ప్రాంతం కావడంతో ఎకరం రూ.100 కోట్లకు పైనే ఉంటుంది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్న కేటీఆర్ తన మనుషులను రంగంలోకి దింపారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న కొండూరు రవీందర్ రావుకి ఎలాంటి ప్లాట్ లేకుండానే బేవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీకి అధ్యక్షుడిని చేశారు. ఈయన ఆ భూమికి సంబంధించి కేటీఆర్ ఏది చెబితే అలా నడుచుకున్నారు. 120 మంది ప్లాట్ ఓనర్స్‌ని ఏకం చేశారు. 27 ఎకరాల్లో 9 ఎకరాల 6 గుంటల భూమిని రికార్డుల్లోకి ఎక్కించాలని అనుకోగా, జాయింట్ కలెక్టర్ లెక్క చేయడం లేదని 2020లో స్పెషల్ ట్రైబ్యునల్‌కి వెళ్లారు సయ్యద్ హమ్మద్. ఆ పిటిషన్‌ను కోట్టివేయడంతో రిట్ పిటిషన్ (నెం. 27993/2022) దాఖలు చేశారు. దీనిపై 2005లో ఆర్డర్‌ని పాటించాలని తీర్పు వచ్చింది. అప్పటికే రెండు పాత సర్వే నెంబర్స్ ఓనర్స్ డిఫరెంట్‌గా రాటిఫికేషన్ పెట్టుకుని ప్రభుత్వ భూమి తమదే అని ఫైట్ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా గత ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నాయి. ప్రభుత్వ భూమి అంటూ 2003లో గెజిట్ విడుదల చేయగా నిషేదిత జాబితాలో చేర్చారు. కానీ, బీఆర్ఎస్ హయాంలో కబ్జా కథంతా సైలెంట్‌గా సాఫీగా సాగింది.

సెటిల్‌మెంట్స్ కోసం 60 కోట్లు.. 6 లక్షల స్క్వేర్ మీటర్ల భవనం

2023 జనవరి 23న సర్వే నెంబర్ 27/2 ని డీ నోటిఫై (నెం.2970/2022) చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కలెక్టర్ అమోయ్ కుమార్ రూ.60 కోట్లు తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. నిజానికి ఈ నెంబర్‌పై గతంలో 2 ఎకరాలు మాత్రమే ఉండేది. దీన్ని 27.18 గుంటలుగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చుట్టూ ఆ భూమికి గ్రీన్ షీల్డ్ కోట్టి తమదే అంటూ వంశీరాం సుబ్బారెడ్డి పాగా వేశారు. ఆనాటి ఆర్ఐ కూల్చివేతలు చేసి మళ్లీ ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పెట్టారు. ఆ ఆదేశాలను పాటిస్తూ సీసీఎల్ఏ సూమోటోగా కేసు నమోదు చేసింది. నిషేధిత జాబితా నుంచి తొలగించవద్దని, నిర్మాణాలు చేపట్టరాదని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీతో పాటు క్రయవిక్రయాలు జరగరాదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌కు 2023 ఆగస్ట్ 5న లేఖలు (ప్రొసీడింగ్ నెం. ఎస్ఈటీటీ 2/211/2023) రాసింది. దీంతో పొరంబోకు భూమి అని చెప్పడానికి సీసీఎల్ఏ రిపోర్టు సరిపోతుంది. సోహినీ బిల్డర్స్ అయిన వంశీరాం సుబ్బారెడ్డి, కేటీఆర్ బినామీ టీంలు కలిసి సెటిల్మెంట్స్‌కి 6 లక్షల స్క్వేర్ మీటర్లు ఇచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. దీంతో మొదటి నుంచి పెట్టుబడులు పెట్టుకుంటూ వస్తున్న కోహినూర్ అర్చియర్స్ దామర్ల రాఘవరావుతో పాటు కొండూరు రవీందర్ రావు, సెక్రెటరీ భరతేంద్ర రెడ్డి బేవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ అని పెట్టుకున్నారు. కేటీఆర్ టీమ్‌కు 30 శాతం ఇవ్వాలంటూ అగ్రిమెంట్స్ చేసుకున్నారు. ప్లాట్ ఓనర్స్‌కి 70 శాతం ఇచ్చేలా ప్లాన్ వేశారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లో 8.4 శాతం. రెసిడెన్షియల్‌లో 10.2శాతం. ప్లాట్ ఓనర్స్‌కి 19.6 శాతం, కమర్షియల్ 23.8 శాతం, ఇలా మొత్తం 34 శాతం రెసిడెన్షియల్, 28 శాతం కమర్షియల్‌కి ఒప్పుకున్నారు. అంటే కమర్షియల్‌లో బిల్డర్ సుబ్బారెడ్డికి 72 శాతం, రెసిడెన్షియల్‌లో 66 శాతంగా అగ్రిమెంట్స్ చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపివేశారు. దీనికి రిట్ పిటిషన్ 2088/2020ని కోర్టులో ఆర్డర్స్ ఉన్నాయి. ఎలాంటి గొడవలు లేవని అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ హైకోర్టుకు తెలిపారు. దీంతో జస్టిస్ రాజశేఖర్ రెడ్డి కలెక్టర్‌కి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే అమోయ్ కుమార్ గతంలో హఫీజ్ పేట్ ల్యాండ్స్‌పై కోర్టులో వచ్చిన తీర్పులను చెప్పుకుంటూ ఆర్డర్స్ ఇచ్చారు. ఇలాంటి భూములపై ప్రభుత్వాలు సుప్రీంకోర్టు వరకు ఫైట్ చేశాయి. కానీ, ఈ భూమి విషయంలో మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం తలొగ్గింది. జీహెచ్ఎంసీ లే అవుట్స్‌ని రద్దు చేసింది. 27 ఎకరాల భూమికి సంబంధించిన జీపీఏ రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారులతో తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్నారు.

Also Read: MSME Policy 2024: కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్

రద్దు చేసి పునరుద్ధరించిన అధికారులు 

పొరంబోకు భూమి అని చెప్పిన అధికారులు మళ్లీ రూట్ మార్చుకుంది. అనుమతులు ఇచ్చారు. దీంతో ఏం జరిగిందో అంటూ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. కోర్టుల నుంచి ఏదో ఒక ఆర్డర్ తీసుకొచ్చేస్తే ప్రభుత్వ భూమి అంతా ప్రైవేట్ పరం అవుతుంది. జీహెచ్ఎంసీకి అప్లై చేసుకుని 46 అంతస్తులకు అనుమతులు తీసుకున్నారు. దర్జాగా 20 ఎకరాల్లో కోటి స్క్వేర్ ఫీట్స్ నిర్మించేందుకు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వీటన్నింటి అనుమతులకు పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని వినికిడి.

Related News

Rapaka Varaprasad: రాపాక దారెటు.. కూటమిలోకి ఎంట్రీ ఇస్తారా ? కలవరమే మిగులుతుందా?

Baba Siddique Murder: బిష్ణోయ్ కులదైవానికి సల్మాన్ బలి..

What is the THAAD: థాడ్ అంటే ఏంటి? ఇది వాడితే ఏ దేశమైనా నాశనమేనా?

JC Prabhakar Reddy: వాటా ఇవ్వాల్సిందే.. దుమారం రేపుతున్న జేసీ మాటలు..

Harish Rao: నెంబర్ 2 నేనే..!

Vijayasai Reddy EVM: ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి విజయ్‌సాయిరెడ్డి ట్వీట్.. 2019లో టాంపరింగ్ సాధ్యం కాదని చెప్పిన జగన్!

CID Takes TDP Attack Case: సిఐడీ చేతికి టీడీపీ ఆఫీసుపై దాడుల కేసులు.. విచారణ వేగవంతం

Big Stories

×