Man Attempts Live Burial: ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి చేసిన పనికి అందరూ షాక్‌కి గురయ్యారు. నానే భూదేవి పుత్రుడు అంటూ.. సజీవ సమాధి చేసుకోబోయాడు. దీనికి వాళ్ల కొడుకు కూడా సహరించాడు. ఐదు అడుగుల గుంట తవ్వి రేకులతో తానంతట తాను కవర్ చేసుకున్నాడు. ప్రపంచ శాంతి కోసం సజీవ సమాధిగా అవుతానని ప్రయత్నిస్తూ రేకులు కప్పుకుని ఐదు రోజులుగా ధ్యానం చేస్తున్నాడు కోటిరెడ్డి. ఒంటిపై బట్టలు లేకుండా గతంలోకి ప్రవేశిస్తాను అంటూ నానా హంగామా చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురం లో ఓ వ్యక్తి జీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించాడు. కోటిరెడ్డి ఉగాది పండుగ రోజున సజీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ముహూర్తంగా ఫిక్స్ చేసుకున్నాడు. ఇక 5 గంటల సమయంలో కోటిరెడ్డి తన కుమారుడితో కలసి ఆలయం దగ్గరకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశాడు. ఆ తర్వాత అయిదు అడుగుల మేర గుంట తీసుకుని, ఒంటిపై బట్టలు లేకుండా గుంటలోనికి ప్రవేశించాడు. కోటిరెడ్డి కుమారుడు ఆ గొయ్యిపై పెద్ద రేకు ఉంచి దానిపై మట్టి పోసి పూడ్చి వేశాడు.
షుమారు 5 గంటల పాటు ఆ వ్యక్తి గుంట లోనే ఉన్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు. అయితే కోటిరెడ్డి కొడుకు ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీయగా.. ఈ విషయం కోటిరెడ్డి తండ్రి అంజిరెడ్డికి తెలిసి.. మరికొందరు గ్రామస్థులతో కలిసి అక్కడకు వెళ్లి.. అతన్ని బయటకు రావాలని కోరారు. వెంటనే కోటిరెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. అతని దీక్షను భగ్నం చేసి, జీవసమాధి నుండి అతడిని బయటకు తీసి, గుంటను పూడ్చారు. విఠలాపురానికి చెందిన కైపు కోటిరెడ్డి కి గత కొన్ని సంవత్సరాలుగా భూదేవి అమ్మవారు ఒంట్లో కి వస్తుందని, అమ్మవారిపై భక్తితో 30 అడుగుల లోతులో 30 లక్షల రూపాయలతో ఓ గుడిని కూడా నిర్మించాడు. బూదేవి అమ్మవారి విగ్రహానికి నిత్యం పూజలు కూడా చేస్తున్నాడు. ఉగాది రోజు అతను జీవాసమాది అవుతున్నడంటూ గ్రామస్తులకు తెలియడంతో చూసేందుకు గ్రామస్తులు అక్కడికి భారీగా చేరుకున్నారు.
Also Read: నాగర్ కర్నూల్‌లో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం
కోటిరెడ్డి గుంటలో కూర్చుని దీక్ష చేపట్టిన కొన్ని గంటల్లోనే పోలీసులు వచ్చి జీవసమాది నుండి బయటకి తీశారు. ప్రపంచం లోనే భూదేవి అమ్మవారి ఆలయం ఎక్కడా లేదని, మొట్టమొదటి సారిగా ఆంద్ర ప్రదేశ్ లో నేనే నిర్మించానని అతడు చెప్తున్నాడు. తన పేరే భూదేవి పుత్రుడినని, ప్రపంచ శాంతి కొసమే, ఈ దీక్ష చేపట్టినట్లు ఆ భక్తుడు తెలిపాడు.