BigTV English
Advertisement

Anantapur Politics: కదిరి కదం తొక్కాలన్నా.. మడక శిర మడతెట్టాలన్నా..

Anantapur Politics: కదిరి కదం తొక్కాలన్నా.. మడక శిర మడతెట్టాలన్నా..

ఉమ్మడి అనంతలో వైసీపీకి పట్టున్న కదిరి, మడకశిర

కదిరి, మడకశిరలోనూ బలమైన నేతలు కావాలి- కేడర్ఉమ్మడి అనంతపురం జిల్లాలో కదిరి, మడకశిర నియోజకవర్గాల్లో వైసీపీకి ఎంతో పట్టున్న ప్రాంతాలు. ఎక్కడెలా కూడా.. ఈ రెండు చోట్ల మాత్రం గెలిచి పరువు నిలుపుకునేది వైసీపీ. ఒక సెగ్మెంట్ లో మైనార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటే. మరొకటి ఎస్సీ రిజర్వు స్థానం. ఈ రెండు చోట్ల కూడా వైసీపీకి ఎంతో పట్టుండటంతో.. 2014లో గెలుపు ఈజీ అయ్యింది. 2024 వచ్చేసరికల్లా సీన్ రివర్స్ అయ్యింది.


ముక్కూ మొహం తెలియని వారికి టికెట్లు, ఓటమిపాలు

ముక్కూ మొహం.. తెలియని వారికి టికెట్లు ఇవ్వడంతో వారు ఓటమి పాలయ్యారు. తర్వాత కొన్నాళ్ల పాటు అంతా సైలెంట్ గా ఉన్నారు. ఓడిన తర్వాత ఎవరైనా ఇలాగే ఉంటార్లే అనుకున్నారు. కానీ ఎన్నికలు ముగిసి 11 నెలలు కావస్తున్నా.. ఇంత వరకూ ఎలాంటి ఉలుకూ పలుకు లేకుండా టైం పాస్ చేస్తున్నారట.

ఓడాక పార్టీ కార్యకర్తలు జనం అన్న మాటే మరచిన మక్బూల్

వైసీపీ ఎంతో బలంగా ఉండే ప్రాంతమైన కదిరిలో కేవలం ఎన్నికల ముందొచ్చిన మక్బూల్.. ఓడిన తర్వాత ఆయన పార్టీ, కార్యకర్తలు, జనం అన్న మాటే మరచారట. తానేంటో తన వ్యాపారాలేంటో అన్నట్టుగా మారిపోయారట. దీంతో కార్యకర్తలు ఇదెక్కడి గొడవో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

కూటమిపై కామెంట్లు లేవు, మీడియా ముందుకు రారు..

కదిరి వైసీపీ అభ్యర్ధి మక్బూల్.. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనీసం ఒక్క మాటంటే ఒక్క మాట అనరు. మీడియా ముందుకు అసలే రారు. ఇక సోషల్ మీడియాలో పొలిటికల్ పోస్టులు చూస్తే జీరో జీరో. ఇదెక్కడి ఘోరం? ఇలా చేస్తే ఇంత పట్టున్న ప్రాంతంలో పార్టీ నామరూపాల్లేకుండా పోదా? అంటూ వీరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

ఇలాంటి వారికి టికెట్లు ఇచ్చి మాత్రం ప్రయోజనమేంటి?

ఇలాంటి వారికసలు టికెట్లు ఇచ్చి మాత్రం ప్రయోజనమేంటి? ఈ బ్యాడ్ టైంలోనేగా కార్యకర్తల బాగోగులు చూడాల్సింది? ఇప్పుడేగా మాకు అండగా నిలవాల్సింది? అంటూ నిలదీస్తున్నారట. ఇకనైనా అధిష్టానం.. అభ్యర్ధుల ఎంపిక విషయంలో కాస్త కళ్లు తెరిచి చూడాలన్న సూచనలు చేస్తున్నారట. పనిచేసేవాళ్లను గుర్తించి బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారట. ఈ దిశగా అధిష్టానానికి సంకేతాలను పంపుతున్నారట.

ఎస్సీ రిజర్వుడు మడకశిరలో పెద్ద కష్టపడకుండానే గెలుస్తూ వచ్చిన వైపీసీ

ఇక మరో నియోజకవర్గం మడకశిర. ఇది ఎస్సీ రిజర్వుడు. ఇక్కడ వైసీపీ పెద్ద గొప్పగా కష్టపడకుండానే గత రెండు ఎన్నికల్లో గెలుస్తూ వచ్చింది. అందులోనూ ఇక్కడి టీడీపీకి సరైన అభ్యర్ధి లేక పోవడంతో నల్లేరు మీద నడకే అయ్యింది. అయితే 2024లో నాటి అభ్యర్ధి తిప్పేస్వామిని కాదని.. ఉపాధి హామీ కూలీ.. ఈరా లక్కప్ప కు టికెట్ కేటాయించింది. లక్కప్ప అప్పటి వరకూ నియోజకవర్గంలో ఒక సాదారణ ఓటరు. ఆర్ధికంగా బలమైన వ్యక్తి కాక పోవడంతో.. తూతూమంత్రంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటికీ ఆయన పరిస్థితిలో ఏమంత మార్పులేదు. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్నారు.

Also Read: నేనే భూదేవి పుత్రుడు.. శాంతి కోసం సజీవ సమాధి..?

బలమైన టీడీపీ ఎమ్మెల్యే ముందు తేలిపోతున్న లక్కప్ప

ఒక పక్క మడకశిర కి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. బలమైన రాజు ముందు లక్కప్ప తేలిపోతున్నారట. దీంతో ఇక్కడ కూడా బలమైన ఇంచార్జీ అవసరముందని అంచనా వేస్తున్నారు. ఎంఎస్ రాజును ఢీకొట్టి నిలబడే నాయకుడు కావాలంటూ ఫ్యాను పార్టీ కేడర్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారట.

కదిరి, మడకశిరలోనూ బలమైన నేతలు కావాలి- కేడర్

ఇటీవల బలహీనంగా ఉన్న శింగనమలలో బలమైన నేత సాకే శైలజానాథ్ ని పార్టీలో తీసుకున్నట్టు.. కదిరి, మడకశిరలోనూ సరిగ్గా ఇలాంటి నేతలకే అవకాశమివ్వాలని కోరుతున్నారట. మరి చూడాలి.. కార్యకర్తల మాట విని అధినేత జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్న మాట వినవస్తోంది. కాటమరాయుడా కదిరీ నరసింహుడా అంతా నువ్వే చూస్కోవాలి. నీదే భారం తండ్రీ! అంటూ ఈ ప్రాంతానికే ప్రసిద్ధి చెందిన నరసింహస్వామిని మొక్కుతున్నారట.

 

Related News

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Big Stories

×