CM Revanth Reddy Weekly Diary: ఈ వారం అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం, ఏడాది ప్రగతి నివేదన, అభివృద్ధి పనుల పరిశీలన వంటి వాటిపై ప్రజా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. చెప్పిన టైం ప్రకారం ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టారు. గ్రూప్ 2 పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించారు. టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణంపై వేగం పెంచారు.
(15-12-2024 ఆదివారం) ( 2025లో కొత్త నోటిఫికేషన్లు )
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీరియస్ గా ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా గ్రూప్ 2 పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం అనుకున్న పరీక్షలను అనుకున్న టైంలో నిర్వహిస్తోంది. పరీక్షల వాయిదా డిమాండ్లను పూర్తిగా పక్కన పెట్టి నిరుద్యోగులకు ఉపశమనం కల్పిస్తోంది. ఈ చర్యలతో జాబ్ వచ్చిన వారు చేరుతుండగా రాని వారు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకుంటున్నారు. దీంతో వారి కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తోంది. తాజాగా డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ ను కండక్ట్ చేసింది టీజీపీఎస్సీ.
783 పోస్టుల కోసం 5,51,847 మంది అప్లై చేసుకున్నారు. వారికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణకు 49,843 మంది సిబ్బందిని నియమించారు. మార్చి నెలాఖరులో గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు రిలీజ్ చేయనున్నారు. టీజీపీఎస్సీపై ఎలాంటి అపోహలు వద్దని, మెరిట్ ఉన్నోళ్లకే ఉద్యోగం వస్తుందని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టడం, బయోమెట్రిక్ తప్పని సరి చేయడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని న్యాయపరమైన చిక్కులు రాకుండా చూస్తున్నారు. ఇక జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త నోటిఫికేషన్లపై జనవరి నాటికి స్పష్టత ఇస్తామని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
(17-12-2024 మంగళవారం) ( మహిళాశక్తి మార్క్ )
రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఉచిత చీరల రంగు, డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంపిక చేశారు. ఈ చీరలు లేత నీలం రంగులో ముదురు నీలం రంగు అంచుతో ఉన్నాయి. అంచు కింది భాగంలో మూడు రంగులతో కూడిన ఇందిరా మహిళాశక్తి డిజైన్ ఉండనుంది. రాష్ట్రంలోని 63 లక్షల మంది స్వయం సహాయక సభ్యులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ – సెర్ప్ ద్వారా ఏటా రెండేసి చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అలాగే స్వయంసహాయక సంఘాలలో 60 ఏళ్లు దాటిన సభ్యురాళ్ల సౌకర్యం కోసం పాలీకాటన్ చీరలు ఉచితంగా పంపిణీ చేయనుంది. వీటన్నిటి ఆర్డర్ ను రాష్ట్ర చేనేత సహకార సంఘానికి ఇచ్చింది ప్రభుత్వం. సాధ్యమైనంత త్వరగా తయారు చేయించి పంపిణీ చేయాలన్నారు. సో అటు చేనేతలకూ ఉపాధి కల్పించారు.
17-12-2024 మంగళవారం ( త్వరలో కొత్త హాస్పిటల్స్ )
ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో నిర్మిస్తున్న సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్ ను వచ్చే ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం నిర్మాణంలో వేగం పెంచుతోంది. ప్రజలకు దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. సిటీ నలుమూలలా నిర్మితం కానున్న హాస్పిటల్స్ కోసం 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పనులు స్పీడప్ చేయిస్తోంది ప్రభుత్వం.
అల్వాల్, ఎల్‌బీనగర్ టిమ్స్ ఆసుపత్రులకు ఎన్‌ఓసీలు ఇప్పటికే తీసుకొచ్చారు. హాస్పిటల్ ఆవరణలో ధర్మశాల, 5కే భోజన సదుపాయం, ప్రార్థనా మందిరాల నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు. అటు నిమ్స్ ఆస్పత్రిలో 2020 వరకు బెడ్స్ పెంచబోతున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ నాటికి అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ ను అందుబాటులోకి తేవడం, అలాగే ఎల్‌బీనగర్ టిమ్స్ నిర్మాణంలో వేగం పెంచేలా కార్యాచరణ రెడీ చేసింది ప్రభుత్వం.
జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ఆర్టీసీలోనూ ఉద్యోగాల భర్తీ చేపట్టబోతోంది. నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ప్రయాణికుల సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు ముమ్మరం చేశామని, అందుకోసమే ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా 3,039 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి చేసిన ప్రకటనతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు నింపింది.
(18-12-2024 బుధవారం) ( సంక్రాంతికి రేషన్ కార్డులు )
సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డుల జారీపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు ఉత్తమ్. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు. సంక్రాంతి పండుగ నుంచి రేషన్ కార్డుల మంజూరు మొదలవుతుందన్నారు ఉత్తమ్. ఇప్పటికే ఈ విషయంపై క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అన్న విషయాలపై క్లారిటీ రాగానే ప్రక్రియ మొదలు కానుంది. అయితే సాధ్యమైనంత ఎక్కువ మందికి రేషన్ కార్డులు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిసింది. టోటల్ గా 36 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డ్స్ ఇస్తారంటున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్నబియ్యాన్ని కూడా అర్హులకు అందిస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.
(18-12-2024 బుధవారం) ( ఐటీ కోసం కొత్త డీల్ )
ఐటీ రంగాన్ని తెలంగాణలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమెరికాలోని ఐటీ కంపెనీల అతి పెద్ద అసోసియేషన్ అయిన ఐటీ సర్వ్ అలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈనెల 18న సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఎంఓయూపై అధికారులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా 30 వేల టెక్ ఉద్యోగాలను కల్పించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు.
ఇందులో భాగంగా స్కిల్స్ పెంచడానికి స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్ కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టనున్నారు. తొలిదశలో మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లో ఐటీ కార్యకలాపాలను విస్తరించడంపై ఫోకస్ పెడుతారు. ఇందుకోసం కంపెనీలకు ఐటీ సర్వ్ ఎలయన్స్ అవగాహన కల్పిస్తుంది. నైపుణ్యాలు పెంచడం ద్వారా వారందరికీ స్ధానికంగా ఉద్యోగావకాశాలు కలుగుతాయని, దీనివల్ల హైదరాబాద్‌కు వలసలు తగ్గి నగరంపై భారం తగ్గుతుందన్న అంచనాతో ప్రభుత్వం ఉంది.
(18-12-2024 బుధవారం) ( టెట్ షెడ్యూల్ రిలీజ్ )
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష – టెట్ షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ను ఈనెల 18న విడుదల చేశారు. 2025 జనవరి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం.. రెండు సెషన్లుగా 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈసారి టెట్ పేపర్-1, పేపర్-2లకు కలిపి సుమారు 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష ముగియగానే డీఎస్సీకి రూట్ క్లియర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
(19-12-2024 గురువారం) ( వేగంగా ప్రాజెక్టులు )
గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన చిన్న మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగాగానే తాజాగా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణకు 37 కోట్లు విడుదల చేసింది. ఈ వారంలో మరో 22 కోట్లు విడుదల చేయనుంది. మిగితా ప్రాజెక్టులనూ పద్ధతి ప్రకారం పూర్తి చేయనున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు యుద్ధ ప్రాతిపదికన రెండేళ్లలో పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు.
(19-12-2024 గురువారం) ( ఆటోమొబైల్ హబ్ )
హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో విప్‌మంత్రా ఆధ్వర్యంలో జరిగిన ఆటోమోటివ్ ఫెస్ట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 19న పాల్గొన్నారు. ఆటోమొబైల్ రంగంలో తెలంగాణ మేజర్ హబ్‌గా మారుతున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా ఈ ఆటోమేటివ్ ఫెస్ట్ నిర్వహించారు. ఇందులో కార్లు, బైక్ రేసర్ల విన్యాసాలను సీఎం చూశారు. నిర్వాహకులను అభినందించారు.
(19-12-2024 గురువారం) ( చారిత్రక నిజాలు )
ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఏర్పాటు చేసిన 37వ పుస్తక ప్రదర్శనను సీఎం రేవంత్ ఈనెల 19న ప్రారంభించారు. గత పదేళ్లుగా మన కళ్ల ముందున్న చరిత్రలో వాస్తవాలు, అవాస్తవాలు గమనించి కవులు, కళాకారులు తమ కలాలను పదును పెట్టాలని ఆ సందర్భంగా సీఎం సూచించారు. సమాజం సాంకేతిక పరిజ్ఞానం వైపు వెళుతున్న టైంలో డిజిటల్, సోషల్ మీడియాల వంటి మాధ్యమాల వల్ల ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో గ్రహించే పరిస్థితులు లేకుండా పోతున్నాయని, అందుకే యువతను పుస్తక పఠనంవైపు మళ్లిస్తే వాస్తవాలు తెలుసుకునే వీలుంటుందన్నారు.
(19-12-2024 గురువారం) ( నిజాల వేట )
తెలంగాణకు మణిహారంగా ఉన్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేటు సంస్థకు అప్పగించిన టెండర్ ప్రక్రియలో సరైన విధి విధానాలను పాటించకుండా గత ప్రభుత్వంలో కొందరికి ఆయాచిత లబ్దిచేకూర్చారన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం SIT ద్వారా విచారణ జరిపించనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ సభలో ప్రకటించారు. హరీష్ రావు కోరిన ప్రకారమే సిట్ దర్యాప్తు చేస్తున్నామన్నారు.
(19-12-2024 గురువారం) ( కీలక బిల్లులకు ఆమోదం )
అసెంబ్లీలో ఈవారం కీలక బిల్లులను ప్రవేశపెట్టింది రేవంత్ ప్రభుత్వం. తెలంగాణ పురపాలక సంఘాల సవరణ, GHMC సవరణ బిల్లు, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుల్ని తీసుకొచ్చారు. పురపాలికల్లో గ్రామ పంచాయతీల విలీనానికి సంబంధించి పురపాలక సంఘాల సవరణ బిల్లును, అలాగే హైడ్రాకు అధికారాలను బదలాయిస్తూ హెచ్‌ఎండీఏ బిల్లును తెచ్చారు. హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పరిధిలో ఉన్న 51 గ్రామ పంచాయతీలు సమీప మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనానికి లైన్ క్లియర్ చేశారు.
(19-12-2024 గురువారం) ( స్థానిక పోటీకి పాత రూల్స్ )
ఇద్దరు పిల్లలకు మించి ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధన తెలంగాణలో కొనసాగనుంది. ఈ నిబంధనను మార్చాలని వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర క్యాబినెట్ తిరస్కరించింది. పాత నిబంధననే కొనసాగించాలని పంచాయతీరాజ్‌ను ఆదేశించింది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఉమ్మడి రాష్ట్రంలో.. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పురపాలక, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని చట్టం చేశారు.
VO: (20-12-2024 శుక్రవారం) ( భూ భారతికి హారతి )
తెలంగాణ భూ భారతి బిల్లు–2024కు రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈనెల 18న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై శుక్రవారం సభలో చర్చ జరిగిన అనంతరం బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. ఈ బిల్లుపై చర్చలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ పాలు పంచుకోలేదు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ధరణితో ఎంత నష్టం జరిగిందన్న విషయాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. రహస్యంగా ఉండాల్సిన తెలంగాణలోని రైతులకు సంబంధించిన భూ రికార్డులతో పాటు సమస్త సమాచారం దేశం దాటించేశారని ఫైర్ అయ్యారు. ప్రతి భూ యజమాని హక్కులను కాపాడటానికి చట్టాన్ని సమర్థవంతంగా సభలో ప్రవేశపెట్టామన్నారు.
(20-12-2024 శుక్రవారం) ( ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ )
డేటా అంతా పోర్టల్ నిర్వహిస్తున్న వ్యక్తి కూడా తెలుసుకోలేనంత రహస్యంగా ఎన్‌క్రిప్ట్ అయి ఉండాలని, కానీ ధరణి పోర్టల్ కారణంగా రెవెన్యూకు సంబంధించిన సమస్త సమాచారం దేశ సరిహద్దులు దాటి ఇతర దేశాల్లో అందులోనూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాల్లో ఉన్న వారి చేతుల్లోకి వెళ్లిందన్నారు సీఎం. ఇది తీవ్రమైన నేరమన్నారు. అంతే కాదు ధరణిలో భూమాయాజాలంపై ఫోరెన్సిక్ ఆడిట్ కు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేలిపోనున్నాయి. ప్రభుత్వ భూములకు భద్రత లభించబోతోంది.
(20-12-2024 శుక్రవారం) ( టూరిజం బూస్టప్ )
తెలంగాణ పర్యాటక ప్రాంతాల ప్రాధాన్యం ప్రపంచ దేశాలకు విస్తరించేలా చేసేలా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది. ఇప్పటికే చాలా టూరిజం సర్క్యూట్స్ ను డెవలప్ చేసింది. తాజాగా పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సమాచార కేంద్రాన్ని మంత్రి జూపల్లి ఈనెల 20న ఎయిర్‌పోర్ట్ సీఈవో ప్రదీప్ ఫణికర్‌తో కలిసి ప్రారంభించారు. విమానాశ్రయంలో టూరిస్టులను అట్రాక్ట్ చేసేందుకు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు ల్యాండ్ అవగానే చూసేలా తెరపై వారసత్వ కట్టడాలు, టూరిస్ట్ స్పాట్లు, హరిత హోటల్స్, టూర్ ప్యాకేజీలు, రిజర్వేషన్, రూట్‌మ్యాప్ వివరాలు చూసేలా ఏర్పాటు చేశారు.
(21-12-2024 శనివారం ) ( సంక్రాంతి తర్వాత రైతు భరోసా )
శనివారం రోజు అసెంబ్లీలో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ జరిగిన సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు గుడ్ న్యూస్ అందించారు. రైతు భరోసా కింద ఎకరానికి 7500 రూపాయలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతికి మార్గదర్శకాలు ఫైనల్ చేసి ఇస్తామని ప్రకటించారు. నిజానికి గత ప్రభుత్వ హయాంలో కొండలు గుట్టలు, రాళ్లు రప్పలు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతుబంధు అందింది. దీన్ని సవరించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది రేవంత్ ప్రభుత్వం. పంటలు పండించే రైతులకే ఎలా బెనిఫిట్ కలగాలన్నది చూస్తున్నారు.