BigTV English

AP Cabinet Expansion: మారండయ్య బాబు… లేకపోతే మారిపోతారు, ఆ ‘8’కి గండం

AP Cabinet Expansion: మారండయ్య బాబు… లేకపోతే మారిపోతారు, ఆ ‘8’కి గండం

కార్యకర్తలైనా, నాయకులైనా.. ఎమ్మెల్యేలు అయినా, మంత్రులైనా.. ఆల్ ఆర్ ఈక్వల్ అంటున్నారు సీఎం చంద్రబాబు. పాలన వ్యవహారంలో అందరూ ఒకటే అంటున్న ముఖ్యమంత్రికి.. మంత్రులు షాక్ ఇస్తున్నారా? ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలైనా.. చాలా మంది మంత్రులు వారి శాఖల పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారా ? ఇంచార్జ్ మంత్రిగా ఉన్న జిల్లా మొహం కూడా చూడటానికి పలువురు మంత్రులు ఇష్టపడడం లేదా ? తీరు మార్చుకోకపోతే యాక్షన్ తప్పదని చంద్రబాబు హెచ్చరించారా ? కూటమి ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుంది.


అధికారంలో ఉంటే ఒక రకం… ప్రతిపక్షంలో ఉంటే మరో రకం … ఇదీ గతంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఉన్న టాక్. అధికారంలో ఉన్నప్పుడు ఆయన దృష్టంతా పాలనపైనే ఉండేది.. రెండు సార్లు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవహరించినప్పుడు అభివృద్దిని పరుగులు పెట్టించి హైటెక్ సీఎం అనిపించుకున్నారు. 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు… రాజధానిలేని ఏపీ అభివృద్ది కోసం కృషి చేశారు. కానీ నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వ్యవహారతీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలతో.. గతానికి భిన్నంగా ఉంటూ.. సొంత పార్టీ నేతలకు సైతం కొత్త వెర్షన్ ని పరిచయం చేస్తున్నారు.

సీఎం చంద్రబాబు సారధ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడుస్తోంది. ఎక్కడా తగ్గేదే లే అంటున్న చంద్రబాబుకు.. సొంత నేతలే బ్రేక్ వేస్తున్నారని జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రుల పనీతీరుపై సీఎం అసహనం వ్యక్తం చేస్తున్నారట. జనసేనాని పవన్‌కల్యాణ్ తో పాటు మరో 23 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. రీసెంట్ గానే ఏపీ కేబినెట్ లోకి పవన్ సోదరుడు, జనసేన నేత నాగబాబును కూడా తీసుకోబోతున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఉన్న మంత్రుల్లోనే పలువురిపై సీఎం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.


ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. అమరావతి పనులతోపాటు.. పలు అంశాలపై చర్చించిన సీఎం చంద్రబాబు.. మంత్రుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 24 మంది కేబినెట్ మంత్రుల్లో 8 మంది మంత్రుల తీరుపై సీఎం సంతృప్తిగా ఉన్నారట. ఆరు నెలల నివేదిక ఇవ్వమని సీఎం కోరితే కేవలం పది మంది మాత్రమే సెల్ఫ్ నివేదిక ఇచ్చారని అంటున్నారు. నివేదికలు ఇచ్చిన వారిలో.. నిమ్మల రామానాయుడు, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారని అంటున్నారు. మిగిలిన మంత్రుల నిర్లక్ష్య ధోరణి సహించలేమని.. ప్రతి మంత్రి తన పనితీరుపై నివేదిక ఇవ్వాలని సీఎం ఘాటుగా హెచ్చరించారట.

మంత్రుల పనితీరును తాను ప్రతిరోజూ గమనిస్తూనే ఉన్నానని సీఎం వ్యాఖ్యానించారట. మంత్రుల దగ్గరకు వచ్చిన ప్రతి ఫైలును ఎంత వేగంగా క్లియర్ చేస్తున్నారు ? వారి శాఖల్లో దిగువ స్థాయి ఉద్యోగుల పనితీరును ఎలా సమన్వయం చేస్తున్నారు? అనే విషయాలపై కూడా పూర్తి సమాచారం తన దగ్గర ఉందని చెప్పారట. మంత్రులు మరింత వేగం పెంచాలని.. లేదంటే జరగబోయే నష్టాలేంటో కూడా మంత్రులకు క్లియర్ కట్‌గా వివరించారట సీఎం చంద్రబాబు.

అంతే కాకుండా మంత్రులు సచివాలయానికి లేదా క్యాంప్ కార్యాలయాలకు మాత్రమే పరిమితం కాకూడదని చంద్రబాబు సూచించారట. మంత్రులు ఇంచార్జ్ గా ఉన్న జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని సీఎం హితబోధ చేశారట. జిల్లాలో జరుగుతున్న ప్రధాన సంఘటనలపై వెంటనే స్పందించాలన్నారట. డీఆర్సీ సమావేశాలను సక్రమంగా నిర్వహించి.. నిర్ణయాల అమలు జరగేలా చూడాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని చంద్రబాబు స్పష్టం చేశారట.

ఇక ఇప్పటికే గతంలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో ఏకంగా ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు సీఎం. కష్టపడి సాధించుకున్న మంచిపేరు వారి కారణంగా దెబ్బతింటుందని చివాట్లు పెట్టారు. మీరు మార‌తార‌ని ఆశిస్తున్నా. మార‌క‌పోతే.. ఏం చేయాలో నాకు బాగా తెలుసని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఎమ్మెల్యేలను గైడ్ చేయాల్సిన బాధ్యత మంత్రులుకు అప్పగించారు చంద్రబాబు. ఇకపై ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా మంత్రులే సమాధానం చెప్పాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కానీ మంత్రులే ఇలా ఉంటే.. ఎమ్మెల్యేలు ఇంకేం పని చేస్తారని కామెంట్స్ వస్తున్నాయి.

Also Read: మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్.. తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లాంటి వారే పనితీరుపై నివేదిక సమర్పించడంలో అలసత్వం వహించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. మరి సీఎం ఆదేశాలతో అయినా.. మంత్రులు తీరు మార్చుకుంటారా ? అని చర్చ నడుస్తోంది.

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×