BigTV English

Nandigam Suresh Future: నందిగం సురేష్ కథ రివర్స్.. కారణం ఇదేనా..?

Nandigam Suresh Future: నందిగం సురేష్ కథ రివర్స్.. కారణం ఇదేనా..?

Nandigam Suresh Future: వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ నాయకుడి హవా మామూలుగా ఉండేది కాదు. పేరుకి ఎంపీనే అయినప్పటికీ తనదైన దూకుడుతో యావత్తు రాష్ట్రంలో ఫోకస్ అయ్యారు. సామాజిక వర్గం లెక్కలతో జగన్‌ కూడా ఆయనకు అంతే ప్రాధాన్యత ఇవ్వడంతో సదరు నేత ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయనకు జగన్ అపాయింట్‌మెంట్ దొరికేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.. అప్పట్లో ఆయన దెబ్బకి స్థానిక ఎమ్మెల్యే కూడా బెంబేలెత్తిపోయారంట. వైసీపీలో అంత కీలకంగా వెలుగొందిన ఆయన ఇప్పుడు ఒంటరి అయ్యారు. పార్టీ పెద్దలు ఆయన్ని పట్టించుకోవడమే మానేశారంట. ఇంతకీ ఎవరా నేత అంటారా? లెటజ్ వాచ్


ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన నందిగామ సురేష్‌ 2019లో వీచిన వైసీపీ గాలిలో ఎంపీగా విజయం సాధించారు.. వైసీపీలో సామాన్య కర్యకర్తగా ఎంట్రీ ఇచ్చిన నందిగం సురేశ్… కూటమి అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలో అధికార పక్షనాయకులు పంట పొలాలను తగులబెట్టి జగన్ దృష్టిలో పడ్డారు. దాంతో జగన్ బాపట్ల ఎస్సీ సెగ్మెంట్ నుంచి సురేష్‌బాబును జగన్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి మాల్యాద్రి శ్రీరాం పై 16, 065 ఓట్ల మెజారిటీతో గెలిచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. పెద్దగా ఆర్థిక స్థోమత లేకపోయినా జగన్ ఆయనకి టికెట్ ప్రకటించడం అప్పట్లో రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఆయన బాపట్ల ఎంపీగా గెలిచినా ఆయన ఎప్పుడూ కూడా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలోని తాడికొండ నియోజకవర్గం నుంచే రాజకీయ నడిపారు. నందిగం సురేష్ స్వగ్రామం తాడికొండ సెగ్మెంట్లో ఉండటంతో ఆయన వ్యవహారాలన్నీ అక్కడి నుంచే నడిపించారు. ఆ క్రమంలో అప్పటి తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో ఆయనకు ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి.


ఆ ఇద్దరి పంచాయతీల్లో వైసీపీ అధిష్టానం ఎప్పుడూ నందిగం సురేష్‌కు బాసటగా నిలిచిందన్న ప్రచారం ఉంది. ఎమ్మెల్యేని ఎప్పటికప్పుడు బుజ్జగిస్తూ నందిగామ సురేష్ కి పార్టీ అధిష్టానం ఫుల్ సపోర్ట్ చేసిందంటారు. దానికి కారణం నందిగం సురేశ్ ప్రదర్శించే దూకుడే.. ముఖ్యమంత్రిగా జాగన్ ఏ పిలుపు ఇచ్చినా సురేష్ ముందుండేవారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి కేసులోనూ నందిగామ సురేష్ కీలకంగా ఉన్నారు. అమరావతి రాజధాని ఉద్యమాన్ని అణగదొక్కి, జగన్ గుడ్‌లుక్స్‌లో పడటానికి ఆయన చేయని ప్రయత్నం లేదంటారు.

తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు పరిధిలో ఆయన ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన ఇంటితోపాటు అక్కడ కొన్ని స్థలాలను అక్రమంగా అక్రమించి ఒక ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేసే వరకు ఆయన దౌర్జన్యాలు సాగాయి. అమరావతి ఉద్యమంలో ఎవరైతే కీలకంగా మారుతున్నారో వారిపై నిఘా పెట్టి.. వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌లన్నీ అధిష్టానానికి నందిగామ సురేష్ చేరవేసే వారంట. వైసీపీ ఎమ్మెల్సీ, రౌడీ షీటర్ అప్పి రెడ్డి ఏం చెప్తే అది చేసేవారంట. అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడు టిడిపి కేంద్ర కార్యాలయం దాడిలో మొదటి ముద్దాయిగా ఉన్న పానుగంటి చైతన్య ఎప్పుడు కూడా నందిగామ సురేష్‌తోనే ఉంటూ పంచాయతీలు చేసేవారంట.

వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేతలపై కూడా అనేకసార్లు దూకుడు ప్రదర్శించారాయన. టీడీసీ కేంద్ర కార్యాలయం పడి దాడి కేసులో నందిగామ సురేష్(Nandigam Suresh Future) ని అరెస్టు చేశాక ఆయనకి బెయిల్ వచ్చింది. అయితే 2020 డిసెంబర్‌లో రెండు సామాజిక వర్గాల మధ్య గొడవలు జరగడం.. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్న ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అప్పట్లో తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అయితే, ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను 78వ నిందితుడిగా తుళ్లూరు పోలీసులు చేర్చారు. ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం నందిగామ సురేష్ డిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Also Read: విశాఖ సీటు కోసం జీవీఎల్ కోటి ఆశలు..

ఇదే కాకుండా రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటన చేస్తున్న సమయంలో ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పై దాడి చేసిన కేసులో నందిగామ సురేష్ పై కేసు నమోదు అయింది.. అయితే వరుస కేసులతో నందిగామ సురేష్ అల్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ కేసులకు సంబంధించి ఆయన భార్య మాత్రమే బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు .. పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరు కూడా నందిగామ సురేష్ కేసుల విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ గా చూపిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ నాయకులకు, కేడర్‌కు అండగా నిలుస్తామంటూ ఓటమి తర్వాత జగన్ జైలుకెళ్లి సురేష్‌ని పరామర్శించి వచ్చారు. అయితే తర్వాత పట్టించుకోవడం మానేశారంట

వైసీపీ(YCP) కీలక నేతలు ఎవరూ కూడా నందిగామ సురేష్‌ని పలకరించిన పాపాన పోవడం లేదంట. వారి కుటుంబానికి ధైర్యం చెపుతున్న పరిస్థులు ఎక్కడా కనిపించడం లేదు.. స్వయంగా నందిగామ సురేష్ భార్య తన కుటుంబానికి ఎవరూ అండగా నిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టడం, అధికారులను బెదిరించడం, ఇక అమరావతి రైతులపై అనుచితంగా ప్రవర్తించడం వంటివన్నీ ఇప్పుడు చుట్టుకుని.. ప్రస్తుతం ఆయన్ని పట్టించుకునే వారే లేకుండా పోయారంట.

ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి వైసీపీలో ప్రస్తుతం నందిగామ సురేష్ ఒంటరి అయ్యాడు అని స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన నేతలెవరు నందిగామ సురేష్ కి సంబంధించిన కేసులు వ్యవహారం గురించి కనీసం తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేయడం లేదంట. తమ పరిస్థితి ఏంటో తెలియక చస్తుంటే ఇక వారి గురించి వీరి గురించి పట్టించుకునే తీరిక ఎక్కడుందని.. నందిగామ సురేష్ ప్రస్తావన వచ్చినప్పుడు కీలక నేతలు అంటున్నారంట. బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవ్వటమంటే ఇదేనేమో..

 

 

Related News

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

Big Stories

×