BigTV English

Champions Trophy 2025: ట్రోపీ కంటే ముందే టీమిండియాకు అగ్ని పరీక్ష..పిల్లబచ్చాలతోనే?

Champions Trophy 2025: ట్రోపీ కంటే ముందే టీమిండియాకు అగ్ని పరీక్ష..పిల్లబచ్చాలతోనే?

Champions Trophy 2025: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025  ( Champions Trophy 2025) ప్రారంభానికి ముందే టీమిండియాకు అగ్ని పరీక్షే ఎదురు కానుంది. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ( Champions Trophy 2025)  ప్రారంభానికి ముందు టీమిండియా క్రికెట్ జట్టు.. వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. దుబాయ్‌లో ( Dubai ) )బంగ్లాదేశ్ లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సన్నాహక మ్యాచ్‌ను ఆడే అవకాశం ఉంది రోహిత్‌ సేన. జాతీయ మీడియా నివేదిక ప్రకారం, రోహిత్ శర్మ ( Rohit  Sharma ) నేతృత్వంలోని టీమిండియా జట్టు.. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందే ఒక వార్మప్ మ్యాచ్ ( Warm up Match ) ఆడాలని ఐసీసీ ఆదేశించిదట. అయితే.. ఈ వార్మప్ మ్యాచ్ తేదీని ఇంకా నిర్ణయించలేదు.


Also Read: Mohammed Siraj: ఒరేయ్…ఆమె నా చెళ్లెలు.. డేటింగ్ పై సిరాజ్ క్లారిటీ..!

ప్రాథమిక సమాచారం ప్రకారం…. దుబాయ్‌లో భారత్, బంగ్లాదేశ్‌లు ( Bangladesh ) మాత్రమే తలపడనుండటంతో ఈ రెండు జట్లు వార్మప్‌ మ్యాచ్‌ లో తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం అందుతోంది. ఇక ఒక వేళ బంగ్లాదేశ్ అందుబాటులో లేని పక్షంలో వార్మప్ మ్యాచ్‌లో యూఏఈతో ( Uae ) భారత్ తలపడనుంది. మొత్తానికి ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందే టీమిండియాకు అగ్ని పరీక్షే ఎదురు కానుంది. ఒకవేళ బంగ్లా దేశ్‌ తో వార్మప్‌ మ్యాచ్‌ లో టీమిండియా ఆడితే.. గెలవడం కాస్త కష్టమే.


ఎందుకంటే…బంగ్లా దేశ్‌ జట్టు చాలా కసిగా ఆడుతుంది. కాబట్టి.. టీమిండియా కష్టపడాలి. ఒకవేళ వార్మప్‌ మ్యాచ్‌ లో టీమిండియా ఓడితే… ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో  ( Champions Trophy 2025)  ఆత్మ విశ్వాసం కోల్పోయి.. సరిగా ఆడకపోవచ్చు. అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సన్నాహక మ్యాచ్‌ను ఆడితే.. టీమిండియా ప్లస్‌ అవుతుంది. ఆ జట్టుపై టీమిండియా ఈజీగా గెలస్తుంది. మరి బంగ్లాదేశ్ లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ లలో ఏ జట్టుతో టీమిండియా ఆడుతుందో చూడాలి.

Also Read: Nitish Kumar Reddy Injury: SRH కి షాక్.. ఐపీఎల్ 2025 నుండి నితీష్ కుమార్ రెడ్డి ఔట్?

కాగా… ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎడిషన్ ( Champions Trophy 2025)  ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి వస్తున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. ICC ఛాంపియన్స్ టోర్నమెంట్‌ లో భాగంగా ఫిబ్రవరి 20న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో భారత్ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఆపై ఫిబ్రవరి 23న అదే వేదికపై హై-వోల్టేజ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఇక మార్చి 2న దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో చివరి గ్రూప్ స్టేజ్‌ మ్యాచ్ ఆడనుంది టీమిండియా. కాగా… ఇప్పటికే జనవరి 18న ICC ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ టోర్నమెంట్‌లో రోహిత్… టీమిండియాకు నాయకత్వం వహిస్తాడు. యువ ఓపెనింగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అతని డిప్యూటీగా ఉంటాడు. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో ఉన్నాడు.

Related News

IND VS PAK Women: అర్ధాంతరంగా ఆగిపోయిన పాకిస్తాన్ మ్యాచ్..పీక‌ల్లోతు క‌ష్టాల్లో టీమిండియా

Liam Livingstone: పెళ్లి చేసుకున్న ఆర్సీబీ డేంజ‌ర్ ప్లేయ‌ర్ లివింగ్‌స్టన్..ఫోటోలు వైర‌ల్

IND VS PAK Toss: టీమిండియాకు అన్యాయం.. టాస్ ఫిక్సింగ్ చేసిన పాక్, అంపైర్ తో క‌లిసి !

Krishnamachari Srikkanth: ఈ ద‌ద్ద‌మ్మ‌ల‌తో పోతే 2027 WC గెలవడం మర్చిపోవాల్సిందే..! గంభీర్ ఇజ్జత్ పాయే

IND VS PAK Women: టాస్ ఓడిన భారత్… షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానం.. నేలకు ముఖం వేసుకొని వెళ్లిపోయిన పాక్ కెప్టెన్

Harshit Rana: సిరాజ్ కంటే హర్షిత్ రాణా పోటుగాడా…ఆ పాచీ ముఖానికి కెప్టెన్సీ కూడా ఇచ్చి త‌గ‌లెట్టండి

Ajit Agarkar: రోహిత్‌, కోహ్లీని 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడనిచ్చేదే లేదు…అగార్క‌ర్ బ‌లుపు మాట‌లు !

Harjas Singh Triple Century: 135 బంతుల్లో 308 ప‌రుగులు..35 సిక్స‌ర్ల‌తో ఆసీస్ బ్యాట‌ర్ అరాచ‌కం

Big Stories

×