Game Changer: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని పాట పాడేసుకుంటున్నారు రామ్ చరణ్ అభిమానులు. మరి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్ళుగా చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మేకర్స్ ఇచ్చే అప్డేట్స్ కన్నా లీక్స్ లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అభిమానులు. అంతలా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి లీక్స్ వచ్చాయి. అంతెందుకు.. జరగండి సాంగ్ కూడా ముందు ఆడియో లీక్ అయ్యాకే.. రిలీజ్ చేశారు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది తెలియక ఫ్యాన్స్ అందరు తలలో కొట్టుకుంటున్నారు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా.. ఇంకా ఇప్పటివరకు రిలీజ్ అయ్యింది లేదు. పోనీ.. అప్పుడప్పుడు అప్డేట్స్ అయినా ఇస్తున్నారా.. ? అంటే అది లేదు. దీంతో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.. దిల్ రాజుపై విరుచుకుపడ్డారు. అసభ్యపదాలతో ట్రెండ్ చేయడంతో మేకర్స్ దెబ్బకు దిగివచ్చారు. వినాయక చవితికి ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. సెకండ్ సింగిల్ ఈ నెలలోనే ఉంటుంది అని తెలిపారు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశారు.
ముందు నుంచి అనుకుంటున్నట్లే క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 20 న గేమ్ ఛేంజర్ అరిలిజ్ అవుతుందని మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ పండగ చేయడం మొదలుపెట్టారు. అయితే.. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సరి క్రిస్టమస్ పోటీ ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకు కారణం.. అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాలు రెండు వారాల వ్యవధిలో రావడమే.
పర్పుల్ చీరతో రెచ్చగొడుతున్న శృతి హాసన్.. ఈ ఫోటోషూట్ చాలా హాట్ గురూ!
ఇప్పటికే బన్నీ నటించిన పుష్ప 2 .. డిసెంబర్ 6 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాపై హైప్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకు గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుంది. ఇప్పటివరకు బన్నీకి పోటీగా చరణ్ రాడు అనుకున్నారు. కానీ,అనుకున్నట్లే చరణ్ కూడా రంగంలోకి దిగుతున్నాడు. మరి ఈ వార్ లో ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడతారో చూడాలి.
From next week it will be an unstoppable Events for
and releases for #GAMECHANGER till DEC 20 th 2024 ❤️🧨✨Get ready guys !!
— thaman S (@MusicThaman) September 18, 2024