E-Paper
Advertisement

Vijaysai Reddy: శ్రీకాకుళం నుంచి.. విజయసాయి రెడ్డి పాలిటిక్స్ లోకి రీఎంట్రీ?

Vijaysai Reddy: శ్రీకాకుళం నుంచి..  విజయసాయి రెడ్డి  పాలిటిక్స్ లోకి రీఎంట్రీ?
Advertisement

Vijaysai Reddy: రాష్ట్ర రాజకీయాల్లో ఉత్తరాంధ్రలో రాజకీయ చైతన్యం ఉండే శ్రీకాకుళం జిల్లాది నిధి కీలక పాత్ర. అందుకే పదవులు కేటాయింపులోశ్రీకాకుళానికి పెద్దపీట వేస్తారు. రాజకీయ యాత్రలను కూడా చాలామంది అక్కడి నుంచే మొదలుపెడతారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా శ్రీకాకుళం నుంచి కొత్త రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెడుతున్నారా? అనే అనుమానాలు పెరుగుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గ సంక్షేమ భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన తరువాత ఆయన చేసిన కామెంట్స్ ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి.

జగన్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన సాయిరెడ్డి

వైసీపీలోనే కాకుండా జగన్ ఎదుగుదల లోను కీలక పాత్ర పోషించిన వ్యక్తి రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి. కేంద్రంలో వైసీపీకి ప్రతికూలమైన కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణల కేసులు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదు. దీనికి ప్రధాన కారణం విజయసాయిరెడ్డి చతురత అని అన్ని రాజకీయవర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటాయి. పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేసి వైసీపీలో నెంబర్ 2 గా పేరు తెచ్చుకున్న విజయసాయి రెడ్డికి వైసిపి అధికారంలో ఉన్న ఐదేళ్లు అనుకున్నంత ప్రాధాన్యత లభించలేదు. ఇది విమర్శకులు మాత్రమే చెబుతున్న మాట కాదు, తాను వైసీపీ నుంచి బయటకు వెళ్లి పోవడానికి జగన్ చుట్టూ ఉన్న కోటరీయే కారణమని స్వయంగా విజయ్ సాయి రెడ్డి చెప్పారు.

సిక్కులులో పొలికిటల్ కామెంట్స్ చేసిన మాజీ ఎంపీ

Advertisement

శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన విజయసాయిరెడ్డి రాజకీయాలు మాట్లాడనంటూనే.. బోలెడన్ని పొలిటికల్ కామెంట్స్ చేశారు. తన ఆవేదన కూడా వెళ్లగక్కారు. అయితే ఆయన ఈ విషయాన్ని అక్కడకు వదిలేలా కనిపించడం లేదు. శ్రీకాకుళం పర్యటనతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. ఒకప్పటి కాంగ్రెస్, ఇప్పటి వైసీపీకి మెజారిటీ రెడ్ల మద్దతు ఉంది. విజయ సాయి రెడ్డి కూడా ఆ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని జోరుగా చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే శ్రీకాకుళంలో నిర్మించబోయే రెడ్డి సామాజిక భవనం నిర్మాణానికి కావలసిన రెండున్నర కోట్ల రూపాయలు తానే ఇస్తానని ప్రకటించారు.

కొత్త పార్టీ పెట్టేందుకు వెనకాడని సాయిరెడ్డి

అటు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని కర్నూలు జిల్లాకు పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నారెడ్ల మద్దతును కూడగొట్టుకునేందుకే ఈ ప్రకటనలు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక రాజకీయాల్లోకి రాను వ్యవసాయం చేసుకుంటానన్న విజయ్ సాయి రెడ్డి రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగలేదని భావించినప్పుడు కొత్తగా పార్టీ పెట్టేందుకు కూడా వెనకాడనని అదే వేదికగా చెప్పారు. అంటే విజయసాయిరెడ్డి ఏదో భారీ స్కెచ్ వేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుందని వైసిపి వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. వైసీపీలో కూడా మెజారిటీ నేతల్లో విజయసాయి రెడ్డి పై సింపతి కనిపిస్తుంది. మొదటి నుంచి పార్టీ బలోపేతానికి జగన్ అభివృద్ధికి కృషి చేసిన విజయసాయిరెడ్డి పరిస్థితి ఇలా కావడం బాధాకరమని లోలోపల చర్చించుకుంటున్నారు.

శ్రీకాకుళంలో విజయసాయిరెడ్డి కామెంట్స్.. వైసీపీలో కలవరం

Advertisement

ఇవన్నీ విజయ్ సాయి రెడ్డికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. శ్రీకాకుళంలో విజయసాయిరెడ్డి అనౌన్స్మెంట్ విన్న చాలామంది.. ఆయన మిగిలిన జిల్లాల్లో కూడా రెడ్డి సామాజిక వర్గ భవన నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉందని కూడా చెప్పుకుంటున్నారు. రెడ్ల మద్దతు కూడగట్టి పార్టీ పెట్టి తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే రెడ్ల సహా వైసిపి లో మెజారిటీ నేతలు తనకు అనుకూలంగా ఉన్నారని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఏదేమైనా శ్రీకాకుళంలో విజయసాయిరెడ్డి కామెంట్స్ వైసీపీని కాస్త కలవరపెడుతున్నాయి.

Story By Apparao, Big Tv

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×