Operation Sindoor: ఆ లష్కరే తోయిబాకి ఏమైంది? ఒక పక్క సైఫుల్లా మృతి మరో పక్క.. లష్కరే సహ వ్యవస్థాపకుడు.. అమీర్ హంజా లాహోర్ లో ఆస్పత్రి పాలు. లష్కరే టార్గెట్ గా మనవాళ్లు ఏదైనా ఆపరేషన్- LET స్టార్ట్ చేశారా? లష్కరే మెయిన్ చీఫ్ హఫీజ్ సయీద్ ఎక్కడ? ఆయన కొడుక తల్హా తల కొట్టేశారా? లేక ఇంకా బతికే ఉన్నాడా? ఉంటే ఎక్కడ?
స్థానికుల పనా, సీక్రెట్ ఆపరేషనా?
భారత్ స్పెషల్ ఆపరేషన్ ఏదైనా నడుస్తోందా?అది పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్, మట్లీ పట్టణం. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సన్నిహితుడు.. రౌజల్లా నిజామానీ ఖలీద్ అలియాస్ అబు సైఫుల్లా ఖలీద్ ఇంటి నుంచి బయటకొచ్చాడు.. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు..ఖలీద్ తల, ఛాతిలో కాల్చి చంపారు. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు ఖలీద్.. ఖలీద్ ని కాల్చి చంపిందెవరు? ఇది స్థానికుల పనా? లేక ఏదైనా సీక్రెట్ ఆపరేషనా? అర్ధం కాలేదెవరికీ.
LET సహ వ్యవస్థాపకుడు హంజా ఆస్పత్రి పాలు
ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజా లాహోర్ లో ఆస్పత్రి పాలయ్యాడు. హంజా ఇంట్లో ఉండగా.. గాయపడి ఆస్పత్రి పాలయ్యాడనీ.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని తెలుస్తోంది. తుపాకీ కాల్పుల వల్లే హంజా గాయాల పాలయ్యాడనీ.. చెబుతున్నారు కొందరు. దర్యాప్తులో అలాంటిదేదీ లేదని తేలింది. ఇంతకీ ఎవరీ అమీర్ హంజా? అని చూస్తే.. లష్కరే తోయిబా కి మొత్తం 17 మంది వ్యవస్థాపక సభ్యులుంటే.. వారిలో ఒకడు హంజా. అమీర్ హంజా లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, అబ్దుల్ రెహ్మాన్ మక్కీలకు అత్యంత సన్నిహితుడు. అమీర్ హంజా.. ఐక్యరాజ్య సమితి గుర్తించిన టాప్ మోస్ట్ టెర్రరిస్టుల్లో ఒకడు కావడంతో.. అతడిపై అంతర్జాతీయ ఆంక్షలు అమలవుతున్నాయ్. అమెరికా ట్రెజరీ ప్రకారం.. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ ఆదేశాల మేరకు.. హంజా ఇతర ఉగ్రవాద సంస్థలతోనూ సత్సంబంధాలు కొనసాగించేవాడు. 2010 నాటికి హంజా హఫీజ్ సయీద్ నేతృత్వంలోని LET విశ్వవిద్యాలయ ట్రస్ట్ లో అధికారిగా, సభ్యుడిగా పలు పదవుల్లో పని చేశాడు.
తమ గ్రూపు ఉగ్రవాదులు విడిపించడంలో కీలకం
2010లో హంజా LET కోసం ఒక ప్రచారం రూపొందించాడు. నిర్బంధించబడిన తమ గ్రూపు సభ్యులు విడుదల కోసం చర్చలు జరిపిన ముగ్గురిలో ఒకడు. లష్కరే నాయకుల ప్రధాన ఆస్తి ఉద్రిక్తమైన ఉగ్రవాద ప్రసంగాలు చేయడం. టాప్ మోస్ట్ హఫీజ్ సయీద్ నుంచి కొడుకు తల్హా వరకూ అందరూ ఉద్విగ్న భరితమైన ఉగ్రవాద ప్రసంగాలు చేయడంలో ఆరితేరిన వారే. అలాంటి ఉగ్రప్రసంగీకుల్లో హంజా కూడా ఒకడు. ఈయన ఇటు ప్రసంగాలే కాదు.. అటు పుస్తకాలు కూడా రాశాడు. 2002లో హంజా ఖాఫిలా ద వత్ ఔర్ షాహదత్ అనే పుస్తకం రాశాడు. మతమార్పిడి, బలిదానం ప్రాముఖ్యత ఏంటో ఈ పుస్తకం ద్వారా వివరించాడు హంజా. హంజా ఇప్పటి వరకూ లష్కరే తోయిబా కోసం ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డాడంటే.. నిధుల సేకరణ, నియామకం, ఉగ్రవాదుల విడుదలపై చర్చల వంటి అంశాలు అతి ముఖ్యమైనవి. ఒక రకంగా చెప్పాలంటే లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కి రైట్ హ్యాండ్ గా పని చేశాడు హంజా.
జేష్-ఏ-మంకాఫా అనే కొత్త ఉగ్ర గ్రూపు స్థాపన
2018లో ఎల్ఈటీ సంబంధిత సంస్థ జమాత్- ఉద్- దవా, ఫలా- ఏ- ఇన్సానియత్ ఫౌండేషన్ లపై పాకిస్థాన్ అణిచివేత చర్యలు చేపట్టింది. దీంతో తాను లష్కరే నుంచి దూరమయ్యాడు హంజా. అంతే కాదు జమ్మూ- కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో లష్కరే ఉగ్ర ఎజెండా కొనసాగించడానికి.. జేష్- ఏ- మంకాఫా అనే కొత్త ఉగ్ర గ్రూపును ఏర్పాటు చేశాడు. ఈ గ్రూపు పాకిస్థాన్ లో స్వేచ్ఛగా పని చేస్తోందని, హంజా.. LET అగ్ర ఉగ్ర నాయకత్వంతో ఇంకా సంబంధాలు కొనసాగిస్తున్నాడనే భావిస్తున్నారు. అలాంటి మోస్ట్ వాంటెడ్ LET టెర్రరిస్టుల్లో ఒకడైన హంజా.. ప్రస్తుతం ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కుంటున్నాడు. కాల్పుల కారణంగా హంజా గాయాల పాలైనట్టు కొందరు చెబుతున్నా… అలాంటిది ఏదీ లేదన్న రిపోర్టులు అందుతున్నాయ్. కానీ ఇందులో నిజమెంత? అని తేలాల్సి ఉంది. పాకిస్థాన్ దర్యాప్తు సంస్థలు.. అది కూడా ఉగ్రవాదుల విషయంలో అన్నీ నిజాలు చెబుతాయని అస్సలు ఊహించలేం. ఇప్పటికే లష్కరే తోపాటు, పాకిస్థాన్ ప్రభుత్వం సైతం.. సైఫుల్లా ఖలీద్ ని ఎవరు చంపారో అర్ధం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాయ్. ఈ దాడుల వెనక భారత భద్రతా దళాల ప్రమేయం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ కాల్చి చంపిన దుండగులెవరో కనుగొనే దిశగా విచారణ చేస్తున్నారు.
2008 యూపీ రాంపూర్ CRPF శిబిరంపై దాడి
సైఫుల్లా ఖలీద్ 2006లో నాగ్ పూర్ RSS హెడ్ క్వార్టర్ పై జరిగిన దాడిలో ప్రధాన సూత్రధారి. 2005లో బెంగళూరు ఐఐఎస్సీ పై జరిగిన ఉగ్రదాడిలో ఖలీద్ కూడా ఉన్నాడు. ఈ దాడిలో ఐఐటీ ప్రొఫెసర్ మునీష్ చంద్ర పూరి మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. ఇక 2008లో ఉత్తరప్రదేశ్ రాంపూర్ లోని సీఆర్పీఎఫ్ శిబిరంపై జరిగిన ఘోరమైన దాడికి నాయకత్వం వహించాడు ఖలీద్. దీని ఫలితంగా మరో ఎనిమిది మంది చనిపోయారు. ఇక 2000 సంవత్సరం నుంచి ఖలీద్ లష్కరే నేపాల్ మాడ్యుల్ కి నాయకత్వంవహించాడు. కార్యకర్తల నియామకం, లాజిస్టిక్స్ వంటి కార్యకలాపాలకు పాల్పడే వాడు. ఈ మాడ్యుల్ ని భారత దర్యాప్తు సంస్థలు.. గుర్తించిన తర్వాత అతడు తిరిగి పాకిస్థాన్ చెక్కేశాడు. జమ్మూ కాశ్మీర్ లష్కరే కమాండర్ యూసఫ్ ముజమ్మిల్, ఇక్బాల్ షష్మీ, యూసఫ్ తైబీ వంటి అనేక మంది కీలక ఉగ్రవాదులతో కలసి పని చేశాడు. ఇటీవల లష్కరే, జమాత్- ఉద్- దవా నాయకత్వ ఆదేశాల మేరకు సింధ్ ప్రావిన్స్ లలో.. మరీ ముఖ్యంగా బాదిన్, హైదరాబాద్ జిల్లాల నియామకాలు, నిధుల సేకరణ వంటి విషయాలతో నెట్ వర్క్ పునరుద్దరణ పనులు నిర్వహిస్తున్నాడు ఖలీద్.
ఖలీద్‌ని ష్యూర్ షాట్ కొట్టిందెవరు?
ఇప్పుడు లష్కరేని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే.. తమకు ఎంతో కీలకమైన ఈ ఇద్దరు నేతలను టార్గెట్ చేసిందెవరు. తాము అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించిన ఖలీద్ ని ష్యూర్ షాట్ కొట్టిందెవరు? వీరు ఏ గ్రూపులకు చెందిన వారు అయి ఉంటారన్న కోణంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది లష్కరే నాయకత్వం. మొన్నటి ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ముజఫరా బాద్ దాడుల్లో హఫీజ్ సయీద్ కొడుకు తల్హా సయీద్ అతడి ఐదుగురు కమాండర్లు హతమయ్యరన్న వార్తలు వినిపించాయి. పెహెల్గాం దాడి తర్వాత హఫీజ్ సయీద్.. పంజాబ్ ప్రావిన్స్ లో తలదాచుకున్నాడని అన్నారు. ఒక దశలో హఫీజ్ సైతం హతమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. మరో ఇద్దరు ముగ్గురు లష్కరే కీలక ఉగ్రవాదులు సైతం గత ఆపరేషన్ సిందూర్ లో హతమయ్యారు. లష్కరే కేంద్రంగా ఇన్నేసి సంచలన వార్తలు వినిపిస్తున్నాయంటే.. భారత్ స్పెషల్ ఆపరేషన్ ఏదైనా నడిపిస్తోందా? ఈ అంశంపై అమెరికన్ సీఐఏ ప్రతినిథులు ఏమంటున్నారు? ఇందుకు సరిపోయే ఇతర ఆధారాలేంటి? ఇండియా యూజింగ్ తాలిబన్ నెట్ వర్క్.. టూ అసాసినేట్ కాశ్మీరీ మిలిటెంట్ ఇన్ పాకిస్తాన్. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది మరెవరో కాదు.. ఏడాది క్రితం ఒక ఇంటర్వ్యూలో సీఐఏ మాజీ ఏజెంట్ సారా ఆడమ్స్.
ఏడాది క్రితం.. ద షాన్ ర్యాన్ షోలో కామెంట్ చేసిన సారా
పాకిస్థాన్ లో నక్కిన టెర్రరిస్టులను వరుసగా లేపేస్తోంది ఇండియానే.. టాప్ టెర్రరిస్టులను లేపెయ్యడానికి తాలిబన్ నెట్ వర్క్ ని ఇండియా వాడుకుంటోందంటూ.. ఈ మాజీ సీఐఏ ఏజెంట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ద షాన్ ర్యాన్ షోలో ఆమె గతంలో చేసిన కామెంట్లను ప్రస్తుత పరిణామాలకు లింక్ చేస్తూ కొందరు ఈ వీడియోన రీపోస్ట్ చేస్తున్నారు. సీఐఏ ఏజెంట్లు ఏడాది క్రితం చేసిన కామెంట్లకు ప్రస్తుత పరిణామాలకు లింక్ చేస్తూ మరికొన్ని కథనాలు కూడా వెలుగు చూస్తున్నాయ్. ఇటీవల భారత్- ఆఫ్గన్ సంబంధాలపై పాకిస్థాన్ డీజీఐఎస్పీఆర్ కొన్ని కాలకమైన కామెంట్లు చేశారు. అయితే ఉగ్రవాద పుట్టిల్లయిన పాకిస్థాన్ గడ్డపై నుంచి.. భారత్ పై చేసిన ఈ ఆరోపణలు ప్రపంచం పెద్దగా పట్టించుకోలేదు. సరిగ్గా అదే సమయంలో పాక్ డీజీ ఐఎస్ పీఆర్ అహ్మద్ షరీఫ్ చౌదరీ మరెవరో కాదు అణు ఉగ్రవాది సుల్తాన్ బషీరుద్దీన్ కొడుకు. దీంతో ఒక ఉగ్రవాది కొడుకు భారత్ లాంటి దేశంపై ఉగ్ర ఆరోపణలు చేయడమేంటన్న కథలనాలు భారీ ఎత్తున వెలువడ్డాయ్. దీంతో ఈ వ్యవహారం అక్కడితో సద్దుమణిగింది.
ఆ D మరేదో కాదు ఆప్గన్ డోర్ తెరవడమే..
అయితే ఏప్రిల్ 22న జరిగిన పహెల్గాం దాడి తర్వాత.. మోడీ ప్రభుత్వం ప్లాన్ చేసిన సిక్స్- D ఫార్ములాలో భాగంగా ఆపరేషన్ సిందూర్ కి ముందే ఒక Dని అమలు చేసింది. ఆ D మరేదో కాదు ఆఫ్గన్ డోర్ తెరవడం. పాక్, POJK లో తిష్టవేసిన ఉగ్రవాద శిబిరాలను ఏరి పారేయడానికి.. సైన్యానికి ఒక పక్క పూర్తి స్వేచ్ఛనిస్తూనే.. మరో పక్క తాలిబన్లతో చర్చలు చేసింది భారత్. ఖైబర్ పక్తుంక్వా విషయంలో తాలిబాన్ వర్సెస్ పాకిస్థాన్.. ఆల్రెడీ ఒక గొడవ నడుస్తోంది. సరిగ్గా ఈ సమయంలో భారత్ ఆఫ్గనిస్తాన్ టచ్ లోకి వెళ్లడం.. కీలక మలుపుగా మారింది. భారత ప్రతినిథి బృందం.. తాలిబాన్ అగ్రనాయకత్వాన్ని కలిసింది. పాక్ ఇక్కడ తన అధికారులను యూరప్ తదితర దేశాలకు తరలించడం, ఉగ్రవాదులను బంకర్లలో దాచడం, పైకి తటస్త దర్యాప్తు కోరుతూనే.. వైమానిక దళాన్ని సరిహద్దులకు మరలిస్తుండగా.. న్యూఢిల్లీ- కాబూల్ మధ్య చర్చలు జరిగాయి.
Also Read: ఈటలకు బిగుస్తున్న ఉచ్చు
ఆప్గన్ శరణార్థులను బహిష్కరించిన పాక్
తొలి నాళ్లలో పాక్- ఆఫ్గన్ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. తాలిబాన్లు కాబూల్ ని స్వాధీనం చేసుకోవడంతో సంబరాలు చేసుకోడానికి పాక్ ISI చీఫ్ తన పటాలంతో సహా అక్కడికెళ్లిన పరిస్థితులున్నాయి. అయితే కొన్ని కొన్ని సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద ఆరోపణలతో పాటు.. పాకిస్తాన్- ఆఫ్గన్ శరణార్థులను సామూహికంగా బహిష్కరించడం కారణంగా గత ఏడాది కాలంగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆఫ్గన్ సందర్శించిన కొన్నాళ్లకే భారత్ తన దౌత్య పర్యటన చేసి.. ఆ దేశంతో చెలిమి చేసే యత్నం ప్రారంభించింది.
పహెల్గాం దాడి తరహా ఉగ్రవాదంపై తాము జీరో టాలరెన్స్ పాలసీ మెయిన్ టైన్ చేస్తున్నామని భారత్ జీ 20, గల్ఫ్ సహా 25 దేశాల దౌత్య వేత్తలకు ముందుగానే నివేదించింది. అందులో భాగంగా తానిటు సైనిక చర్యలు తీసుకుంటూనే అటు ఆఫ్గన్ తో వ్యూహాత్మక సంబంధాన్ని మెరుగు పరుచుకుంది. ఇక్కడ గుర్తించాల్సిన విషయమేంటంటే.. పాక్- చైనాతో చేతులు కలపగా.. భారత్ తాలిబాన్లకు దగ్గరయ్యే యత్నం చేసింది.
ఇటీవలి ప్రాంతీయ పరిణామ క్రమాలపై చర్చలు
ఏప్రిల్ 28న పాక్, ఆఫ్గన్, ఇరాన్ భారత సంయుక్త కార్యదర్శి ఆనంద్ ప్రకాష్.. కాబూల్ లోని తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకినీని కలిశారు. ఈ సమావేశంలో.. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, రవాణా వంటి అంశాల ప్రస్తావన వచ్చింది. వీటితో పాటు ఇటీవలి ప్రాంతీయ పరిణామ క్రమాలపై ఇరు పక్షాలు అభిప్రాయ మార్పిడి చేసుకున్నాయి. భారత ప్రతినిథి ఆఫ్గన్ వెళ్లక ముందే తాలిబాన్లు పహెల్గాం దాడిని ఖండించారు కూడా. హెల్గాంలో జరిగిన దాడిని ఆఫ్గనిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్ విదేశాం మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియ చేసింది. ఈ దిశగా తాలిబాన్ ప్రతినిథి అబ్ధుల్ ఖహార్ బాల్కీ అన్నారు. దీన్నిబట్టీ భారత్- ఆఫ్గాన్ సంబంధాల మెరుగుదల పాక్- ఆఫ్గాన్ సంబంధాల క్షీణతను ఎత్తి చూపుతోందని అంటారు నిపుణులు. టన్నిటిని బట్టీ చూస్తుంటే.. మాజీ CIA ఏజెంట్ సారా ఊహ.. నిజమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు దౌత్య వ్యవహారాల నిపుణులు. సైఫుల్లా ఖలీద్ వంటి వారిని హతమార్చడంలో తాలిబాన్ గ్రూపుల హస్తం ఉండొచ్చని కూడా అంటున్నారు.
తాలిబాన్ల సాయంతో కాశ్మీర్‌ని రక్తసిక్తం చేయాలన్న పాక్ దురాలోచన
పాకిస్థాన్ లోకి చొరబడి.. వారి ఉగ్రవాదులను అంతమొందించడం అంటే అదంత తేలికైన పని కాదు. వారితో సమానమైన వారితోనే సాధ్యం. తాలిబాన్లయితే ఎలాంటి అనుమానం రాకుండా ఈ ఆపరేషన్ ముగించగలరన్న ఆలోచనతోనే.. ఇదంతా జరుగుతోందా? అన్న అనుమానాలకు ఆస్కారమేర్పడుతోంది. క్కడ మరో ట్విస్ట్ ఏంటంటే పాకిస్థాన్ తాను పెంచి పోషిస్తూన్న టెర్రరిజంతో పాటు తాలిబాన్ల సాయం సైతం తీసుకుని కాశ్మీర్ ని రక్త సిక్తం చేయాలన్న ఆలోచన చేసింది. అలాగని ఆదేశంతో పాకిస్థాన్ సఖ్యతగా వ్యవహరించలేదు. వారి శరణార్థులను తీవ్రంగాతిప్పికొట్టడం మాత్రమే కాకుండా.. ఖైబర్ ఫంక్తుక్వా వంటి పలు కీలకాంశాల్లో విబేధించడం మొదలు పెట్టింది. దీంతో పాక్- ఆఫ్గన్ మధ్య సంబంధాలు చెడిపోవడంతో.. భారత్ ఈ దిశగా పావులు కదిపినట్టు భావిస్తున్నారు.