BigTV English

sameer rizvi fastest double century: ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ బ్యాటర్ సంచలన డబుల్ సెంచరీ

sameer rizvi fastest double century: ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ బ్యాటర్ సంచలన డబుల్ సెంచరీ

sameer rizvi fastest double century: ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెట్ లో విభిన్న టోర్నీలు జరుగుతున్నాయి. ఒకవైపు విజయ్ హజారే ట్రోఫీ ఉత్కంఠభరితంగా సాగుతుండగా.. మరోవైపు అండర్ – 29 స్టేట్ ఏ ట్రోఫీ జరుగుతుంది. ఈ ట్రోఫీలో అభిమానులకు ఎంతో ఉత్కంఠ మ్యాచ్ ని చూసే అవకాశం దక్కింది. అండర్ – 23 స్టేట్ ఏ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ కి చెందిన క్రికెటర్ సమీర్ రిజ్వి చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో ఉత్తరప్రదేశ్ టీమ్ కి సమీర్ రిజ్వి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.


Also Read: Gukesh – Rashmika: టాలీవుడ్ హీరోయిన్ కి గుకేశ్ కి ఉన్న రిలేషన్?

అయితే శనివారం రోజున ఉత్తర ప్రదేశ్ – త్రిపుర జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సమీర్ రిజ్వి డబుల్ సెంచరీ తో చరిత్ర సృష్టించాడు. అంతేకాదు అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన ఘనతను సాధించాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇందులో 21 ఏళ్ల సమీర్ రిజ్వి 97 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. అంతేకాదు డబుల్ సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు.


201 పరుగుల్లో 13 ఫోర్లు, 20 సిక్సర్లతో చెలరేగాడు. 207.22 స్ట్రైక్ రేట్ తో ఈ పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో సమీర్ దేశవాలి క్రికెట్ లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్ మెన్ గా రికార్డు నెలకొల్పాడు. ఈ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డ్ అంతర్జాతీయ లిస్ట్ – ఏ క్రికెట్ లో ప్రస్తుతం న్యూజిలాండ్ ఆటగాడు చాడ్ బోప్స్ పేరిట ఉంది. అతను 103 బాల్స్ లో ఈ ఘనతని సాధించాడు. ఈ మ్యాచ్ లో సమీర్ రిజ్వి 23వ ఓవర్ లో బ్యాటింగ్ కి దిగాడు. ఆ తరువాత తుఫాన్ ఇన్నింగ్స్ తో ఒంటరిగా మ్యాచ్ గతిని మార్చాడు.

దీంతో ఉత్తరప్రదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగుల భారీ స్కోర్ ని నమోదు చేసింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన ప్రత్యర్థి త్రిపుర జట్టు భారీ స్కోరును చేదించే క్రమంలో 253 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో ఉత్తరప్రదేశ్ జట్టు 152 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. భౌమిక్ ఒక్కడే 68 పరుగులతో త్రిపుర జట్టుని ఆదుకునే ప్రయత్నం ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఇక ఈ ట్రోఫీలో సమీర్ రిజ్వి అద్భుతంగా రాణిస్తున్నాడు.

Also Read: Wrestler Rey Mysterio: WWE లెజెండ్ రే మిస్టీరియో మృతి !

ఈ ఇన్నింగ్స్ లో అతడు ఇప్పటికే రెండు సెంచరీలు సాధించాడు. మొత్తం నాలుగు మ్యాచ్ లలో కలిపి 518 పరుగులు చేయడం ద్వారా అత్యధిక పరుగుల స్కోరర్ గా నిలిచాడు. ఇక ఈ ఆటగాన్ని గత సీజన్ ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ 8.4 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే మెగా వేయడానికి ముందు చెన్నై అతడిని విడుదల చేయడంతో ఈసారి జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కేవలం 95 లక్షలకి దక్కించుకుంది. ఈ సీజన్ లో సమీర్ తన ప్రదర్శనతో ఢిల్లీ జట్టుకి ముఖ్యమైన ఆటగాడిగా మారే అవకాశం ఉంది.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×