Chevireddy Bhaskar Reddy: తుడా లో గత ఐదు సంవత్సరాలలో జరిగిన పాలన తీరు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అంటున్నారు. మంచి అదాయ వనరులతో సమృద్దిగా ఉన్న తుడాను అప్పులు పాలు చేశారు. అస్తులు అమ్మివేశారు.. అయితే అభివృద్ది చేశారా అంటే అది లేదు. సొంత ప్రాపకంకోసం పాకులాడారు. రహాదారులకు తమ పేర్లతో బోర్డులు, బెంచీలు, ధ్యాన మందిరాల పేరుతో నిధులు దుర్వినియోగం చేసారనే ఆరోపణలు వెల్లవెత్తాయి.
దానిపై ఫిర్యాదులు మీద ఫిర్యాదులు రావడంతో ఎట్టకేలకు రాష్ట ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు అదేశించింది. వైసీపీ తుడా చైర్మన్‌లుగా చెవిరెడ్డి అయన కుమారుడు పనిచేశారు .. ఇప్పుడు విజిలెన్స్ విచారణతో వారి కంటే వారు చెప్పినట్లు ఆడిన అధికార యంత్రాంగం తెగ టెన్షన్ పడిపోతుందంట.
బోరుబావిలో నీరు తోడినట్లు తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ నిధులను సొంత ప్రయోజనాల కోసం 2019-24 మధ్య అప్పటి తుడా పాలక మండలి వాడేసింది. వైసీపీ అధికారంలోకి రాకముందు తుడాకు నిధుల నిల్వలున్నాయి. అలా డిపాజిట్లు ఉన్న తుడా ఇప్పడు ఓవర్ డ్రాఫ్ట్ స్టేజ్‌కు పోయింది. తుడా చైర్మన్లుగా పనిచేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయన కూమారుడు మోహిత్ రెడ్డిలు కోటాను కోట్ల రూపాయలు అడ్డగోలుగా వాడేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి చెవిరెడ్డి అక్రమ దందాలపై కూటమి నేతలు ఫిర్యాదుల మోత మోగించారు. ఆ క్రమంలో 19అంశాలపై 25లోగా మొత్తం వివరాలతో ఉన్న రికార్డులను తమకు అప్పగించాల్సిందిగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు తుడాకు నోటీసులు జారీ చేసారు.. దాంతో తుడా అధికారులు రికార్డులు తయారు చేసే పనిలో పడ్డారు
2019 లో తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి భాద్యతలు స్వీకరించిన సమయంలో గీరిషా ఐఎఎస్ తుడా వైఎస్ చైర్మన్ గా ఉన్నారు. అయితే అయన తనకు సహాకరించడం లేదని హారికృష్ణ అనే అధికారిని తుడా వీసీగా తెచ్చుకున్నారు. అదే సమయంలో చెవిరెడ్డికి ఎస్‌డిగా అర్‌డిఓ కిరణ్ కూమార్, తుడా సెక్రటరీగా లక్ష్మి ఉన్నారు.. వారి సహాకారంతో తుడాలో అడ్డుఅదుపు లేకుండా దోపిడి వ్యవహారం నడిచింది. తుడా భూములను అడ్డగోలుగా అమ్మేశారు.
600 కోట్లకు పైగా వచ్చిన ఆదాయంతో చంద్రగిరి నియోజకవర్గంలోని తన స్వగ్రామంలో పబ్లిసిటి పెంచుకునే విధంగా చెవిరెడ్డి వ్యవహారం నడిపించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో తుడా ఇంజనీరింగ్ విభాగం అధ్వర్యంలో 105 కోట్ల విలువైన 417 పనులు చేసినట్లు రికార్డులు నమోదు అయ్యాయి. తిరుపతి , సత్యవేడు ,నగరి, శ్రీకాళహస్తి, పుత్తూరు లలో 25 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు
చేసిన అభివృద్ది పనులను చూస్తే హస్యాస్పందంగా ఉన్నాయనిపిస్తుంది. ధ్యాన మందిరాలు, పార్కుల ఆధునీకరణ, బెంచీలు, రహాదారులకు వైఎస్,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరులో బోర్డులు తప్ప అభివృద్ది పనులు ఎక్కడ కనిపించడం లేదు.. అయితే చెవిరెడ్డి పర్సనల్‌గా తీసుకున్న ప్రాజెక్టు తుమ్ముల గుంట చెరువును పూడ్చి అందులో అధునాతనమైన వాకింగ్ ట్రాక్‌తో పాటు చెట్లు పెంచడంలాంటి ప్రకియకు ఏకంగా 70 కోట్లు ఖర్చు చేశారు.
దానిపై గ్రీన్ ట్రిబున్యల్ నుంచి అభ్యంతరాలు ఉన్నప్పటికి ఏమాత్రం పట్టించుకోకుండా ఖర్చు చేసారు. దానికి తోడు పార్క్ నిర్వహాణకు ఏకంగా 20 కోట్లు తుడా నిధులను పిక్సెడ్ డిపాజిట్ చేసారు. అయితే ఆ పార్క్ ఎవరికి అందుబాటులో ఉందో, ఎవరి సౌకర్యం కోసం చెరువును పూడ్చి మరీ ఏర్పాటు చేశారో అంతుపట్టదు .. ఆ పార్కులో మొక్కల కోసం 6కోట్లు రూపాయలు ఖర్చు పెట్టారంట. తుడాకు మెజార్టీ అదాయం వచ్చే ప్రాంతాలలో ఏమాత్రం అభివృద్ది చేయకుండా, కేవలం పెత్తందారీ లాగా తన పేరు చెవిరెడ్డి కోసం ఈవిధంగా దందా చేసారనే అరోపణలున్నాయి.
Also Read: మారండయ్య బాబు… లేకపోతే మారిపోతారు, ఆ ‘8’కి గండం
గత ఐదు సంవత్సరాలలో చంద్రగిరి నియోజకవర్గంలో ఏకంగా తుడా నిధులతో 8,165 బల్లలను ఏర్పాటు చేసారు. ప్రభుత్వ స్థలాలు, బస్టాండుల్లోనే కాకుండా ప్రయివేటు వ్యక్తుల హోటల్స్‌లో కూడా వీటిని ఏర్పాటు చేసారు. ఒక్కో బెంచీకి 7,900 ఖర్చు చేసినట్లు రికార్డులలో నమోదు అయ్యింది. సమావేశ మందిరాలు, ద్యాన మందిరాలు, రిసెప్షన్ కౌంటర్లు, గ్రంధాలయాల నిర్మాణానికి ఏకంగా 240 కోట్లు ఖర్చు పెట్టినట్లు పేర్కొన్నారు. వాటికి టెండర్లు పిలిస్తే మొత్తం అన్ని పనులు చెవిరెడ్డికి చెందిన కాంట్రాక్ట్ సంస్థకే దక్కడం గమనార్హం.
ఏడు మండలాలలోని ఎంపిడివోలకు సైతం తుడా నిధులు మంజూరు చేసారు. వారు కూడా ఆ నిధులతో నామినేషన్ పద్దతినా వైసిపి సానుభూతి పరులకు పనులు అప్పగించారు..15.5లక్షల మొక్కలను తుడా పరిధిలో పంపిణీ చేసినట్లు వాటి కోసం 7.15 కోట్లు ఖర్చు పెట్టినట్లు రికార్డుల్లో చూపించారు. తుమ్మలగుంట చెరువు పార్కులో మొక్కలు నాటడానికి 6కోట్లు, తిరుపతి, నగరి, వడమాలపేటాలాంటి చోట్ల పార్కులలో మొక్కల కోసం 2కోట్లు ఖర్చు పెట్టారంట. పార్కుల అభివృద్ది పనుల కోసం ఏకంగా 14కోట్లుకు పైగా ఖర్చు పెట్టినట్లు చూపించారు
తుడా లో పాలన పరమైన వ్యవహారాల కోసం 70 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. పోరుగు సేవల కింద ఉన్న 30 మందికి తోడు మరో 35మందిని తీసుకున్నారు. వారంతా వైసిపి సర్వే టీమ్లలో పనిచేయడంతో పాటు ఓటర్ల జాబితా సవరణలో పాల్గొన్నట్లు అరోపణలున్నాయి. సాక్షాత్తు తుడా విసిగా పనిచేసిన హారికృష్ణ కీలక పాత్ర వహించాడని ఫిర్యాదులున్నాయి. దానిపై సిఐడి సైతం విచారణ జరుపుతుంది. పెద్ద ఎత్తున వాహనాలు, ల్యాప్ టాప్స్, ట్యాబ్ లతో పాటు ఫర్నీచర్ కొనుగొలు చేసారు. వాటిని వైకాపా సర్వే కార్యాలయానికి వాడినట్లు అరోపణలున్నాయి. ప్రస్తుతం ల్యాప్ ట్యాప్స్, ట్యాబులు కనిపించడం లేదంట..ఎన్నికల కౌంటింగ్ తర్వాత వీటని మాయం చేసారంటున్నారు.
ఇప్పుడు సదరు అక్రమాలపై విజిలెన్స్ విచారణ మొదల్వడంతో 2019- 24 మధ్య పనిచేసిన అధికారులు భయాందోళనలో ఉన్నారంట..ఏక్కడ తమ మొడకు అవి చుట్టుకుంటాయోనని టెన్షన్ పడుతున్నారం. తుడా పాలక మండలి తీర్మానం మేరకు పనులను నిబంధనలకు విరుద్దంగా ఎంపిడివోలకు అప్పగించడం.. వారు నామినేటేడ్ పద్దతిలో వైసీపీ కార్యకర్తలకు కేటాయించడం వెనుక పెద్ద దందానే నడిచిందంటున్నారు. ఇక తుడాకు చెందిన వందల ఏకరాల భూములు మాయం కాగా, వందలకోట్లు రూపాయలు పనులు జరిగాయో లేదో తెలియదో తెలియకుండా రికార్డులకెక్కాయి. ఆ క్రమంలో విజిలెన్స్ విచారణతో తాము బలవుతామని అధికారులు భయపడుతున్నారు. మొత్తం మీద చెవిరెడ్డి తండ్రీ కొడుకులు కలసి తుడాను ఎంత గుల్ల చేశారో విజిలెన్స్ భయటపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది