Telangana Politics: భారతీయ జనతా పార్టీలో ఇద్దరు కీలకనేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బిజేపి నేత బండిసంజయ్ హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే, మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ ల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా ఈ ఇద్దరూ నేతలు మీడియా ముందుకు వచ్చి ఒకరిపై ఒకరు అసంతృప్తిని వెళ్ళగక్కుతుండటం చర్చగా మారింది. మొన్నటి వరకు అంతర్గతంగా ఉన్న విభేధాలు ఇప్పుడు బహిర్గతమవ్వడంతో ఈ ఎపిసోడ్ ఏటు దారి తీస్తుందోనని కార్యకర్తలలో అందోళన వ్యక్తం అవుతోంది.
హుజురాబాద్‌ను బేస్ చేసుకుని ఈటల, బండి మాటల యుద్దం
తెలంగాణ బీజేపీ నేతల దృష్టి అంతా హుజరాబాద్ పై ఫోకస్ అవుతుంది. ఒకేసారి బండి సంజయ్. ఈటల రాజేందర్, హుజురాబాద్‌ను బేసె చేసుకుని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటు ఉండటంతో నేటి రాజకీయాలే కేంద్ర సర్కిల్స్ లో ఉత్కంట రేపుతున్నాయి. కేంద్ర శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైకిళ్ల పంపీణిలో భాగంగా హుజురాబాద్ కు వెళ్లారు అక్కడే గ్రూపు రాజకీయాల గురించి మాట్లాడారు ఏవరైన గ్రూపులను ప్రోత్సహిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ రాదని కరాకండిగా చేప్పారు.
హుజురాబాద్ బీజేపీ ఇన్చార్జ్‌గా ఈటల వర్గీయుడి రాజీనామా
సంజయ్ మాట్లాడిన కొన్ని గంటల్లోనే ఈటల వర్గీయుడి హుజురాబాద్ బీజేపీ గో కన్వినర్ గౌతమ్ రెడ్డి పార్టికి రాజీనామా చేశారు. తర్వాత మరో 24 గంటల్లో సమావేశం నిర్వహించుకోని పార్టీల వర్గీయుల శామీర్ పేటలోని ఈటల నివాసానికి తరలి వెళ్లారు. హుజురాబాద్ పరిణామాలు దృష్టిలో పెట్టుకోని బండి సంజయ్ పై ఈటలపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. 2002లో జిల్లాకు వచ్చారు. మంత్రిగా పనిచేశారు. అడుగుపెట్టని గ్రామం లేదంటూ విమర్శలు గుప్పించారు.
ఈటల వర్గీయులకు ప్రాధాన్యత ఇచ్చామంటున్న సంజయ్ వర్గం
ఈ విమర్శలు తర్వాత సంజయ్ వర్గీయులు ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది ఈటల అనుచరులకే అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనసులో ఏదో పెట్టుకుని తమను బదానం చేయడం తగదని సంజయ్ తెగ ఫీలైపోతున్నారు. ఈ క్రమంలోనే ఈటల మాట్లాడిన వీడియో టేప్స్ హుజురాబాద్‌లో ఈటల వర్గీయులకు ఎక్కడెక్కడ పార్టీ పదవుల దక్కయో అన్న విషయాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడానికి రెడి అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈలాంటి పరిణామాలు ట్రోల్ చేసుకుంటు ఉండటం కాశాయ శ్రేణులను గందోరగోళ పరుస్తుందట.
ఈ వ్యవహారంపై మాట్లాడవద్దని రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు
ఇద్దరు ముఖ్యనేతల రాజకీయ విమర్శలు ఎటూ దారితీస్తాయోనని కార్యకర్తాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై మాట్లడవద్దని రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో బీజేపీకి పాజీటివ్ వాతావరణం వస్తుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్న తరణంలో బండి, ఈటల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని పార్టీ పెద్దలు కూడా ఆందోళన చెందుతున్నారట. గత కొన్నాళ్లుగా ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నప్పటికి ఇంత బహిరంగంగా బయట పడకపోవటం చర్చనీయాంశంగా మారింది.
ఉప ఎన్నిక తర్వాత ఈటల, బండి సంజయ్‌ల మధ్య గ్యాప్
హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత నుంచి రాజేందర్‌కి బండి సంజయ్ గ్యాప్ పెరిగిందంటారు. ఆ క్రమంలో సంజయ్ ను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి తొలగించడంలో రాజేందర్ పాత్ర కీలకంగా ఉందని ప్రచారం సాగింది. అప్పటి నుంచి ఈ ఇద్దరు నేతలు ఎడమోహం.. పెడమోహం గానే ఉన్నారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవుల ఎంపిక సమయంలో రాజేందర్‌కు పదవి దక్కకుండా అడ్డుకున్నారనే ప్రచారం సాగింది. కొన్ని రోజుల పాటు ఈ ఇద్దరు నేతల అనుచరుల పాటు సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే నడిచింది. సైలెంట్‌గా ఉండి.. ఉండి.. ఒక్కసారిగా ఇద్దరు నేతలు నోరు విప్పారు. ఈ ఎపీసోడ్ పై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకంటుందో వేచి చూడాలి.
Story By KLN, Bigtv